‌అక్షయ్‌ బాటలో మిలింద్‌.. తొలిసారి ఆ పాత్రలో! | Milind Soman Plays Third Gender In Paurashpur, First Look Released | Sakshi
Sakshi News home page

వైరల్‌.. సరికొత్త పాత్రలో మిలింద్‌ సోమన్

Published Sat, Dec 5 2020 6:15 PM | Last Updated on Sat, Dec 5 2020 6:28 PM

Milind Soman Plays Third Gender In Paurashpur, First Look Released - Sakshi

ప్రముఖ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌, నటుడు, మోడల్‌ మిలింద్‌ సోమన్‌ మరో వెబ్‌ సిరీస్‌తో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ‘పౌరాష్‌పూర్‌’ అనే ‌పేరుతో రూపొందుతున్న వెబ్‌ సిరీస్‌లో మిలింద్‌ సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ఈ సిరీస్‌ ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ అయిన జీ న్యూస్‌, ఏఎల్‌టీ బాలాజీలో ప్రసారం కానుంది. ఇక ఈ సీరిస్‌ చారిత్రక రాజ్యం, కుట్రలు, రాజకీయాలు, లింగ యుద్ధం నేపథ్యం ఆధారంగా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాలో తన క్యారెక్టర్‌ను వెల్లడిస్తూ ఫస్ట్‌ లుక్‌ను మిలింద్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. పౌరాష్‌పూర్‌ సినిమాలో మిలింద్‌ .. థర్డ్‌‌జెండర్‌ అయిన బోరిస్‌ పాత్ర పోషిస్తున్నారు. చదవండి: విభిన్న లుక్‌లో మిలింద్‌ సోమన్‌!

ఈ పోస్టర్‌లో మిలింద్‌ ముఖానికి పెద్దగా కుంకుమ బొట్టు, మెడలో బంగారు అభరణం ధరించి, చేతిలో కత్తి పట్టుకొని పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. "పౌరాష్‌పూర్‌లోని ట్రాన్స్‌ జెండర్‌ను ప్రపంచంలో ఇంతకు ముందు ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. శక్తి పోరాటం. గొప్ప తెలివి, మనస్సు, వ్యక్తిత్వం, ఇవ్వన్నీ పౌరాష్‌పూర్‌లోని బోరిస్‌కు సొంతం’. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అలాగే రేపు మధ్యాహ్నం రెండు గంటలకు టీజర్‌ విడుదల కానున్నట్లు తెలిపాడు. కాగా పౌరాష్‌పూర్‌లో శిల్పా షిండే, షాహీర్ షేక్, సాహిల్ సలాథియా, అన్నూ కపూర్ ముఖ్య పాత్రల్లో నటించారు. చదవండి: బూడిద పూసుకొని నగ్నంగా తిరిగితే తప్పు లేదా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement