
బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్, ప్రియురాలు అంకిత కోన్వర్‌తో కలిసి తాజాగా నార్వేలో విహరిస్తున్నాడు. కొద్దిరోజుల కిందటే (నవంబర్ 4న) 52వ వసంతంలోకి అడుగుపెట్టిన మిలింద్ తన పుట్టినరోజును ప్రియురాలితో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. 52 ఏళ్ల మిలింద్ 18 ఏళ్ల అంకితతో ప్రేమాయణం నడపటంపై ఆ మధ్య సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు నోరుపారేసుకున్నారు. ఇద్దరి మధ్య 30 ఏళ్లకుపైగా వయోభేదం ఉన్నా.. ఇలా ప్రేమలు ఏంటి? కూతురు వయస్సు ఉన్న అమ్మాయితో ప్రేమాయణమా? ఇదేం పద్ధతి అంటూ కొందరు నెటిజన్లు నీతిసూత్రాలు వల్లిస్తూ.. విమర్శల దాడి చేశారు.
తాజాగా కూడా ట్విట్టర్‌లో మిలింద్ ప్రేమాయణంపై ఘాటు విమర్శలు, జోకులు వెల్లువెత్తూతునే ఉన్నాయి. '18 ఏళ్ల అమ్మాయి 51 ఏళ్ల మిలింద్‌తో డేటింగ్ చేస్తోంది. 'బేటీ పఢావో, బేటీకో మిలింద్ సోమన్‌సే బచావో పథకాన్ని మోదీ ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలి' అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. మిలింద్ ఇప్పుడే కాదు ఇంతకుముందు 20 ఏళ్ల అమ్మాయితో డేటింగ్ చేశాడు.. అతనికి తన వయస్సు మహిళలు ఎందుకు నచ్చరో' అంటూ కామెంట్ చేశారు.
ఈ విమర్శలు, ఆన్‌లైన్ ట్రోలింగ్ ఎలా ఉన్నా.. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఎయిర్ హోస్టెస్ అయిన ప్రియురాలు అంకితతో కలిసి మిలింద్ విహరిస్తున్నాడు. ఓస్లోలో ఆమెతో కలిసి దిగిన సెల్ఫీలను అతను తాజాగా షేర్ చేశాడు. కాగా, మిలింద్‌కు మద్దతుగా రచయిత భావన అరోరా ట్వీట్ చేశారు. 50 ఏళ్లు వచ్చినా మిలింద్ సోమన్ ఇంకా హాట్‌గానే ఉన్నాడని, కాబట్టి ఇప్పటికైనా ఆన్‌లైన్ ట్రోలింగ్ ఆపాలని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment