పోర్చుగల్‌ చేరుకున్న ప్రధాని మోదీ | Narendra Modi arrives in Portugal on the first leg of his three-nation visit | Sakshi
Sakshi News home page

పోర్చుగల్‌ చేరుకున్న ప్రధాని మోదీ

Published Sat, Jun 24 2017 5:28 PM | Last Updated on Thu, Apr 4 2019 4:25 PM

Narendra Modi arrives in Portugal on the first leg of his three-nation visit

లిస్బన్‌: మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందుగా పోర్చుగల్‌ చేరుకున్నారు. మోదీ శనివారం పోర్చుగల్‌ ప్రధానమంత్రి ఆంటోనియా కోస్టాతో భేటీ కానున్నారు. ఈ పర్యటన అనంతరం ఆయన  25, 26 తేదీల్లో అమెరికా, 27న నెదర్లాండ్స్‌లో పర్యటిస్తారు. 
 
కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు మంత్రులు, వివిధ సంస్థల సీఈవోలతో మోదీ భేటీ కానున్నారు. ఆ తర్వాత వాషింగ్టన్‌లో ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం అవుతారు. ఈ మూడు దేశాలతోనూ సంబంధాలు బలోపేతం చేయాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు మోదీ నిన్న ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement