నవంబర్ 4న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు:
టబు (నటి), మిలింద్ సోమన్ (నటుడు)
ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5. ఇది బుధ సంఖ్య కావడం వల్ల మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, చాకచక్యంతో పనులను చకచకా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు కోరుకున్న ఇన్‌స్టిట్యూట్లలో కోరుకున్న కోర్సులలో సీట్లు వస్తాయి. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపారం నిమిత్తం విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక భద్రత, స్నేహసంబంధాలు పెరిగి కొత్త అవకాశాలు వస్తాయి. అయితే వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లపై సంతకాలు చేయవలసి వచ్చినప్పుడు విజ్ఞతతో వ్యవహరించక తప్పదు. వీరు పుట్టిన తేదీ 4. ఇది రాహు సంఖ్య కావడం వల్ల కంప్యూటర్ రంగంలోని వారికి, ఎం.బి.ఎ; సి.ఎ; ఎల్.ఎల్.బి చదివిన వారికి మంచి అవకాశాలు. పోటీపరీక్షల్లో విజయం. సొంత ఇంటికల నెరవేరుతుంది.
సామాజికంగా పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. రియల్ ఎస్టేట్, మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ రంగాలలోని వారికి, చార్టెర్డ్ ఎకౌంటెంట్లకు కలిసి వస్తుంది. పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ తమ రంగాలలో బాగా పుంజుకుంటారు. లక్కీ నంబర్లు: 2,3, 4,5,6,8; లక్కీ డేస్: ఆది, సోమ, బుధ, శుక్ర, శనివారాలు; లక్కీ కలర్స్: గ్రే, క్రీమ్, వైట్, గ్రీన్, గోల్డెన్, ఎల్లో, పర్పుల్, బ్లూ, వయోలెట్. సూచనలు: పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం, ఆవులకు, కోతులకు ఆహారం పెట్టడం, కోపాన్ని, నోటి దురుసుతనాన్ని తగ్గించుకోవడం, సర్పసూక్త సహిత మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, వృద్ధులకు, అనాథలకు, వితంతువులకు సహాయం చేయడం.
- డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్