I-League: Sreenidi Deccan beat Round Glass Punjab back on top - Sakshi
Sakshi News home page

Sreenidi Deccan FC: మళ్లీ టాప్‌ ర్యాంకులోకి శ్రీనిధి డెక్కన్‌ ఎఫ్‌సీ

Published Wed, Jan 18 2023 10:20 AM | Last Updated on Wed, Jan 18 2023 11:29 AM

I League: Sreenidi Deccan FC Beat Round Glass Punjab Back Tops - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ఫుట్‌బాల్‌ ఐ–లీగ్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) మళ్లీ టాప్‌ ర్యాంక్‌లోకి వచ్చింది. మంగళవారం జరిగిన తమ 12వ లీగ్‌ మ్యాచ్‌లో శ్రీనిధి జట్టు 4–0 గోల్స్‌ తేడాతో రౌండ్‌గ్లాస్‌ పంజాబ్‌ ఎఫ్‌సీ జట్టును చిత్తుగా ఓడించింది.

శ్రీనిధి జట్టు తరఫున కెప్టెన్‌ డేవిడ్‌ కాస్టెనెడా మునోజ్‌ రెండు గోల్స్‌ (30వ, 88వ ని.లో) చేయగా ... షహబాజ్‌ (12వ ని.లో), సొరైషామ్‌ దినేశ్‌ సింగ్‌ (62వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు. 12 జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో శ్రీనిధి జట్టు 12 లీగ్‌ మ్యాచ్‌లు పూర్తి చేసుకొని 8 విజయాలు, ఒక ‘డ్రా’, మూడు పరాజయాలతో మొత్తం 25 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో ఈనెల 23న ముంబైకి చెందిన కెన్‌క్రె ఎఫ్‌సీ జట్టుతో శ్రీనిధి జట్టు ఆడుతుంది.

చదవండి: Womens U19 World Cup: హైదరాబాద్‌ అమ్మాయికి బంపరాఫర్‌.. భారత జట్టులో చోటు
India vs New Zealand: హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. అన్నింటా భారత్‌దే పైచేయి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement