మనం జంతువుల అవశేషాలకు సంబంధించిన మ్యూజియంలు, మానవ మ్యూజియంలు, పిరమిడ్ మమ్మీల మ్యూజియంలు వంటవి గురించి విన్నాం. అంతేగానీ కేవలం కుందేళ్లకు అంకితమయ్యే మ్యాజియం గురించి విని ఉండలేదు కదా!. కానీ అలాంటి విచిత్రమైన మ్యూజియం ఒకట ఉంది. ఎక్కడంటే..
ప్రపంచంలో చాలా చిత్రవిచిత్రమైన మ్యూజియమ్‌లు ఉన్నాయి. వాటిలో ఈ కుందేళ్ల మ్యూజియం ఒకటి. పూర్తిగా కుందేళ్లకే అంకితమైన ఈ మ్యూజియం అమెరికాలో ఉంది. కాలిఫోర్నియా ఆల్టడెనా ప్రాంతంలోని లేక్ అవెన్యూలో ఈ మ్యూజియమ్‌ను 1998లో ప్రారంభించారు. దాదాపు ఏడువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పదహారు గ్యాలరీలతో ఏర్పాటైన ఈ మ్యూజియంలో ఎక్కడ చూసినా కుందేళ్లకు సంబంధించిన కళాఖండాలు, వస్తువులే కనిపిస్తాయి.
కాండిస్ ఫ్రాజీ, స్టీవ్ లుబాన్‌స్కీ అనే దంపతులు కుందేళ్ల మీద ఉన్న ఇష్టంతో ఈ మ్యూజియమ్‌ను ప్రారంభించారు. ఇందులో సిరామిక్, గాజు వంటి వస్తువులతో తయారు చేసిన కుందేలు బొమ్మలు, గడ్డి నింపిన కుందేళ్లు, కుందేలు ఆకారంలోని సీసాలు, డబ్బాలు వంటి 8,473 కళాకృతులు ఉన్నాయి. కుందేళ్లకు సంబంధించిన అత్యధిక వస్తువులు గల ప్రదేశంగా ఈ మ్యూజియమ్ గిన్నిస్ రికార్డుల్లోకి కూడా ఎక్కింది.
Comments
Please login to add a commentAdd a comment