తెలుగు సినిమా చరిత్ర విశేషాలతో ఓ మ్యూజియమ్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, అలా చేయడం తన కల అని నాగార్జున అంటున్నారు. ఈ విషయం గురించి నాగార్జున మాట్లాడుతూ – ‘‘సినిమాల భద్రత, పునరుద్ధరణ అంశాలకు సంబంధించి దాదాపు రెండు సంవత్సరాల క్రితం మా స్టూడియో (అన్నపూర్ణ)లో ఓ వర్క్‌షాప్ నిర్వహించాం. సాంకేతికత ఎంతలా అభివృద్ధి చెందిందో ఆ వర్క్‌షాప్ ద్వారా మరింత తెలుసుకున్నాను. చరిత్ర సృష్టించిన తెలుగు క్లాసిక్ సినిమాలను భద్రపరిచేలా ఓ మ్యూజియమ్‌ను ఎందుకు ఏర్పాటు చేయకూడదు అనిపించింది. మా నాన్నగారు (దివంగత ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు) దాదాపు 250కి పైగా సినిమాలు చేశారు. దురదృష్టవశాత్తు ఆయన నటించిన కొన్ని క్లాసిక్ సినిమాలను భద్రపరచలేకపోయాం. అయితే ప్రస్తుత సాంకేతికతతో కొన్ని క్లాసిక్‌లను మెరుగుపరిచే అవకాశం ఉంది. అవన్నీ కూడా మ్యూజి యమ్‌లో పెట్టదగిన సినిమాలే’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment