భారత్‌కు చెందిన పర్‌ఫ్యూమ్, డియోడ్రంట్, స్ప్రే తయారీదారు కంపెనీ లేయర్స్‌కి షాక్ తగిలింది. క్రియేటివిటీ పేరిట రూపొందించిన మహిళలను అగౌరవపరిచేలా ఉన్న సెమీ బూతు అడ్వెర్‌టైజ్‌మెంట్‌పై కేంద్రం కన్నెర్ర చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ యాడ్ కనిపించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.
లేయర్స్ సంస్థ షాట్ పేరుతో ఇటీవల ఓ యాడ్ ప్రోమోను రెడీ చేసింది. ఈ యాడ్ రిలీజ్ కావడం ఆలస్యం దుమారం చెలరేగింది. ఈ యాడ్ ద్వందార్థాలతో మహిళలను కించపరిచేలా మహిళలపై లైంగిక దాడులకు ప్రోత్సాహం అందించేలా ఉందంటూ స్త్రీ వాదులతో పాటు ప్రజా సంఘాలు విమర్షలు ఎక్కుపెట్టాయి. సోషల్ మీడియాలోనూ ఈ యాడ్‌కి పెద్దగా మద్దతు లభించలేదు. అన్ని వైపుల నుంచి ఘాటైన విమర్శలు ఎదుర్కొంది లేయాన్స్.
లేయాన్స్ తాజా యాడ్ వివాదంపై కేంద్రం కూడా స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ యాడ్ యూట్యూబ్, ట్విటర్‌లో కనిపంచడానికి వీలులేదంటూ ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రభుత్వ ఐటీ రూల్స్ - 2021కి విరుద్ధంగా ఉన్నందున ఈ నిషేధం అమలు చేస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు యూట్యూబ్, ట్విటర్‌లకు ఈమెయిల్ ద్వారా ఆదేశాలు పంపింది కేంద్రం.
Fuming at cringe worthy ads of the perfume ‘Shot’. They show toxic masculinity in its worst form and clearly promote gang rape culture!The company owners must be held accountable. Have issued notice to Delhi Police and written letter to I&B Minister seeking FIR and strong action. pic.twitter.com/k8n06TB1mQ
— Swati Maliwal (@SwatiJaiHind) June 4, 2022
చదవండి: వీడియో: ఇదెక్కడి ‘షాట్’.. డబుల్ మీనింగ్ యాడ్స్‌పై దుమారం
Comments
Please login to add a commentAdd a comment