భువనేశ్వర్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ ఎవరో తెలిసింది.. | Bhuvneshwar Kumar Reveals 'Better Half' in Dinner Date Post | Sakshi
Sakshi News home page

భువనేశ్వర్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ ఎవరో తెలిసింది..

Published Wed, Oct 4 2017 3:21 PM | Last Updated on Wed, Oct 4 2017 7:07 PM

Bhuvneshwar Kumar Reveals 'Better Half' in Dinner Date Post

సాక్షి, హైదరాబాద్‌: టీమిండియా పేస్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ ఏడాది మే11న ఐపీఎల్‌ జరిగే సమయంలో  గర్ల్‌ఫ్రెండ్‌తో రెస్టారెంట్‌లో తీసుకున్న ఫోటోలో తను మాత్రమే కనిపించే ఫోటోను  ‘డిన్నర్‌ డేట్‌.. త్వరలో పూర్తి ఫోటో’ అని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అప్పట్లో ఈ ఫోటో నెట్టింట్లో హాట్‌ టాపిక్‌ అయింది. భువీ ఓ హీరోయిన్‌తో డేట్‌ చేస్తున్నాడని గాసిప్‌ వార్తలు గుప్పుమన్నాయి.

ఆ వార్తను భువీ కూడా ఖండించాడు. ఆ హీరోయిన్‌ ఎవరో కూడా నాకు తెలియదంటు చెప్పుకొచ్చాడు. అయితే సరిగ్గా ఐదు నెలల తర్వాత ఈ స్పీడ్‌ స్టార్‌ తన గర్లఫ్రెండ్‌ ఎవరో తెలియజేస్తూ పూర్తి ఫోటోను షేర్‌ చేశాడు. ఈమె నా జీవిత భాగస్వామి, నుపుర్‌నగర్‌ అంటూ ఇన్‌స్ట్రాగమ్‌లో పోస్టు చేశాడు. ఈమెనే భువీ త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు. ఇక ఈ స్పీడ్‌ స్టార్‌ ఆస్ట్రేలియాతో జరిగే 3 టీ20 మ్యాచ్‌లకు సిద్దం అవుతున్నాడు.

Here’s the better half of the picture @nupurnagar 😊😍

A post shared by Bhuvneshwar Kumar (@imbhuvi) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement