Reliance foundation youth sports
-
మహిళా క్రికెట్: నీతా అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో విమెన్స్ టీ20 (మహిళల ఐపీఎల్)2020 టైటిల్ విజేతగా ట్రైల్ బ్లేజర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫైనల్మ్యాచ్కు ముందు రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫైనల్ పోరులో ఎవరు గెలిచినా ఆ విజయం ఎంతోమంది ఔత్సాహిక మహిళా క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆమె భారతదేశంలో మహిళల క్రికెట్‌కు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి నీతా అంబానీ ఇన్‌స్టాలో సోమవారం ఒక వీడియో పోస్ట్ చేశారు. ప్రతి రంగంలో, ముఖ్యంగా క్రీడా, విద్యా రంగాల్లో మహిళలను ప్రోత్సహించాలని, వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నీతా పేర్కొన్నారు. ఇందుకు తమ ఫౌండేషన్ తరపున బాలికలు అందరికీ విద్య, క్రీడా అవకాశాలు అందించాలనేదే తన ధ్యేయమని చెప్పారు. మౌలిక వసతులు, సదుపాయాలతోపాటు, అవకాశాలు, నైపుణ్య శిక్షణ అవసరమన్నారు. ఈ విషయంలో తమ ఫౌండేషన్ చాలా కృషి చేస్తోందని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో దేశానికి 33 మందితోపాటు, 12 మంది విదేశీ మహిళా క్రికెటర్లు జియో విమెన్ 2020లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అలాగే తొలిసారి థాయ్‌లాండ్ నుంచి నాథకాన్(24) పాల్గొంటున్నారని నీతా అంబానీ తెలిపారు. క్రీడల్లో బాలికల ప్రోత్సాహం కోసం నవీముంబైలో ఒక జియో క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. అమ్మాయిలకు సరైన అవకాశాలు కల్పిస్తే, గ్లోబల్‌గా రాణిస్తారనే విషయాన్ని మరోసారి నిరూపించారని నీతా ప్రశంసించారు. టీమిండియా మహిళల క్రికెట్ జట్టు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అద్భుతంగా రాణిస్తోందన్నారు. గత ఆరేళ్లుగా అంజుం చోప్పా, జులన్గోస్వామి, మిథాలీ రాజ్లాంటి లెజెండ్లు మంచి పేరు సంపాదించారన్నారు. అలాగే స్మృతి మంధన, పూనం యాదవ్, హర్మన్ ప్రీత్‌కౌర్ మన మహిళా క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళుతున్నారని చెప్పారు. భవిష్యత్తులోమరింత రాణించనున్నారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా డిఫెండింగ్ ఛాంపియన్ సూపర్నోవాస్ను ఓడించి మూడేళ్లలో తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది ట్రైల్ బ్లేజర్స్. జియో అండ్ రిలయన్స్ ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ మహిళల టి 20 ఛాలెంజ్‌ను స్పాన్సర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. View this post on Instagram “In the end, women’s cricket will be the winner today.” - Mrs. Nita Ambani. . Here’s how Reliance Foundation Education and Sports for All and JIO are bridging the gender divide in sport. . #OneFamily #MumbaiIndians #MI #JioWomensT20Challenge @reliancefoundation @reliancejio A post shared by Mumbai Indians (@mumbaiindians) on Nov 9, 2020 at 7:17am PST -
ముఫకంజా ముందంజ
సాక్షి, హైదరాబాద్: రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ టోర్నీలో ముఫకంజా ఇంజనీరింగ్ కాలేజి జట్టు గెలుపొందింది. మంగళవారం జరిగిన కాలేజి బాలుర మ్యాచ్‌లో ముఫకంజా 4–1తో ఎంవీ సుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజిపై నెగ్గింది. మరో మ్యాచ్‌లో హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 3–0తో కేజీరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీని ఓడించింది. సీనియర్ బాలుర విభాగంలో ఫ్యూచర్‌కిడ్స్ స్కూల్ జట్టు 1–0తో గ్లెండేల్ అకాడమీపై గెలుపొందింది. -
రిలయన్స్ జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్
హైదరాబాద్: రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్(ఆర్‌ఎఫ్‌వైఎస్) జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంటు రెండో సీజన్ ప్రారంభమైంది. సమీప భవిష్యత్తులో భారత్‌ను బహుళ క్రీడల దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బుధవారం కోచిలో ఆర్‌ఎఫ్‌వైఎస్ చైర్పర్సన్ నీతా అంబానీ ఈ టోర్నీని ప్రారంభించారు. కోచిలోని రాజగిరి పబ్లిక్ స్కూల్లో వందలాది మంది పాఠశాల విద్యార్థుల కేరింత నడుమ భారత స్ట్రైకర్ సి.కే.వినీత్‌తో కలిసి నీతా అంబానీ ఈ సీజన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోని 30 నగరాల్లో జరిగే ఈ టోర్నీకి ఆమె శ్రీకారం చుట్టారు. ''రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ పాఠశాలలు, కళాశాలల్లో క్రీడా స్ఫూర్తిని పెంచుతుంది. ఆర్‌ఎఫ్‌వైఎస్ ద్వారా ఏకీకృత క్రీడా వ్యవస్థను రూపొందించడమే మా లక్ష్యం. దీనిలో భాగంగా ఒలింపిక్ ప్రధాన క్రీడలన్నింటికీ సంపూర్ణ ప్రణాళిక మా దగ్గర ఉంది. దేశంలోని యువతకు క్రీడల ద్వారా తగిన అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాం'' అని నీతా అంబానీ అన్నారు. దేశంలో గ్రామీణ స్థాయి నుంచి ఆటను ప్రోత్సహించడంలో ఆర్‌ఎఫ్‌వైఎస్ అతిపెద్ద టోర్నీగా అవతరించనుంది. వచ్చే ఐదు నెలల్లో 3000 విద్యా సంస్థల నుంచి 60 వేలకు పైగా చిన్నారులు ఈ టోర్నీలో పాల్గొననున్నారు. తొలి ఏడాది 8 ఐఎస్ఎల్ జట్ల వేదికల్లో ప్రారంభమైన ఈ టోర్నీ ఈ సారి బెంగళూరు, అహ్మదాబాద్, షిల్లాంగ్ , ఐజ్వాల్, ఇంఫాల్, హైదరాబాద్, జంషెడ్పూర్లలో కూడా జరుగనుంది. ఫుట్‌బాల్‌లో ప్రతిభకు పెట్టింది పేరైన కేరళ, గోవాలలోని ప్రతి పాఠశాల, కళాశాలకు ఆర్‌ఎఫ్‌వైఎస్ 2016-18 సీజన్ విస్తరించింది. కోచిలోని నిర్మల కళాశాలకు చెందిన 20 ఏళ్ల అజిత్ శివన్ ఐఎస్ఎల్లో కేరళ బ్లాస్టర్స్లోకి అడుగుపెట్టడం ఆరంభోత్సవంలో ఆకట్టుకుంది. '' గత ఏడాది ఆర్‌ఎఫ్‌వైఎస్‌లో అజిత్ సత్తా చాటాడు. అతను నాణ్యమైన ఆటగాడినని నిరూపించాడు. వెంటనే బ్లాస్టర్స్ అతడిని ఎంపికచేసుకుంది. భవిష్యత్తులో మరింత మంది అజిత్ శివన్‌లను వెలుగులోకి తీసుకొస్తాం. గ్రామీణ స్థాయిలో క్రీడల్ని బలోపేతం చేయడమే మా లక్ష్యం'' అని నీతా అంబానీ గర్వంగా ప్రకటించారు. ఆర్‌ఎఫ్‌వైఎస్ జాతీయ ఫుట్‌బాల్ టోర్ని నాలుగు విభాగాల్లో జరుగుతోంది. జూనలియర్ బాలురు, సీనియర్ బాలురు, సీనియర్ బాలికలు, కళాశాల బాలురు విభాగాల్లో పోటీలు ఉంటాయి. ప్రతి నగరంలో ప్రీ క్వాలిఫయింగ్ రౌండ్లతో పోటీలు ప్రారంభమవుతాయి. అందులో సత్తాచాటిన జట్లు మెయిన్ డ్రాలో బరిలో దిగుతాయి. విజేతలుగా నిలిచిన జట్లు జాతీయ స్థాయిలో తలపడతాయి. మెయిన్ డ్రా నుంచి ఫైనల్స్ వరకు మ్యాచ్‌ల వీడియో ఫుటేజీలను రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ అందుబాటులో ఉంచనుంది. దేవవ్యాప్తంగా ఉన్న సహజసిద్ధమైన ప్రతిభావంతుల్ని గుర్తించడానికి ఇదెంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వీడియో ఫుటేజీలను సాంకేతిక విశ్లేషణ కోసం పంపిస్తారు. ఇలా చేయడం ద్వారా ప్రారంభ దశలోనే విద్యార్థుల లోపాల్ని సరిదిద్దవచ్చు. దేశంలో గ్రామీణ స్థాయిలో క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు చిన్నారులు, యువత క్రీడ పట్ల ఆకర్షితులవడానికి ఈ టోర్నీ దోహదం చేయాలన్నది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు నీతా అంబానీ ఆశయం. ప్రతి చిన్నారి తన ప్రతిభను సానబెట్టుకోవడానికి ఒదికొ వేదిక కావాలన్నది ఆమె లక్ష్యం.