అస్సామీ ప్రజలు నేడు నూతన సంవత్సరానికి స్వాగతం చెప్తున్నారు. ఈ సందర్భంగా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిన "రొంగాలీ బిహు" వేడుకను ఎవరింట్లో వాళ్లు గుట్టుగా కానిచ్చేస్తున్నారు. ఇతర ప్రదేశాల్లో చిక్కుక్కున్న అస్సామీ వాసులు స్వస్థలాలకు వెళ్లలేకపోతున్నారు. తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ నటుడు, మోడల్ మిలింద్ సోమన్ విచారం వ్యక్తం చేశాడు. అతని భార్య అంకితా తివారీ అస్సామీవాసి. ఆమెకు కుటుంబంతో కలిసి పండగను ఆస్వాదించాలని ఉన్నప్పటికీ లాక్‌డౌన్ వల్ల వెళ్లలేని పరిస్థితి. దీంతో ఈ జంట ముంబైలోని తమ నివాసంలో "బిహు" వేడుకలు జరుపుకుంది. సాంప్రదాయ దుస్తువులు ధరించిన వీళ్లిద్దరూ గుడ్లతో ఫైట్ చేస్తుండగా అతని తల్లి ఉషా సోమన్ వీళ్లిద్దరినీ కెమెరాలో బంధించింది. (మధురమైన జ్ఞాపకం: రంభ)
ఈ ఫొటోను మిలంద్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. "అంకిత గువహటిలో ఉన్న తన పుట్టింటి వారిని మిస్ అవుతోంది. మనసులో ఆ ఖాళీని పూరించేందుకు ఇలా గుడ్లతో ఫైట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాం. ఇలాగే.. ఇంటిని, స్నేహితులను, ఇష్టమైనవారిని మిస్ అవుతున్నామనుకునేవాళ్లు ఈ క్షణాన్ని ఆస్వాదించండి. త్వరలోనే మీరు మళ్లీ కలుసుకుంటారు" అని ఆయన రాసుకొచ్చాడు. కాగా మిలింద్ 80, 90 దశకాల్లో ఎన్నో యాడ్స్‌లో నటించాడు. ప్రముఖ గాయని అలీషా చినాయ్ రూపొందించిన మేడ్ ఇన్ ఇండియా మ్యూజిక్‌తో భారీ పాపులారిటీని సంపాదించాడు. ఆయన తనకన్నా 26 ఏళ్లు చిన్నదైన అంకితా కోన్వార్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. (వ్యవసాయం చేస్తున్నా: హీరోయిన్ భూమి ఫడ్నేకర్)
Comments
Please login to add a commentAdd a comment