సాక్షి,తాడేపల్లి: ప్రకటనల రంగ దిగ్గజం పీయూష్ పాండే (70) మరణంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
వైఎస్ జగన్ తన ట్వీట్‌లో..‘ దేశానికి కనెక్టయ్యేలా ఆయన సృజనాత్మక ప్రకటనలు ఉంటాయి. అలాంటి పద్మశ్రీ పాండేని కోల్పోవటం విచారకరం. పాండే కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. సాక్షి, భారతి సిమెంట్స్ ప్రారంభ సమయంలో ఆయన చేసిన సృజనాత్మక కృషి ఎప్పటికీ గుర్తుండి పోతుంది’అని పేర్కొన్నారు’అని పేర్కొన్నారు.
కాగా, ప్రకటనల రంగ దిగ్గజం పీయూష్ పాండే (70) అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారు. ప్రకటనల రంగానికి నాలుగు దశాబ్దాలకు పైగా విశేష సేవలు అందించిన ఈ సృజనాత్మక మేధావి, భారతీయ ప్రకటనల రంగాన్ని మలుపు తిప్పిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
Deeply saddened by the loss of Padma Shri Piyush Pandey Ji, an advertising legend who connected India with his creative storytelling. My sincere condolences to his family and friends. The work he has done for the launch of Sakshi and Bharathi Cements are well cherished. pic.twitter.com/BPf5KZmbeS
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 24, 2025


