ప్రేయసి కోసం కష్టపడ్డాడు.. ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించాడు..! | Fans Trolls Ishan Kishan Affair With Aditi Hundia After T20 World Cup Selection | Sakshi
Sakshi News home page

Ishan Kishan: ప్రేయసి కోసం కష్టపడ్డాడు.. ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించాడు..!

Published Fri, Sep 10 2021 10:18 PM | Last Updated on Sat, Sep 11 2021 3:26 PM

Fans Trolls Ishan Kishan Affair With Aditi Hundia After T20 World Cup Selection - Sakshi

ముంబై: టీమిండియా క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్లు, మోడల్‌లతో డేటింగ్​ చేయడం చాలాకాలంగా కొనసాగుతోంది. ప్రస్తుత తరంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, హార్దిక్ పాండ్యా-నటాషాలు పెళ్లి బంధంతో ఒక్కటి కాగా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి స్టార్‌ క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్‌లతో ప్రేమలో ఉన్నారు. ఇదే బాటలో 23 ఏళ్ల ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌ కూడా వెళ్తున్నాడా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా, టీమిండియా టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్‌.. ప్రముఖ మోడల్‌ అదితి హుండియాతో పీకల్లోతు ప్రేమలో ఉ‍న్నట్లు వార్తలు వైరలవుతున్నాయి. ఇషాన్ తొలిసారి భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నప్పుడు అదితి అతన్ని ప్రత్యేకంగా అభినందించింది. దీంతో అప్పుడు ఆమె విష్ చేయడం వల్లే ఇషాన్ సత్తా చాటాడంటూ నెటిజన్లు తెగ ట్రోల్‌ చేశారు. ఇప్పుడు ఇషాన్‌ ఏకంగా ప్రపంచకప్ జట్టుకు ఎంపిక కావడంతో.. ప్రేయసి కోసం కష్టపడి ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కాగా, 2019 ఐపీఎల్‌లో చెన్నైతో మ్యాచ్ జరిగినప్పటి నుంచి ఇషాన్-అదితి హుండియాల మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ మ్యాచ్ లో ఇషాన్ ప్రదర్శనకు ఫిదా అయిన అదితి.. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పొగడ్తల వర్షం కురిపించింది. 'నిన్ను చూసి నేనెంతగానో గర్వపడుతున్నాను బేబీ' అని తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఇషాన్‌ను బేబీ అని సంబోధించడంలో అర్ధమేంటో అంటూ అప్పట్లో నెటిజన్లు రచ్చ రచ్చ చేశారు. ఇదిలా ఉంటే, అదితి హుండియా.. 2017లో మిస్‌ రాజస్థాన్‌గా ఎంపికైంది. ఈ అమ్మడుకు ఫ్యాషన్ ఇండస్ట్రీతో పాటు సోషల్‌మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. 
చదవండి: 2008లో ఇంగ్లండ్‌ ఏం చేసిందో మరవొద్దు.. ఉగ్రదాడి జరిగినా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement