
ప్రేమ పేరుతో నమ్మించి.. ఆ దృశ్యాలు ఆన్‌లైన్‌లో
చిత్తూరులో ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్టు
చిత్తూరు : ప్రేమ పేరిట యువతిని నమ్మించి, ఆమెతో శృంగారంలో పాల్గొంటూ వీడియోలు చిత్రీకరించిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి వాటిని ఇంటర్నెట్‌లో ఉంచాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైదరాబాద్‌లోని సైబర్ పోలీసులు చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెకు చెందిన నవీన్‌ప్రసాద్(21) అనే ఇంజనీరింగ్ విద్యార్థిని అరెస్టు చేశారు. నిందితుడ్ని హైదరాబాద్‌కు తరలించారు.
చిత్తూరుకు చెందిన నవీన్‌ప్రసాద్ ఇంటర్ పూర్తి చేసి ఏడాదిన్నర క్రితం ఓ కోర్సు నేర్చుకోవడానికి హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ ఓ యువతి పరిచయమై ప్రేమకు దారితీసింది. అయితే యువతికి మాయ మాటలు చెప్పి లొంగతీసుకున్న నవీన్‌ప్రసాద్ ఆమెతో శృంగారంలో పాల్గొంటూ వాటిని తన సెల్‌ఫోన్‌తో వీడియోలు తీసుకున్నాడు. కొద్ది రోజుల తరువాత చిత్తూరుకు చేరుకున్న అతడు పలుమార్లు ఆ యువతికి ఫోన్ చేసి డబ్బులు పంపించాల్సింగా బ్లాక్ మెయిల్ చేయసాగాడు. తన వద్ద డబ్బుల్లేవని యువతి చెప్పినా పట్టించుకోలేదు. దీంతో వారం క్రితం తన సెల్‌ఫోన్‌లో ఉన్న వీడియోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ విషయం యువతికి ఆమె స్నేహితులు చెప్పడంతో హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం చిత్తూరులోని సీతమ్స్ కళాశాలలో బీ.టెక్ రెండో సంవత్సరం చదువుతున్న నవీన్‌ప్రసాద్‌ను సైబరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి హైదరబాద్‌కు తరలించారు.