సాక్షి, హైదరాబాద్: రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ టోర్నీలో ముఫకంజా ఇంజనీరింగ్ కాలేజి జట్టు గెలుపొందింది. మంగళవారం జరిగిన కాలేజి బాలుర మ్యాచ్‌లో ముఫకంజా 4–1తో ఎంవీ సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజిపై నెగ్గింది. మరో మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 3–0తో కేజీరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీని ఓడించింది. సీనియర్ బాలుర విభాగంలో ఫ్యూచర్‌కిడ్స్ స్కూల్ జట్టు 1–0తో గ్లెండేల్ అకాడమీపై గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment