లిమా: పెరూకు చెందిన ఓ ఫుట్‌బాలర్ విజ్ఞత మరిచి ఫీల్డ్‌లోనే మూత్ర విసర్జన చేయడంతో ఆగ్రహించిన రిఫరీ రెడ్‌కార్డ్‌తో బయటికి పంపించాడు. లోయర్ డివిజన్ ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా అట్లెటికొ అవజున్, కాంటర్సిల్లో ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో అవజున్ జట్టుకు 71వ నిమిషంలో కార్నర్ కిక్ లభించింది.
సెబాస్టియన్ మునొజ్ కొట్టిన కిక్‌ను కాంటర్సిల్లో గోల్ కీపర్ అడ్డుకున్నాడు. ఇది భరించలేకపోయిన మునొజ్ కనీస విజ్ఞత లేకుండా విరామ సమయంలో మైదానంలోనే మూత్ర విసర్జన చేశాడు.
దీన్ని కాంటర్సిల్లో ప్లేయర్లు రిఫరీ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే అతనికి రెడ్‌కార్డ్ చూపి బయటికి పంపించాడు. ఫుట్‌బాల్ ఆటలో ఇలా మూత్రవిసర్జన చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆర్సెనల్ గోల్‌కీపర్ లెహ్‌మన్, ఇంగ్లండ్ లెజెండ్ లినెకర్‌లు కూడా ఇలాంటి చర్యకు పాల్పడి మైదానం వీడారు.
Comments
Please login to add a commentAdd a comment