మోడలింగ్ టూ సీరియల్స్..
‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో ప్రతినాయకి పాత్ర పోషించి మెప్పించిన నటి సింగంపల్లి శృతి. బుల్లితెరపై రుతురాగాలు, శ్రావణ సమీరాలు, మొగలిరేకుల్లో మహిళా ప్రేక్షకుల్ని మెప్పించిన గొప్పనటి ఆమె. ఓ లఘుచిత్రంలో నటించేందుకు కౌతవరం వచ్చారు. మోడలింగ్ నుంచి సీరియల్స్ వరకు తన జీవన ప్రస్థానాన్ని ‘సాక్షి’కి వివరించారు.
- కౌతవరం (గుడ్లవల్లేరు)
సాక్షి : మీ స్వస్థలం?
శృతి : వైజాగ్ అయినా.. పాతికేళ్లుగా హైదరాబాద్‌లోనే స్థిరపడ్డాం.
సాక్షి : నటనలోకి ఎలా వచ్చారు.?
శృతి : ఫస్ట్ మోడలింగ్ చేసేదాన్ని. స్నేహితుల పరిచయాలతో నటనలోకి అడుగుపెట్టాను.
సాక్షి : మీ మొదటి సీరియల్?
శృతి : 1991లో ‘సీతారాముల సినిమా గోల’ అనే సీరియల్‌తో మొదలుపెట్టా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 16ఏళ్ల వయసులోనే సీరియల్స్‌లోకి వచ్చేశా.
సాక్షి : మీకు పేరు తెచ్చిన సీరియల్స్..
శృతి : వందకుపైగా సీరియల్స్‌లో నటించా. రుతురాగాలు, చక్రవాకం, మొగలిరేకులు, చంద్రముఖి, కన్యాశుల్కం, శ్రావణ సమీరాలు, మమతల కోవెలలోని పాత్రలు మంచి పేరు తెచ్చారుు.
సాక్షి : సినిమాల సంగతేంటి?
శృతి : తొలి సినిమా అమ్మోరు. కెమెరామెన్ గంగతో రాంబాబు, కొత్తజంట, మీ శ్రేయోభాలాషి వంటి 30 సినిమాల్లో నటించా.
సాక్షి : మీ భర్త మధుసూదన్ కూడా నటుడే కదా..
శృతి : అవును. ‘ఆటోనగర్ సూర్య’ చిత్రంలో విలన్‌గా చేశారు. ‘ఒక లైలా కోసం..’ కూడా ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. తమిళంలో ఆయన నటించిన ‘గోలీసోడ’ పెద్ద హిట్. ప్రస్తుతం వంశం, కిక్-2లో నటిస్తున్నారు.