Shocking Video: Actor Milind Soman Bathing On Road, Goes Viral - Sakshi
Sakshi News home page

Milind Soman: నడి రోడ్డు మీద స్నానం ఆచరించిన నటుడు

Published Fri, Aug 6 2021 9:33 PM | Last Updated on Sat, Aug 7 2021 5:39 PM

Actor Milind Soman Taking Bath on Road, Video Goes Viral - Sakshi

Milind Soman: ప్రముఖ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌, నటుడు, మోడల్‌ మిలింద్‌ సోమన్‌ సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. వర్కవుట్స్‌తో పాటు ఫన్నీ వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటాడు. తాజాగా అతడు ఓ ఇంట్రస్టింగ్‌ వీడియోను షేర్‌ చేశాడు. ఇందులో మిలింద్‌ సోమన్‌ నడిరోడ్డు మీద స్నానం చేశాడు. అది కూడా రాత్రిపూట. దేనిగురించైనా నిరసన చేస్తున్నాడేమో అనుకోకండి, అదేం కాదు! షూటింగ్‌లో భాగంగా ఇలా రోడ్డు మీద స్నానం ఆచరించాడు. ఓ వైపు వర్షం పడుతుండగా వేన్నీళ్లతో స్నానం చేశానని క్యాప్షన్‌ ద్వారా అసలు విషయం చెప్పేశాడు.

పుషప్స్‌, రన్నింగ్స్‌తో పాటు ఇంకేదైనా చేయగలనా అని డౌట్‌ పడేవారికి ఈ వీడియోనే సమాధానమని పేర్కొన్నాడు. ఇక ఈ వీడియో పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే నెట్టింట వైరల్‌గా మారింది. కాగా మిలింద్‌ టర్కీబ్‌, 16 డిసెంబర్‌, బాజీరావ్‌ మస్తానీ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. హిందీ సినిమాలతో పాటు పచ్చైకిలి, సత్యమేవ జయతే, అలెక్స్‌ పాండియన్‌ వంటి దక్షిణాది చిత్రాల్లోనూ నటించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement