
ప్రతీకాత్మక చిత్రం
యలహంక(బెంగళూరు): చేబదులుగా తీసుకున్న నగదు ఇవ్వలేదని ప్రేమించిన యువతిని గొంతు నులిమి హత్య చేసిన ఘటన యలహంక న్యూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... శ్యాము అనే యువకుడు యలహంక ఉపనగరలో నివాసముంటు యోగా శిక్షణ కేంద్రం నడిపిస్తున్నాడు. మూడేళ్ల క్రితం గంగా అనే యువతి ఈ కేంద్రంలో శిక్షణకు వచ్చింది. ఇద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
రెండు కుటుంబాల అంగీకారంతో వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి కుదిర్చారు. కొన్ని నెలల క్రితం గంగా, తన ప్రియుడి వద్ద రూ. లక్ష నగదు తీసుకుంది. ఆ నగదు ఇవ్వకపోవడంతో తరచూ గొడవపడేవాడు. బుధవారం రాత్రి ఇదే విషయంపై గొడవపడి ఆవేశంతో ప్రియురాలి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం దానిని ఆత్మహత్యకు చిత్రీకరించాడు. అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేయగా అసలు విషయం వెలుగుచూసింది. నిందితుడిని అరెస్ట్ చేశారు.
చదవండి: బోరబండలో దారుణం.. మహిళను బెదిరించి.. ఇద్దరు యువకుల అత్యాచారం