తారాస్వరం: నేనెప్పుడూ అలానే ఆలోచిస్తా! | I always think like that : Kajal agarwal | Sakshi
Sakshi News home page

తారాస్వరం: నేనెప్పుడూ అలానే ఆలోచిస్తా!

Published Sun, Oct 13 2013 2:16 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

తారాస్వరం: నేనెప్పుడూ అలానే ఆలోచిస్తా! - Sakshi

తారాస్వరం: నేనెప్పుడూ అలానే ఆలోచిస్తా!

కాజల్ అగర్వాల్
 పుట్టినరోజు: జూన్ 19
 నచ్చే రంగులు: నీలం, తెలుపు, ఎరుపు
 నచ్చే ఆహారం: హైదరాబాద్ బిర్యానీ
 నచ్చే ప్రదేశాలు: కేరళ, గోవా, మారిషస్
 నచ్చే కారు: బీఎండబ్ల్యూ
 నచ్చిన పుస్తకం: బ్రిడ్జెస్ ఆఫ్ మ్యాడిసన్ కౌంటీ
 నచ్చే హీరో: ఆమిర్‌ఖాన్
 నచ్చే హీరోయిన్: శ్రీదేవి, కాజోల్, సుస్మితాసేన్

 
 మీ నిక్‌నేమ్:
 గుడ్డా. అంటే గుడియా అన్నమాట. దానికి అర్థం బొమ్మ అని. చూడ్డానికి బొమ్మలా ఉండేదాన్నని అందరూ నన్ను అలానే పిలిచేవారు.
 
 ఫస్ట్ క్రష్:
 తొమ్మితో తరగతిలో ఉన్నప్పుడే ఏర్పడింది. (నవ్వుతూ) డిటెయిల్స్ అడక్కండి.
 
 ప్రభావితం చేసిన వ్యక్తి:
 మా అమ్మ. తను చాలా తెలివైనది. సమర్థవంతురాలు. తను నా ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్.
 
 ఎలాంటి దుస్తులు నచ్చుతాయి:
 నా శరీరం చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అందుకే ఏ డ్రెస్ వేసుకున్నా నాకు బాగానే నప్పుతుంది. నాకయితే జీన్స్, టీషర్ట్స్, చీరలు ఎక్కువ ఇష్టం.
 
 అందమంటే:
 మనసు. అది అందంగా ఉంటే... మనకు అన్నీ అందంగా కనిపిస్తాయి. మనమూ అందరికీ అందంగా కనిపిస్తాం.
 
 అందంగా ఉండటానికి ఏం చేస్తారు:
 క్రమశిక్షణతో కూడిన వ్యాయామం, క్రమ పద్ధతిలో ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యాన్ని మించిన అందమేముంది!
 
 ఎందుకలా చేశానా అని ఫీలయ్యేది:
 మోడలింగ్ అవకాశాలు రావడంతో అటు వెళ్లిపోయాను. తర్వాత సినిమాల్లోకి రావడంతో చదువుకు దూరమయ్యాను. అనుకున్నట్టుగా ఎంబీఏ చేయలేకపోయానని ఇప్పటికీ ఫీలవుతుంటా.
 
 మర్చిపోలేని ఫోన్‌కాల్:
 చందమామ రిలీజ్ అయ్యాక కృష్ణవంశీ ఫోన్ చేశారు. సినిమా పెద్ద హిట్, నిన్ను అందరూ మెచ్చుకుంటున్నారు అంటూ ఆయన చెప్పిన మాటల్ని నేను మర్చిపోలేదు.
 
 బెస్ట్ ఫ్రెండ్‌‌స ఉన్నారా:
 ఎందుకు లేరూ! అయితే ఇండస్ట్రీలో కాదు. ముంబైలో ఉన్నారు. ఒకమ్మాయి ఇండియాలోనే ఫేమస్ డాక్టర్. ఇంకొకమ్మాయి లాయర్. నా ఫ్రెండ్సంతా మంచి పొజిషన్‌‌సలో ఉన్నారు. అందుకు చాలా సంతోషపడుతుంటా!
 
 ఎదుటివారిలో నచ్చేది, నచ్చనిది:
 నచ్చేది నిజాయతీ, సచ్చీలత; నచ్చనిది హిపోక్రసీ.
 
 మీలో మీకు నచ్చేది:
 ఎప్పుడూ అవతలివారి స్థానంలో నిలబడి ఆలోచిస్తాను. వారి పరిస్థితిని అర్థం చేసుకుని నడచుకుంటాను.
 
 మీలో మీకు నచ్చనిది:

 అందరికీ త్వరగా దగ్గరైపోతాను. వాళ్లు దూరమైతే బాధపడిపోతాను.
 
 ఎదుటివాళ్లు తప్పుగా అనుకునేది:
 నేను కాస్త గట్టిగా మాట్లాడతాను. దాంతో అరిచినట్టు అనిపిస్తుంది. యాటిట్యూడ్ ప్రాబ్లెమ్ వల్ల అలా డామినేటింగ్‌గా మాట్లాడతానని, నాకు పొగరని అనుకుంటారు కొందరు. కానీ అది నిజం కాదు.
 
 మీ గురించి ఎవరికీ తెలియనిది:
 నేను చాలా చిన్న వయసులోనే నటినయ్యానన్న విషయం చాలామందికి తెలియదు. నా తొలిచిత్రం ‘క్యూం... హోగయానా’ చేసేటప్పటికి నా వయసు పదమూడు. ఊరికే సరదాగా చేసిన సినిమా అది.
 
 అత్యంత బాధపెట్టే విషయం:
 సిగ్నల్స్ దగ్గర కారు ఆగినప్పుడు చాలామంది పిల్లలు వచ్చి అడుక్కుంటూ ఉంటారు. కొంత మంది అయితే గబగబా కారు తుడిచేసి, డబ్బులిమ్మని చేతులు చాపుతారు. వాళ్లని చూస్తే మనసు అదోలా అయిపోతుంది.
 
 దేవుడిపై నమ్మకం:
 చాలా ఉంది. మా ఇంట్లో రోజూ పూజ చేస్తాం. పండుగలప్పుడు ప్రత్యేక పూజలు ఉంటాయి. మాకు దసరా చాలా స్పెషల్. అందరం కలిసి ఘనంగా జరుపుకుంటాం. ఒకవేళ అప్పటికి నేను షూటింగ్‌లో ఉంటే యూనిట్ సభ్యులతో కలసి చేసుకుంటాను. అంతేకానీ, ఆ పండుగను మాత్రం మిస్సవను.
 
 నమ్మే సిద్ధాంతం:
 సక్సెస్ అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. నీ చేయి జారిపోకుండా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే.
 
 మళ్లీ జన్మంటూ ఉంటే:
 నేను పునర్జన్మను నమ్మను. కర్మఫలాన్ని నమ్ముతాను. మనకున్నది ఈ ఒక్క జన్మే అని భావించి, అందరూ మంచిగా ఉంటే ఏ సమస్యలూ ఉండవని నా అభిప్రాయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement