టొరంటో: ఇటీవల కెనడాలోని నోవాస్కోటియాలో గాబ్రియేల్ వర్ట్‌మన్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో దాదాపు 22 మంది ప్రాణాలు కొల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మహిళా పోలీసు కూడా మృతిచెందారు. అయితే దుండగుడు ఈ కాల్పులకు పాల్పడటం వెనక.. అతని ఇంట్లో చోటుచేసుకున్న ఘర్షణే కారణమని తెలిసింది. గాబ్రియేల్‌కు, అతని గర్ల్ ఫ్రెండ్‌కు మధ్య చెలరేగిన వివాదం నోవాస్కోటియాలో విషాదం నింపింది. ఈ విషయాన్ని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ అధికారి ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. అయితే ఈ కాల్పుల నుంచి గాబ్రియేల్ క్షేమంగా బయటపడ్డారు.
కాగా, హాలిఫాక్స్ సమీపంలోని డార్ట్‌మౌత్‌లో కృత్రిమ దంతాలు అమర్చే పని చేస్తున్న గాబ్రియేల్.. నొవాస్కోటియా ప్రావిన్స్ పొర్టాపిక్ పట్టణంలో ఆదివారం కాల్పులు జరిపాడు. పోలీసు యూనిఫాం ధరించి, పెట్రోలింగ్ వాహనం మాదిరి ఎస్‌యూవీలో తనుండే వీధిలోని ఓ ఇంట్లోకి ప్రవేశించి అందులోని వారిని కాల్చి చంపాడు. అనంతరం అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలోని మరోప్రాంతంలో కాల్పులకు తెగబడ్డాడు. కొన్ని ఇళ్లకు నిప్పుకూడా పెట్టాడు. దీనిని కెనడా చరిత్రలోనే ఇది అత్యంత విషాద ఘటన అని అధికారులు తెలిపారు.
చదవండి : కెనడాలో కాల్పుల మోత
Comments
Please login to add a commentAdd a comment