1453కి పూర్వం ఐరోపా వారు ఎర్ర సముద్రం, గల్ఫ్ మార్గాల ద్వారా ఆసియా రాజ్యాల (భారత్, ఇండోనేసియా)తో వ్యాపార, వాణిజ్యాలు నిర్వహించేవారు. బైజాంటిన్ రాజ్యంలో ఎనిమిది క్రూసేడ్‌స యుద్ధాలు (క్రైస్తవం, ఇస్లాం మధ్య) 200 ఏళ్ల పాటు జరిగాయి. చివరికి టర్కీ సుల్తాన్ మహ్మద్-2 బైజాంటిన్ రాజ్యాన్ని (కాన్‌స్టాంట్‌నోపుల్/ఇస్తాంబుల్‌ను) ఆక్రమించాడు. ఐరోపా వారు ఆసియా దేశాల నుంచి వస్త్ర, సుగంధ ద్రవ్యాల వాణిజ్యాలు జరిపేవారు. 1453లో ఇస్తాంబుల్ నగరాన్ని దిగ్బంధం చేయడంతో ఐరోపా వాణిజ్య రంగం, భూస్వామ్య విధానం పతనమయ్యాయి.
ఐరోపావారు భారత్, ఇండోనేసియా కోసం నూతన సముద్ర మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో పోర్చుగల్, స్పెయిన్ దేశాలు తొలుత నౌకా రంగంలోకి ప్రవేశించాయి. మొదట పోర్చుగల్ రాజైన హెన్రీ-2 (గొప్ప నావికుడు) తన రాజధానిలోని లిస్బన్ పట్టణంలో తొలి నౌకా పాఠశాలను ప్రారంభించాడు. ఔత్సాహిక నావికులను ప్రోత్సహించేందుకు దీన్ని ఉచిత సౌకర్యాలతో నెలకొల్పాడు.
వెనిస్ (ఇటలీ) యాత్రికుడు మార్కోపోలో రాసిన నా యాత్రలు అనే గ్రంథం ఆధారంగా ఇందులో పాఠాలు బోధించేవారు. మార్కోపోలో క్రీ.శ.1292లో దక్షిణ భారతదేశంలో పర్యటించాడు. మొదట మదురై (పాండ్యుల రాజధాని) తమిళనాడును (ఇక్కడ జటావర్మ కులశేఖర రాజు ఆస్థానాన్ని) సందర్శించాడు. వారి రాజ్య విశేషాలు, సంపదల గురించి వర్ణించాడు. తర్వాత కాకతీయ రాజ్యానికి (ఓరుగల్లుకు) వెళ్లాడు (ఆ సమయంలో కాకతీయుల రాజ్యాన్ని రుద్రాంబ పాలిస్తోంది). కాకతీయుల ముఖ్య ఓడరేవు మోటుపల్లిని సందర్శించి, అటు నుంచి ఐరోపాకు వెళ్లిపోయాడు. తర్వాత తన గ్రంథంలో నావికులు పాటించాల్సిన విధానాలు, వారి ఆహార నియమాలు మొదలైన అంశాలను వివరించాడు.
ఇతని గ్రంథం ఆధారంగా నికోలో-డి- కాంటీ అనే వెనిస్ (ఇటలీ) యాత్రికుడు (1395-1469) విజయనగర రాజ్యాన్ని సందర్శించి లీ వోఏజ్ ఆక్స్ ఇండెస్ (1414-1439) అనే గ్రంథం రాశాడు. ఇతని మరో ప్రసిద్ధ గ్రంథం (వియాగి ఇన్ పర్షియా-ఇండియా, ఇ-జియావ)లో కూడా అనేక అంశాలతోపాటు భారత్‌లోని సుగంధ ద్రవ్యాల గురించి ప్రత్యేకంగా వర్ణించాడు. ఈ రెండు గ్రంథాల ఆధారంగా హెన్రీ-2 నౌకా పాఠశాలలో నావికులను ప్రోత్సహించాడు. వీరిలో మొదటి నావికుడు బార్తలో డోమ్యోజ్. ఇతడు ఆఫ్రికా తీరం వెంట ప్రయాణించి, 1487లో గుడ్‌హోప్ వరకు వచ్చి వెనక్కి తిరిగి వెళ్లాడు. దీనికి కేప్ ఆఫ్ స్టార్‌మ్స (తుపానుల అగ్రం) అని, కేప్ ఆఫ్ గుడ్‌హోప్ అని నామకరణం చేశాడు.
తర్వాత స్పెయిన్ రాజు ఫెర్డినాండ్, అతని భార్య ఇసబెల్లా కలిసి ఇటాలియన్ నావికుడైన క్రిస్టోఫర్ కొలంబస్‌కు ఆర్థిక సహాయం చేసి, నౌకా యాత్రలకు పంపించారు. ఇతను పశ్చిమం వైపు పయనించి 1492లో పశ్చిమ దీవుల సముదా యాలకు చేరాడు. వీటి గురించి కొలంబస్ తన గ్రంథం(ట్రాన్‌స అట్లాంటిక్ థియరీ)లో వివరిం చాడు. 1492లో అమెరికాను కనుగొన్నాడు. అక్కడ నివసిస్తున్న జాతిని రెడ్ ఇండియన్‌స అని పిలిచాడు. తాను చేరుకుంది భారతదేశమని భావించాడు. కానీ, తాను కనుగొన్నది ప్రపంచానికి తెలియని గొప్ప ఖండమని ఆయనకు తెలియదు. తర్వాత 1508లో అమెరిగో వెస్ఫూఛి అనే ఇటలీ యాత్రికుడు దీన్ని ‘నూతన ఖండం’గా పిలిచాడు. ఇదే ప్రస్తుతం అమెరికాగా ప్రసిద్ధి చెందింది. అలాగే హడ్సెన్.. కెనడాను (హడ్సెన్ బే కెనడాలో ఉంది), బఫెన్.. బఫెన్ దీవులు మొదలైనవాటిని కనుగొన్నారు.
వాస్కో డ గామా
భారత్‌కు నూతన సముద్ర మార్గాన్ని పోర్చుగీసు దేశస్తుడైన వాస్కో డ గామా కనుగొన్నాడు. ఇతడు బార్తలో- డోమ్యోజ్ మార్గంలోనే పయనించి గుడ్‌హోప్ (దక్షిణ ఆఫ్రికాలోని చివరి భాగం) చేరుకొని, తూర్పుతీరం వైపు మొజాంబిక్ వెళ్లాడు. అక్కడి నుంచి మడగాస్కర్‌కు వెళ్లి, అక్కడ గుజరాత్ ప్రాంతాని (భారత్)కి చెందిన నౌకా వ్యాపారి అబ్దుల్ మాజిద్ సాయంతో 1498, మే 17న కేరళలోని కాలికట్ తీరానికి చేరుకున్నాడు. వాస్కో డగామా కాలికట్‌కు చేరినప్పుడు స్థానిక రాజు రాజామనువిక్రమ వర్మ (జామెరిన్) సాదరంగా ఆహ్వానించి, విలువైన సుగంధ ద్రవ్యాల పెట్టెలను అందించాడు. వాస్కో డ గామా వాటిని తీసుకొని ఐరోపాకు వెళ్లి 27 రెట్లు అధిక ధరకు విక్రయించాడు.
పోర్చుగీసువారు (1498-1961)
భారత్‌కు వచ్చిన తొలి ఐరోపావారు. 1498లో వచ్చి, దేశం (గోవా) నుంచి చివరిగా (1961లో) వెళ్లినవారు కూడా వీరే కావడం గమనార్హం. వాస్కో డ గామా రెండోసారి 1502లో భారత్‌కు వచ్చాడు. ఇక్కడి సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేసి, వాటికి పోర్చుగీసులో 60 రెట్ల లాభాలు పొందాడు.
ఫెడ్రో ఆల్ఫారెజ్ కాబ్రాల్
1500 సంవత్సరంలో మరో పోర్చుగీసు నావికుడు కూడా కేరళ చేరాడు. పోర్చుగీసువారు భారత్‌లో ఎస్టాడో ద ఇండియా అనే కంపెనీని స్థాపించారు. మన దేశంలో వీరి తొలి ఫ్యాక్టరీని కొచ్చిన్ (కేరళ)లో నెలకొల్పారు. తొలి కోట కూడా ఇక్కడే నిర్మించారు. దీన్ని క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అంటారు.
పోర్చుగీసు వారి ఇతర స్థావరాలు
పశ్చిమం వైపు
1. కొచ్చిన్ (1500) 2. కాలికట్ (1502)
3. గోవా (1510)
తూర్పు తీరంలో
1. శాంథోమ్ (తమిళనాడు)
2. హుగ్లీ (బెంగాల్)
3. చిట్టగాంగ్ (బంగ్లాదేశ్)
మహారాష్ర్టలో
1. సాల్‌సెట్టి 2. బొంబాయి 3. బేసిన్
గుజరాత్‌లో
డయ్యూ డామన్
పోర్చుగీసు వారి ప్రముఖ వ్యాపార కేంద్రాలు
1.గోవా: చివరగా ఇదే వీరి వ్యాపార కేంద్రం.
2.డయ్యూ, డామన్
3. కాలికట్
4. కొచ్చిన్
పోర్చుగీసువారి పాలనా విధానం
అన్ని స్థావరాలకు కేంద్రం కొచ్చిన్ (తర్వాత గోవాకు మార్చారు). ఎస్టాడో ద ఇండియాను పరిపాలించడానికి మూడేళ్ల పదవీ కాలంతో గవర్నర్లను నియమించారు. మొదటి గవర్నర్ ఫ్రాన్సిస్ డి ఆల్మీడా.
ఫ్రాన్సిస్-డి-ఆల్మీడా
భారత్‌లో పోర్చుగీసు వారి తొలి గవర్నర్. రెండు సార్లు గవర్నర్‌గా ఉన్నాడు. బ్లూ వాటర్ పాలసీని 1505లో ప్రవేశపెట్టాడు. దీని ఉద్దేశం భూ మార్గాల కంటే సముద్రాల మీదే ఎక్కువ ఆధిపత్యం సంపాదించడం. నౌకా యుద్ధాలు చేసి, తీరప్రాంతాలను అధీనంలోకి తెచ్చుకొని, సముద్ర వాణిజ్యం ద్వారా ప్రపంచాధిపత్యం సాగించడమే వీరి లక్ష్యం. ఇతను 1510, మార్చి 1న కేప్‌టౌన్‌లో మరణించాడు. ఇతని కుమారుడు లేరెంజో-డి-ఆల్మీడా.
గవర్నర్లు (పోర్చుగీసు ముఖ్య అధికారులు)
1. ఆల్మీడా
2. అల్బూకర్‌క
3. జాకో-డి-కాస్ట్రో
4. పెడ్రో మసారెస్
5. గార్సియా-డి-నోరోహా
6. అఫోసో-డి-నోరోహా
7. లొపో-సోరెస్-ఆల్బెగార్గియా
బ్లూ వాటర్ పాలసీ విధానాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమతీర రాజ్యాలైన గుజరాత్ రాజు బహదూర్‌షా, టర్కీ రాజు, ఈజిప్టు రాజులు ఒక కూటమిగా ఏర్పడి పోర్చుగీసు వారిపై యుద్ధం ప్రకటించారు. ఇందులో డి-ఆల్మీడా తన కుమారుణ్ని కోల్పోయాడు.
అల్బూకర్‌క
పోర్చుగీసు గవర్నర్లలో గొప్పవాడు. గోవాను (రేవతి ద్వీపాన్ని) బీజాపూర్ సుల్తాన్ల నుంచి శ్రీకృష్ణదేవరాయల ద్వారా స్వాధీనం చేసుకున్నాడు. దీనికి కృతజ్ఞతగా విజయనగర రాజుశ్రీకృష్ణ దేవరాయలకు మేలుజాతి గుర్రాలను బహూకరించాడు. భారతీయులతో పోర్చుగీసు వారి వివాహ సంబంధాలకు తెరతీశాడు.
పోర్చుగీసు వారి ప్రభావం
భారత్‌లో అచ్చుయంత్రాన్ని ప్రవేశపెట్టారు. నావికాదళ ఆధునికీకరణకు దోహదపడ్డారు. వాణిజ్యంలో బొప్పాయి, పొగాకు, మిరప, చిలగడదుంప (ఆలుగడ్డ), బఠాని, పైనాపిల్ మొదలైనవాటిని ప్రవేశపెట్టారు. 1565లో రాక్షస తంగడి యుద్ధంలో విజయనగర రాజ్యం పతనమవడం కూడా పోర్చుగీసు పతనానికి ఒక కారణం. తమకు అన్ని రకాలుగా రక్షణగా ఉన్న గొప్ప రాజ్యం నేలమట్టం కావడం పోర్చుగీసు వారికి పెద్ద దెబ్బ. 1611లో బ్రిటిష్ అధికారి మిడిల్‌టన్ చేతిలో, 1608లో కెప్టెన్ బెస్ట్ చేతిలో (సూరత్ వద్ద) పోర్చుగీసు వారు ఓడిపోయారు. గోవా, డామన్ డయ్యూలు 1961 వరకు వీరి అధీనంలోనే ఉన్నాయి.
డచ్చివారు
వీరు హాలెండ్/నెదర్లాండ్ (హాలెండ్, బెల్జియం) దేశస్తులు. 1596లో లిచెస్టన్ తూర్పు దేశాలన్నింటినీ సందర్శించి ఓ గ్రంథం రాశాడు. ఇతడు ఇండోనేసియా(తూర్పు దేశాల దీవుల సముదాయం) లేదా ఈస్టిండిస్ ప్రాధాన్యతను వివరించాడు. 1602లో డచ్చివారు తమ వ్యాపార కంపెనీని డచ్ యునెటైడ్ ఈస్టిండియా కంపెనీ పేరుతో స్థాపించారు. భారత్‌లో వీరి తొలి స్థావ రం 1605లో మచిలీపట్నంలో వాడంగెన్ స్థాపిం చాడు. రెండో స్థావరాన్ని 1608-10లో పులికాట్ వద్ద వాన్‌రీడ్ స్థాపించాడు. మూడో ఫ్యాక్టరీని 1616లో సూరత్ (గుజరాత్)లో నెలకొల్పారు.
డచ్చివారి తూర్పు తీర స్థావరాలు
1. మచిలీపట్నం (ఏపీ)
2. పులికాట్ (ఏపీ)
3. కాశింబజార్ (బెంగాల్)
4. చిన్సూరా (బెంగాల్)
5. నాగపట్నం (తమిళనాడు)
పశ్చిమ తీరంలోని స్థావరాలు
1. {బోచ్ కాంబే (గుజరాత్)
2. కన్ననూర్ (కేరళ)
3. కొచ్చిన్ (కేరళ)
వీరి ప్రధాన వర్తక కేంద్రాలు
1. నాగపట్నం (వాణిజ్య కేంద్రం)
తమిళనాడు (1690 నుంచి)
2. మచిలీపట్నం
3. కన్ననూర్
4. చిన్సూరా
5. పులికాట్ (1690 వరకు ఇది కేంద్రం)
డచ్చివారి కోటలు
1. ఫోర్‌ట గెల్ట్రియా - పులికాట్ (ఏపీ)
2. ఫోర్‌ట డేవిడ్ - దేవసంపట్టణం (తమిళనాడు)
3. ఫోర్‌ట గెస్టావాస్ - చిన్సూరా (బెంగాల్)
డా. మురళి పగిడిమర్రి
అసిస్టెంట్ ప్రొఫెసర్,
నిజాం కాలేజ్, హైదరాబాద్.