ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ మిలింద్ సోమన్ భార్య అంకిత కోన్వర్ కు యోగా చేయడమంటే మహా ఇష్టమట. అంతేకాకుండా ఆమె తన ఫిట్‌నెస్ సీక్రెట్స్‌ను సోషల్ మీడియాలో అభిమానులు, ఫాలోవర్స్‌తో తరచూ పంచుకుంటుంది కూడా. ఐతే తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో యోగాసనాల్లో వృక్షాసనం తనకు ఇష్టమైన యోగా అని చెప్పుకొచ్చింది. ఈ పోస్టును చూసిన అభిమానుల నుంచి వేలసంఖ్యలో లైక్‌లు, కామెంట్లు వెల్లువెత్తాయి.
ఈ పోస్ట్‌లో వైట్ స్లీవ్ లెస్ టీషర్ట్, రెడ్ కలర్ ఫ్యాంట్ ధరించి, వెనుక పచ్చని చెట్లు ఉన్న లొకేషన్‌లో వృక్షాసనంలో అంకిత కనిపిస్తుంది. తన పోస్ట్‌లో వృక్షాసనం వల్ల చేకూరే ప్రయోజనాలు, వేసే విధానం కూడా తెల్పింది. ‘యోగాసనాల్లో వృక్షాసనం నాకు ఇష్టమైనది. ఇది కాళ్లు, తొడలకు దృఢత్వాన్ని ఇస్తుంది. నాడి వ్యవస్థ కండరాలను మెరుగుపరుస్తుంది.
అంతేకాకుండా ఏకాగ్రతను, చురుకుదనాన్ని వృద్ధి చేస్తుంది. ఈ ఆసనాన్ని వేసేటప్పుడు వీటిని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీ వెనుక భాగాన్ని నిటారుగా ఉంచండి. లేదంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే పాదంతో మోకాలును నొక్కడం కూడా చేయకూడదు. మీ తొడభాగాన్ని నిటారుగా ఉంచండి’ అని.. ఆసనం వేసేటప్పుడు పాటించవల్సిన జాగ్రత్తలు కూడా వెల్లడించారు. ఐతే వ్యాయామం కోసం ప్రేరణ పొందాలనుకునే వారు అంకిత కోన్వార్ పోస్ట్‌లను ఫాలో ఐతేచాలు.. ఖచ్చితంగా ఇన్‌స్పైర్ అవుతారని ఆమె చేసిన పలు పోస్టులను చూస్తే అనిపిస్తుంది.
చదవండి: Brief Emotion: ఆపరేషన్ టైంలో ఏడ్చినందుకు ఏకంగా రూ.800ల బిల్లు ..!
Comments
Please login to add a commentAdd a comment