
కొలంబో: టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా కొంతకాలంగా ప్రాచీ సింగ్ అనే అమ్మాయితో ప్రేమాయణం నడుపుతున్నట్లు రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పృథ్వీ షా శ్రీలంకతో సిరీస్ ఆడుతూ బిజీగా గడుపుతున్నాడు. ఆదివారం శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో పృథ్వీ షా ఉన్న కాసేపు తన ఇన్నింగ్స్ల్‌తో దడదడలాడించాడు. ఐపీఎల్ ఫామ్‌ను కంటిన్యూ చేసిన పృథ్వీ షా తన ఇన్నింగ్స్ ఆసాంతం బౌండరీలతో రెచ్చిపోయాడు. 24 బంతుల్లోనే 9 ఫోర్లతో మెరుపు వేగంతో 43 పరుగులు చేసిన అతను తృటిలో హాఫ్ సెంచరీ మార్క్‌ను మిస్ చేసుకున్నాడు. ఒకరకంగా పృథ్వీ తన మెరుపు ఇన్నింగ్స్‌తో టీమిండియా విజయాన్ని సులువు చేశాడు.
ఇదిలా ఉంటే పృథ్వీ షా ఇన్నింగ్స్‌పై ప్రాచీ సింగ్ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు ఫోటోలను షేర్ చేస్తూ.. మొదటి ఫోటోకు ది బెస్ట్ ఇన్నింగ్స్.. రెండో ఫోటోకు ఈ ఇన్నింగ్స్‌కు నువ్వు అన్ని రకాలుగా అర్హుడివి అంటూ క్యాప్షన్ జత చేసింది. ప్రాచీ పెట్టిన పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి.
ఇక తొలి మ్యాచ్‌లో విజయం అందుకున్న భారత్ నేడు రెండో వన్డేకు సిద్ధమవుతుంది. పెద్దగా అనుభవంలేని ప్లేయర్లతో కూడిన శ్రీలంక జట్టుపై అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ ఘనవిజయం సాధించింది. ఒకరోజు విరామం తర్వాత శిఖర్ ధావన్ నాయకత్వంలోని భారత్ మరో పోరుకు సిద్ధమైంది. నేడు శ్రీలంక జట్టుతో జరిగే రెండో వన్డేలో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను దక్కించుకోవాలని ధావన్ సేన పట్టుదలగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment