పబ్‌కు మాజీ ప్రియురాలిని పిలిచి.. | Ex Girlfriend Beaten By Boy Friend After Calling To The Pub | Sakshi
Sakshi News home page

పబ్‌కు మాజీ ప్రియురాలిని పిలిచి..

Published Sun, Dec 19 2021 12:45 PM | Last Updated on Sun, Dec 19 2021 1:09 PM

Ex Girlfriend Beaten By Boy Friend After Calling To The Pub - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌: పబ్‌కు మాజీ ప్రియురాలిని పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా తీవ్రంగా కొట్టిన ఘటనలో నిందితుడిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కూకట్‌పల్లికి చెందిన జిబిన్‌ కోషి రెండు సంవత్సరాల నుంచి ఉప్పల్‌కు చెందిన బ్యూటీషియన్‌(22)తో సహజీవనం చేస్తున్నాడు. అయితే నెల క్రితం ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు.

జిబిన్‌ ఈ నెల 11వ తేదీన సాయంత్రం 7 గంటలకు తనతో వేరుగా ఉంటున్న యువతికి ఫోన్‌ చేసి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 2లోని స్పాయిల్‌ పబ్‌కు పిలిపించాడు. రావడంతోనే అసభ్యంగా మాట్లాడుతూ ఆమెను దూషించాడు. మెడ పట్టుకొని గెంటేశాడు. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. వెంటనే ఆమె జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు జిబిన్‌పై ఐపీసీ సెక్షన్‌ 323, 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
హైలైఫ్‌ పబ్‌పై న్యూసెన్స్‌ కేసు 
జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 36లోని హైలైఫ్‌ జూబ్లీ 800 పబ్‌లో శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో సౌండ్‌ పొల్యూషన్‌తో పాటు స్థానికులకు న్యూసెన్స్‌ ఏర్పడుతున్నట్లు సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి సదరు పబ్‌ నిర్వాహకులు అధిక శబ్ధంతో పాటు చుట్టుపక్కల వారికి ఇబ్బందులు కలిగిస్తున్నట్లుగా గుర్తించారు. జీవో 15ను తుంగలో తొక్కుతూ నిబంధనలు కాలరాసినట్లుగా తెలియడంతో హైలైఫ్‌ పబ్‌ మేనేజర్‌ వరహాల నాయుడుపై ఐపీసీ సెక్షన్‌ 188 కింద కేసు నమోదు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement