మ్యూజియం చైర్మన్ డేనియల్ బ్రాడ్‌స్కీ (కుడి) తదితరులతో నీతా అంబానీ
న్యూయార్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీకి అరుదైన ఘనత దక్కింది. భారతీయ కళలు, సంస్కృతి పరిరక్షణకు చేస్తున్న కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ‘ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (ది మెట్)’ బోర్డులో ఆమె చోటు దక్కించుకున్నారు. ఇప్పటికే ది మెట్ అంతర్జాతీయ మండలిలో నీతా అంబానీ సభ్యురాలు. తాజాగా గౌరవ ట్రస్టీగా నీతా అంబానీ (56) ఎంపిౖMðనట్లు మ్యూజియం చైర్మన్ డేనియల్ బ్రాడ్‌స్కీ వెల్లడించారు. భారతీయ సంస్కృతి, కళలు, కళాకారుల ప్రదర్శనలకు సంబంధించి 2016 నుంచి ది మెట్‌కు రిలయన్స్ ఫౌండేషన్ తోడ్పడుతోందని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శకులను ఆకర్షించే అతి పెద్ద ఆర్ట్ మ్యూజియంగా అమెరికాలోని ‘ది మెట్’ పేరొందింది.
Comments
Please login to add a commentAdd a comment