ఫిఫా వరల్డ్‌కప్‌ : రొనాల్డో హ్యాట్రిక్‌ గోల్స్‌ | Cristiano Ronaldo Hat Trick Helps Portugal Hold Spain  | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 16 2018 11:16 AM | Last Updated on Sat, Jun 16 2018 2:13 PM

Cristiano Ronaldo Hat Trick Helps Portugal Hold Spain  - Sakshi

సోచి : సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో అదరగొట్టాడు. ఉత్కంఠ పోరులో జీనియస్ గేమ్‌తో కేక పుట్టించాడు. ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌లో భాగంగా స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ పోర్చుగల్ కెప్టెన్ హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. దీంతో హురాహోరీగా సాగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. స్పెయిన్, పోర్చుగల్ జట్లు ఆది నుంచి నువ్వా-నేనా అన్నట్లు మేటి ఆటను ప్రదర్శించాయి. హ్యాట్రిక్‌తో దుమ్మరేపిన రొనాల్డో .. ఓ రకంగా స్పెయిన్ విజయాన్ని అడ్డుకున్నాడు. రియల్ మాడ్రిడ్ స్ట్రయికర్ రొనాల్డో.. ఆట నాలుగో నిమిషంలోనే తొలి గోల్ చేశాడు.

మొదటి హాఫ్‌లో పోర్చుగల్ దూకుడుగా కనిపించింది.. కానీ ఆ తర్వాత స్పెయిన్ తన జోరును పెంచింది. స్పెయిన్‌ ఆటగాడు డీగో కోస్టా 24వ నిమిషంలో గోల్‌ చేయగా స్కోర్స్‌ సమం అయ్యాయి.  అనంతరం 44వ నిమిషంలో రొనాల్డో మరో గోల్‌ సాధించాడు. ఆ వెంటనే కోస్టా 55వ నిమిషంలో మరో  గోల్స్‌ సాధించాడు. ఆ టీమ్‌కు చెందిన నాచో కూడా 58వ నిమిషంలో గోల్ చేసి స్పెయిన్‌కు ఆధిక్యాన్ని అందించాడు. కీలకమైన సెకండ్ హాఫ్‌లోనూ రోనాల్డో తన సత్తా చాటాడు. ఇక మరికొన్ని క్షణాల్లో మ్యాచ్ ముగుస్తుందనుకున్న సమయంలో.. రొనాల్డో చెలరేగిపోయాడు. వన్ మ్యాన్ షోతో థ్రిల్ పుట్టించాడు. 88వ నిమిషంలో ఫ్రీ కిక్‌తో రొనాల్డో గోల్ చేసి స్పెయిన్ ఆశలపై నీళ్లు చల్లాడు. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement