red cards
-
మైదానంలో మూత్ర విసర్జన... ఫుట్‌బాలర్‌కు రెడ్‌కార్డ్
లిమా: పెరూకు చెందిన ఓ ఫుట్‌బాలర్ విజ్ఞత మరిచి ఫీల్డ్‌లోనే మూత్ర విసర్జన చేయడంతో ఆగ్రహించిన రిఫరీ రెడ్‌కార్డ్‌తో బయటికి పంపించాడు. లోయర్ డివిజన్ ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా అట్లెటికొ అవజున్, కాంటర్సిల్లో ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో అవజున్ జట్టుకు 71వ నిమిషంలో కార్నర్ కిక్ లభించింది. సెబాస్టియన్ మునొజ్ కొట్టిన కిక్‌ను కాంటర్సిల్లో గోల్ కీపర్ అడ్డుకున్నాడు. ఇది భరించలేకపోయిన మునొజ్ కనీస విజ్ఞత లేకుండా విరామ సమయంలో మైదానంలోనే మూత్ర విసర్జన చేశాడు. దీన్ని కాంటర్సిల్లో ప్లేయర్లు రిఫరీ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే అతనికి రెడ్‌కార్డ్ చూపి బయటికి పంపించాడు. ఫుట్‌బాల్ ఆటలో ఇలా మూత్రవిసర్జన చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆర్సెనల్ గోల్‌కీపర్ లెహ్మన్, ఇంగ్లండ్ లెజెండ్ లినెకర్లు కూడా ఇలాంటి చర్యకు పాల్పడి మైదానం వీడారు. -
ఇక క్రికెట్లో ‘రెడ్ కార్డ్’!
బ్యాట్ సైజ్ తగ్గింపు ఎంసీసీ కీలక సిఫార్సులు ఆమోదిస్తే అక్టోబర్ నుంచి అమలు ముంబై: క్రికెట్లో బంతికి, బ్యాట్‌కు మధ్య సమతుల్యం తేచ్చేందుకు మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ప్రయత్నిస్తోంది. రెడ్ కార్డ్ సస్పెన్షన్, బ్యాట్ సైజ్ కుదింపులాంటి విప్లవాత్మక మార్పులను క్రికెట్ ‘లా’మేకర్ అయిన ఎంసీసీ ప్రపంచ క్రికెట్ కమిటీకి సూచించింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ బ్రియర్లీ అధ్యక్షతన రెండు రోజుల పాటు సమావేశమైన ఈ కమిటీ... పలు అంశాలపై కూలంకషంగా చర్చించింది. ఈ కమిటీ భేటీలో మాజీ ఆటగాళ్లు రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), రమీజ్ రాజా (పాకిస్తాన్), జాన్ స్టీఫెన్సన్ (ఎంసీసీ చీఫ్) పాల్గొన్నారు. ఈ సిఫార్సులను ఎంసీసీ ప్రధాన కమిటీకి నివేదిస్తారు. అక్కడ అమోదం పొందితే ‘లా ఆఫ్ క్రికెట్’లో కొత్త కోడ్ వచ్చే ఏడాది అక్టోబర్‌లో మొదలవుతుంది. ఎవరైనా ఆటగాడు మైదానంలో మొరటుగా ప్రవర్తిస్తే ‘రెడ్ కార్డ్’ సస్పెన్షన్ వేటు వేయాలని సిఫారసు చేసిందీ కమిటీ. ఈ తరహా వేటు ప్రస్తుతం ఫుట్‌బాల్, హాకీ తదితర ఆటల్లో అమల్లో ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను ప్రవేశపెట్టడంపై అడుగులు వేయాలని కమిటీ సూచించింది. హెల్మెట్‌కు తాకి వచ్చినా... బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి ఫీల్డర్ హెల్మెట్‌కు తగిలి క్యాచ్ పడితే ప్రస్తుతం నాటౌట్‌గా ఇస్తున్నారు. ఇక నుంచి దానిని అవుట్‌గా పరిగణించాలని సూచించారు. బ్యాట్ సైజ్‌పై పాంటింగ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న బ్యాట్‌ను కుదించేందుకు 60 శాతం ఆటగాళ్లు మద్దతిస్తున్నారని అన్నారు. బ్యాట్ బ్లేడ్ సైజ్ 40 మిల్లీమీటర్లు మించకుండా చూడాలని ప్రతిపాదించారు. ఒలింపిక్స్ తదితర క్రీడల్లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడాన్ని బీసీసీఐ వ్యతిరేకిస్తూ వచ్చింది. దీంతో అందరిని సంతృప్తి పరిచాకే తుదినిర్ణయం తీసుకోవాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. -
అడగండి చెబుతాం...
హాకీలో ఆటగాళ్లకు శిక్ష విధించే గ్రీన్, ఎల్లో, రెడ్ కార్డులను ఎప్పుడు వాడతారు? ప్రశ్న అడిగిన వారు: స్వరూప్ కుమార్, నెల్లూరు సాధారణంగా హాకీ మైదానంలో ఆటగాళ్లు క్రమశిక్షణ తప్పకుండా అదుపులో ఉంచేందుకు రిఫరీలు ఈ కార్డులను ఉపయోగించి హెచ్చరిస్తారు. ఇందులో అన్నింటికంటే తక్కువ రకమైన శిక్షగా గ్రీన్ కార్డును చెప్పవచ్చు. మైదానంలో ప్రత్యర్థి ఆటగాడిని ఆపే ప్రయత్నంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు భావిస్తే దీంతో హెచ్చరిస్తారు. గ్రీన్ కార్డు చూసిస్తే ఆటగాడు రెండు నిమిషాల పాటు మైదానం వీడాల్సి ఉంటుంది. ఆ తర్వాతి స్థాయిలో ఎల్లో కార్డ్‌ను జారీ చేస్తారు. ప్రత్యర్థి పట్ల దురుసుగా ప్రవర్తించడం, స్టిక్‌తో కాకుండా శరీరంతో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఎల్లో కార్డు చూపించి ఆటగాడిని బయటికి పంపిస్తారు. ఇందులో కనీసం 5 నిమిషాల పాటు మైదానం వీడాలి. అంతకంటే ఎక్కువ సమయం కూడా శిక్షించవచ్చు. రెడ్ కార్డు అన్నింటిలోకి పెద్ద శిక్ష. ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి ఆటగాడిపై శారీరకంగా దాడి చేసేందుకు ప్రయత్నించడం, రక్తమోడటంలాంటిది ఏదైనా జరిగితే రెడ్ కార్డు చూపిస్తారు. రెడ్ కార్డు శిక్షకు గురైతే చూపిస్తే ఆ మ్యాచ్ మొత్తంలో అతను ఆడటానికి వీలుండదు. దాంతో పాటు తర్వాతి మ్యాచ్ కూడా ఆడకుండా నిషేధం విధిస్తారు. అయితే శిక్షల్లో స్థాయి భేదాలు అంతా రిఫరీ నిర్ణయంపైనే ఆధార పడి ఉంటుంది. ఏ కార్డు ద్వారానైనా ఆటగాడు బయటికి వెళితే మిగతా 10 మంది సభ్యులతోనే సదరు జట్టు మ్యాచ్‌ను ఆడాల్సి ఉంటుంది. ఇది ఆ మ్యాచ్ ఫలితంపై కూడా ప్రభావం చూపవచ్చు.