‘ఏనుగు’ గుడ్డేం కాదు! | Elephant bird egg from lost species | Sakshi
Sakshi News home page

‘ఏనుగు’ గుడ్డేం కాదు!

Published Sun, Apr 29 2018 2:16 AM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

Elephant bird egg from lost species - Sakshi

ఈ ఫొటోలో ఉన్న గుడ్డు ఏనుగు పక్షి (ఎలిఫెంట్‌ బర్డ్‌) అనే అంతరించి పోయిన జాతికి చెందినది. చాలా ప్రాచీనమైన ఈ గుడ్డును న్యూయార్క్‌లోని బఫెలో మ్యూజియంలో ఉంచారు. అయితే దీన్ని ఇప్పటివరకు నకిలీదని అని భావించిన పరిశోధకులకు ఇది నిజమైన గుడ్డు అని తెలిసింది. దీంతో వారి ఆనందానికి హద్దుల్లేవు. 12 అంగుళాల పొడవు, 28 అంగుళాల వ్యాసంతో దాదాపు కిలోన్నర బరువుతో ఈ గుడ్డు ఉంది. మ్యూజియంలో ఉన్న అన్ని సేకరణలను పరిశీలిస్తున్న సమయంలో ఈ గుడ్డు నిజమైనదని నిరూపణ అయింది. ఈ గుడ్డును మే 1 నుంచి ప్రజల సందర్శనకు ఉంచుతారట.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement