
మీరే కావచ్చు సూపర్ మోడల్
మోడలింగ్‌లో ప్రతిభ చాటాలనుకున్న యువతీ యువకులకు చక్కని అవకాశం. ‘సూపర్‌మోడల్ హైదరాబాద్ 2014’ పేరిట నగరంలో మోడలింగ్ పోటీలు జరగనున్నాయి. లైమ్‌లైట్ ఎంటర్‌టైన్‌మెంట్, సెలబ్ ఓ ఫియెస్టా సంయుక్తంగా నిర్వహించనున్న కాంటెస్ట్ ఆడిషన్స్ ఈనెల 26న ప్రారంభమవుతాయి. యువతులైతే 5.5, యువకులైతే 5.9 కనీస ఎత్తు ఉండాలి. 18 నుంచి 28 ఏళ్ల లోపు వయసు వారు అర్హులు. ఫైనల్స్ ఆగస్ట్ 23న జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతాయని నిర్వాహకులు బుధవారం తెలిపారు. మరిన్ని వివరాలకు ‘సూపర్‌మోడల్‌హైదరాబాద్‌డాట్‌కామ్’ చూడవచ్చన్నారు. జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ ప్రెస్‌మీట్‌లో నటి సోనియా, సెలబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ వెరోనికా, ఫిట్‌నెస్ ట్రైనర్ కిరణ్ డెంబ్లా పాల్గొన్నారు.
సాక్షి, సిటీప్లస్