వ్యక్తిగత ఫ్యాషన్ లేబుల్ లాంచ్ చేసిన టాలీవుడ్ హీరోగా కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు విజయ్ దేవర కొండ. అలాగే తన రౌడీ లేబుల్‌ని ప్రమోట్ చేయడానికి కూడా వెరైటీ రూట్‌నిఎంచుకుంటున్నాడు. ఓ క్లబ్‌ని ఏర్పాటు చేసి దానిలో పూర్తిగా యువతకు అవకాశాలిస్తున్నాడు. నిఫ్ట్ వంటి కాలేజీల నుంచి క్రియేటివ్ థాట్స్ ఉన్న యువతని ఎంచుకుంటున్నాడు. అలాగే ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహణ కోసం రౌడీస్ క్లబ్‌కు ఓ టీమ్ కూడా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు సిటీలో రౌడీ స్టైల్స్ ఎంత క్రేజీయో.. ఈ క్లబ్‌లో మోడల్, ఫొటోగ్రాఫర్ లేదా మరేదైనా పోస్టుకు ఎంపికవడం అంతే క్రేజీగా మారింది. ఈ క్లబ్ నిర్వహిస్తున్న ఆన్‌లైన్,ఆఫ్‌లైన్ ఈవెంట్స్‌కు విజయ్ దేవర కొండ అటెండ్ అవుతుండడంతో యూత్‌కి క్లబ్ ఆసక్తిని పెంచుతోంది.
దక్షిణాదిలో మంచి మాస్ ఇమేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్‌కి కూడా మంచి ఇమేజ్ వచ్చింది. యాప్ ద్వారా విక్రయాలతో గత 2018 జులైలో ప్రారంభమైన రౌడీ వేర్ యాప్‌కు డౌన్‌లోడ్స్ మోత మోగించాయి. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన పలువురు యువతీ యువకులతో ఏర్పాటు చేసిన రౌడీక్లబ్ యూత్‌కి క్రేజీగా మారింది. ఈ క్లబ్ నిర్వహించే ప్రమోషనల్ ఈవెంట్స్ సిటీలో ఓ రేంజ్‌లో కాలేజీ యువతను ఆకట్టుకుంటున్నాయి.
యూత్ బ్రాండ్...
‘‘మేం మా రౌడీ వేర్‌ని యువతకు చేరువ చేయాలనుకున్నాం కాబట్టి ఈ బ్రాండ్ ప్రమోషన్ విషయంలో ప్రధానంగా కళాశాల విద్యార్థుల మీద దృష్టి పెట్టాం. వారి నుంచే మోడల్స్ కావాలని కోరుకున్నాం. వాళ్లయితే మా బ్రాండ్‌ని అత్యుత్తమంగా రిప్రజెంట్ చేస్తారనేది మా ఉద్దేశ్యం’’ అని చెప్పారు ఈ క్లబ్ ప్రతినిధి పూజ. మోడల్స్‌తో పాటు తమకు అవసరమైన ఇతరత్రా టాలెంటెడ్ యూత్‌ని ఎంచుకోవడం కోసం ఈ బ్రాండ్ ఆధ్వర్యంలో ఒక టీమ్ కూడా ఏర్పాటైంది.
యాటిట్యూడ్, ఆత్మవిశ్వాసంతో పాటు స్ట్రీట్‌వేర్‌ని ధరించి ప్రజెంట్ చేసే విధానాన్ని విశ్లేషించి మోడల్స్‌ని ఎంచుకుంటున్నామని పూజ చెప్పారు. ‘‘ఇప్పటిదాకా మా క్లబ్‌లో 20 మంది మోడల్స్ ఉన్నారు. వీరిలో హైదరాబాద్ వాసులే కాకుండా వేరే రాష్ట్రాల వారు కూడా ఉన్నారు’’ అని పూజ చెప్పారు. రౌడీ టీమ్ కార్యకలపాలలో నిఫ్ట్ నుంచి వచ్చిన యువత ఎక్కువగా పాలుపంచుకుంటున్నారు. నగరానికి చెందిన ఫ్యాషన్ బ్లాగర్స్ రక్ష , దివ్య బొప్పన, ఈషారావు, ధీరజ్, పాస్వెట్ తదితరులు ప్రస్తుతం వీరికి ప్రమోషన్ చేస్తున్నారు..
యూ ఆర్ ద ఫ్యూచర్...
మా టీమ్‌లో జేర్చుకునేందుకు మోడల్స్ తో పాటుు గ్రాఫిటి డిజైనర్స్, ఫొటో/వీడియో గ్రాఫర్స్, స్టైలిస్ట్స్‌ల కోసం రెగ్యులర్ టాలెంట్ హంట్ చేస్తున్నాం. ఇదొక స్ట్రీట్ వేర్ బ్రాండ్. మా ట్యాగ్‌లైన్ యూ ఆర్ ద ఫ్యూచర్. దానికి తగ్గట్టే 16 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులే మాకు మెయిన్ ఫోకస్. వీరికి ఇచ్చే రెమ్యునరేషన్ అసైన్‌మెంట్ లను బట్టి ఉంటుంది.
– పూజ, రౌడీ క్లబ్ ప్రతినిధి
జాబ్‌తో బ్యాలెన్స్ చేసుకుంటూ...
నా ఫ్రెండ్ విష్ణు అనే ఫొటోగ్రాఫర్ ద్వారా ఈ ‘రౌడీ’ క్లబ్ పరిచయమైంది. మోడల్‌గా ఛాన్స్ వచ్చింది. అరడజను ప్రొడక్టŠస్‌కి మోడలింగ్ చేశా. సన్‌డోనర్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండతో కలిసి పెర్ఫార్మ్ చేయడం మరచిపోలేని జ్ఞాపకం. టీమ్ అందిస్తున్న సహకారం వల్ల జాబ్‌ని మోడలింగ్‌ని బ్యాలెన్స్ చేసుకోవడం కష్టంగా ఏమీ లేదు. – సంజయ్ ఠాకూర్, అమెజాన్ డెవలప్‌మెంట్ ఆఫీసర్
‘రౌడీ’తో హ్యాపీ...
ఇన్‌స్ట్రాగామ్ ద్వారా రౌడీ వేర్ ప్రతినిధులు నన్ను సంప్రదించి మోడల్‌గా ఎన్నుకున్నారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న బ్రాండ్‌కి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ టీమ్‌లో ఉన్న వారంతా టాలెంటెడ్ యువత. వీరి దగ్గర నుంచి ఎన్నో నేర్చుకుంటున్నా.– తన్మయి, మోడల్
Comments
Please login to add a commentAdd a comment