Saloni Patel: అనుకొని ఈ ఫీల్డ్‌లోకి రాలేదు.. కానీ అనుకోకుండా? | Saloni Patel Fashion And Her Life Success story | Sakshi
Sakshi News home page

Saloni Patel: అనుకొని ఈ ఫీల్డ్‌లోకి రాలేదు.. కానీ అనుకోకుండా?

Published Sun, Aug 11 2024 4:40 AM | Last Updated on Sun, Aug 11 2024 4:40 AM

Saloni Patel Fashion And Her Life Success story

ఈమె పేరు.. సలోనీ పటేల్‌ మోడల్, వెబ్‌ స్టార్‌గా వెల్‌ నోన్‌!

‘అనుకొని ఈ ఫీల్డ్‌లోకి రాలేదు. అనుకోకుండా ఎంటర్‌ అయ్యాను. ఈ జాబ్‌ రొటీన్‌గా ఉండదు. నేర్చుకోవడానికి రోజూ ఏదో ఒక కొత్త విషయం ఉంటుంది. కెరీర్‌లో నేను ఏ ఎక్సయిట్‌మెంట్‌నైతే కోరుకున్నానో అది ఈ ఫీల్డ్‌లో దొరికింది. అందుకే ఇందులో సెటిల్‌ అయిపోయాను!’ – సలోనీ పటేల్‌.

  • ఆమె పుట్టింది, పెరిగింది.. న్యూ ఢిల్లీలో. పంజాబీ కుటుంబం. చిన్నప్పుడే కథక్‌ డాన్స్‌లో శిక్షణ పొందింది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో బీటెక్‌ చేసింది. చదువైపోగానే టీసీఎస్‌ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌)లో జావా డెవలపర్‌గా పనిచేసింది. కానీ ఎలాంటి ఉత్సాహాన్నివ్వని ఆ ఉద్యోగం ఆమెకు ఆసక్తినివ్వలేదు. అందుకే ఇతర కెరీర్‌ ఆప్షన్స్‌ని ఎక్స్‌ప్లోర్‌ చేద్దామనుకుని టీసీఎస్‌ జాబ్‌కి రిజైన్‌ చేసింది.

  • ఉద్యోగం కోసం దరఖాస్తులు పెట్టుకుంటూనే ఎంబీఏ ఎంట్రెన్స్‌ రాసింది. సీట్‌ వచ్చింది. బిజినెస్‌ స్కూల్లో జాయిన్‌ కావడానికి 6 నెలల టైమ్‌ ఉండటంతో మళ్లీ ఉద్యోగ అన్వేషణలో పడిపోయింది. ఈలోపే ‘పర్పుల్‌ థాట్స్‌’ అనే మోడలింగ్‌ ఏజెన్సీ నుంచి మోడలింగ్‌ చాన్స్‌ వచ్చింది. ఏంబీఏలో జాయిన్‌ అయ్యేవరకు సరదాగా మోడలింగ్‌ చేద్దామని ఆ చాన్స్‌కి ఓకే చెప్పింది.

  • ర్యాంప్‌ వాక్‌లు, కొత్తకొత్త వాళ్ల పరిచయం, కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లడం.. ఇవన్నీ మోడలింగ్‌ మీద సలోనీకి ఇంట్రెస్ట్‌ను పెంచాయి. మోడలింగ్‌లోనే కెరీర్‌ వెదుక్కోవాలని నిశ్చయించుకుంది.

  • మోడలింగ్‌ షూట్‌ కోసం ఒకసారి ముంబై వెళ్లినప్పుడు.. అక్కడ యాక్టింగ్, థియేటర్‌ వర్క్‌షాప్‌కి హాజరైంది. నచ్చడంతో థియేటర్‌లో ట్రైనింగ్‌ తీసుకుంది. పలు నాటకాల్లో నటించింది. ఆ టైమ్‌లోనే ప్యార్‌ విచ్, పీవైటీ (ప్రెటీ యంగ్‌ థింగ్‌) మ్యూజిక్‌ వీడియోల్లో కనిపించింది.

  • సలోనీ థియేటర్‌ పర్‌ఫార్మెన్స్‌ జీటీవీ ‘కోల్డ్‌ లస్సీ ఔర్‌ చికెన్‌ మసాలా’ అనే వెబ్‌ సిరీస్‌లో అవకాశాన్నిచ్చింది. ఆ తర్వాత ‘ద హార్ట్‌బ్రేక్‌ హోటల్‌’ అనే వెబ్‌ సిరీస్,  ‘ద ఎలిఫెంట్‌ ఇన్‌ ద రూమ్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌లోనూ నటించింది. సలోనీకి బ్రేక్‌నిచ్చిన సిరీస్‌ మాత్రం ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లోని  ‘క్యాంపస్‌ డైరీస్‌’.

  • ఆమె నటించిన మరో షార్ట్‌ ఫిల్మ్‌ ‘ద గుడ్‌ న్యూస్‌’ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టడమే కాదు పలు ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో స్క్రీన్‌ అయ్యి, అవార్డులనూ అందించింది.

  • సలోనీ సామాజిక సేవా కార్యకర్త కూడా! ఏమాత్రం సమయం చిక్కినా ముంబైలో జరిగే సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకుంటుంది. కోవిడ్‌ సమయంలో తన సేవింగ్స్‌ అన్నిటినీ కోవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌కి డొనేట్‌ చేసింది.

  • సలోనీ లేటెస్ట్‌ వెబ్‌ సిరీస్‌లు ‘సన్‌ఫ్లవర్‌’ జీ5లో, ‘పాట్‌లక్‌’ సోనీ లివ్‌లో స్ట్రీమ్‌ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement