అర్జెంట్‌గా గర్ల్ ఫ్రెండ్ కావాలి: హీరో | Arya acting in the movie Kadamban | Sakshi
Sakshi News home page

అర్జెంట్‌గా గర్ల్ ఫ్రెండ్ కావాలి: హీరో

Published Sun, Jun 25 2017 6:48 PM | Last Updated on Tue, Sep 5 2017 2:27 PM

అర్జెంట్‌గా గర్ల్ ఫ్రెండ్ కావాలి: హీరో

అర్జెంట్‌గా గర్ల్ ఫ్రెండ్ కావాలి: హీరో

అర్జెంట్‌గా తనకో గర్ల్ ఫ్రెండ్ కావాలి అంటున్నదెవరో తెలుసా? హీరోయిన్ల హీరోగా ముద్రవేసుకున్న నటుడు ఆర్య. ఆర్య గురించి గతంలో రకరకాల వార్తలు ప్రచారం అయిన విషయం తెలిసిందే. ఆర్య అంటే ఇష్టపడని హీరోయిన్లు ఉండరని చాలా మంది కథానాయికలు బహిరంగంగానే చెప్పారు. అదే విధంగా ఆర్య హీరోయిన్లకు బిరియాని వండి పెట్టి మచ్చిక చేసుకుంటారనే ప్రచారం కూడా పాతదే. తన చిత్రాల ప్రమోషన్లకే రాని నటి నయనతార ఆర్య పిలవగానే ఆయన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరై అందర్ని విస్మయపరచిన సంఘటన ఉంది.

అయితే నటుడు ఆర్యకు ఇటీవల సరైన హిట్‌ చిత్రాలు లేవు. ఈ మధ్యకాలంలో విడుదలైన కడంబన్‌ చిత్రం ఆర్యను నిరాశ పరచింది. ఆర్య అనూహ్యంగా తనకు అర్జెంట్‌గా ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. ప్లీజ్‌ ఎవరైనా హెల్ప్‌ చేయండి అంటూ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ బహిరంగం చేయడం మరో విశేషం. ఆర్య ట్వీట్‌పై ఆయన అభిమానులు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. అందులో ఒక అభిమాని ఘగర్‌లేని కాఫీ, ఆర్యకు తగని ఫిగర్‌ బాగున్నట్లు చరిత్రే లేదు అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడిదే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement