షార్జా: ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భారత్ నాకౌట్ బెర్తే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. గ్రూప్ ‘ఎ’లో సోమవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో బహ్రెయిన్‌తో సునీల్ ఛెత్రి సేన తలపడుతుంది. కెప్టెన్‌గా ఛెత్రికిది 107వ మ్యాచ్. మాజీ సారథి బైచుంగ్ భూటియా (107) రికార్డును సమం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మ్యాచ్‌లో కనీసం ‘డ్రా’ చేసుకున్నా టీమిండియా నాకౌట్ దశకు చేరుతుంది. బహ్రెయిన్‌తో ఒకవేళ ఓడినా భారత్‌కు నాకౌట్ అవకాశాలున్నాయి. మొత్తం ఆరు గ్రూపుల్లో నాలుగు జట్లు అత్యుత్తమ మూడో స్థానం ద్వారా నాకౌట్ చేరొచ్చు. ఇప్పటివరకు బహ్రెయిన్‌తో ఏడు సార్లు ముఖాముఖీగా తలపడిన భారత్ కేవలం ఒక్కసారి (1979లో) మాత్రమే గెలిచింది. బహ్రెయిన్ ఐదింట గెలుపొందగా... మరో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment