పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో పుట్‌బాల్ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరంలేని పేరు. బంతి తమ అదపులోంచి ప్రత్యర్థి చేతిలోకి వెళ్లబోతుందంటే రోనాల్డోకి బాల్ పాస్ చేయ్ అని సహచర ఆటగాళ్లకు, సీనియర్ ఆటగాళ్లు, కోచ్‌లు సూచన ఇస్తారంటే అతని ఆట మీద ఎంత నమ్మకమో అర్థమవుతోంది. మరికొద్ది రోజుల్లో రష్యా వేదికగా జరగనున్న ఫుట్‌బాల్ మహాసంగ్రామం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫీఫా సమరానికి ముందే రోనాల్డో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తాజాగా లిస్బన్‌లో అల్జీరీయాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 3-0తో పోర్చుగల్ ఘనవిజయం సాధించింది.
ఈ మ్యాచ్ అనంతరం మైదానంలో రొనాల్డో ఏడేళ్ల ముద్దుల కొడుకు క్రిస్టియానో రొనాల్డో జూనియర్ ఆడిన ఆట అటు అభిమానులను, ఇటు తండ్రిని అశ్చర్యానికి గురిచేసింది. మ్యాచ్ అనంతరం తండ్రితో కలిసి మైదానంలో ఫుట్‌బాల్ ఆడిన రొనాల్డో జూనియర్ టాప్ లెఫ్ట్‌లో కళ్లు చెదిరే రీతిలో గోల్ చేశాడు. దీంతో అభిమానులతో పాటు రొనాల్డో ఆశ్చర్యానికి గురయ్యారు. కొడుకు ఆట చూసి ఫిదా అయిన సీనియర్ రొనాల్డో పుత్రోత్సాహంతో పొంగిపోయాడు.
ప్రస్తుతం ఆ బుడతడు కొట్టిన గోల్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తండ్రి అడుగుజాడల్లోనే కొడుకు కూడా అద్భుతంగా రాణిస్తాడని అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. రొనాల్డోకు ఈ ప్రపంచ కప్పే చివరిదని నిరాశపడుతున్న అభిమానులకు ఈ వీడియో ఊరటనిస్తుంది. తమ అభిమాన తనయుడు భవిష్యత్తులో రాణిస్తాడని సంబరపడిపోతున్నారు. జూన్ 14న ప్రారంభం కానున్న ఈ మహాసంగ్రామంలోని తొలి మ్యాచ్‌లో సౌదీఆరేబియాతో ఆతిథ్య రష్యా తలపడనుంది. ఇక 15న స్పెయిన్‌తో పోర్చుగల్ సమరానికి సిద్దమైంది.
Comments
Please login to add a commentAdd a comment