ఏ బిజినెస్ చేస్తే డబ్బులు బాగా సంపాదించొచ్చు. తక్కువ పెట్టుబడి. తక్కువ రిస్క్. మంచి ఇన్‌కమ్ కావాలి. ఏంటా బిజినెస్? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే నా లైఫ్ సెట్ అవుతుంది. నన్నెవ్వరూ ఆపలేరు. 24 గంటలూ పనిచేస్తా. తిండీ నిద్రా మానేస్తా. నాకీ ఒక్క ఆన్సర్ కావాలి. మీరూ ఇలా ఆలోచిస్తుంటే ఇది మీకోసమే.
మీరెప్పుడైనా బెంగళూరు వెళ్లారా? వెళితే బెంగళూరులోని ఇందిరా నగర్ ‘రామేశ్వరం కేఫ్’ ను సందర్శించాల్సిందే. ఎందుకంటే ప్రపంచ దేశాల్లోని ఫుడ్ లవర్స్ ఈ కేఫ్‌లోని ఫుడ్ ఐటమ్స్‌ను అమితంగా ఇష్టపడతారు. చూడటానికి కిరాణా కొట్టులా? చాలా చిన్నగా కనిపిస్తుంది. కానీ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR) పేరుతో ఈ కేఫ్‌లో నెలకు రూ.4.5 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఇంతకీ ఈ కేఫ్ ఎవరిదో తెలుసా?
రాఘవేంద్రరావు 20 ఏళ్లకు పైగా ఫుడ్ బిజినెస్‌లో అనుభవం ఉంది. ఆయన భార్య, సీఏగా విధులు నిర్వహిస్తున్న దివ్యా రాఘవేంద్ర రావులే ఈ కేఫ్‌ను ప్రారంభించారు. ఇప్పుడు ఈ కేఫ్ వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అందుకు కారణం కేఫ్‌లో జరిగే బిజినెస్సే.
మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే
‘కల, కల.. కలలు ఆలోచనలుగా మారితే.. ఆ ఆలోచనల్ని ఆచరణలో పెడితే అనుకున్న విజయం మీ సొంతం అవుతుంది.’ అని చెప్పిన మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంటే రాఘవేంద్రరావుకు అమితమైన ప్రేమ. ఆ ప్రేమతోనే కలాం జన్మించిన రామేశ్వరం ప్రాంతం పేరుతో ‘రామేశ్వరం కేఫ్’ పేరుతో బెంగళూరులో రెండు కేఫ్‌లను 2021లో ప్రారంభించారు.
చదవండి👉 బ్యాంకుల్లో 'అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్', అందులో పేరుంటే మీకే సొంతం.. చెక్ చేసుకోండిలా!
మా లక్ష్యం అదే
రామేశ్వరం కేఫ్‌లో దక్షిణ భారత రుచులను దేశం అంతా విస్తరించాలనేది మాలక్ష్యం. బెంగళూరుతో పాటు చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, పూణె, అహ్మదాబాద్, ముంబై వంటి నగరాలతో పాటు రాబోయే 5 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఉనికి చాటాలాని భావిస్తున్నట్లు రాఘవేంద్ర తెలిపారు.
రామేశ్వరం కేఫ్‌లో దొరికే ఫుడ్ ఐటమ్స్ ఇవే
వడ, మిని వడ,ఇడ్లీ, నెయ్యి..బటర్ ఇడ్లీ, నెయ్యి పుడి ఇడ్లీ,లెమన్ ఇండ్లీ, నెయ్యి సాంబార్ ఇడ్లీ, వెన్ పొంగల్,సక్కరై పొంగల్ తో పాటు ఇతర ఆహార పదార్ధాలను టేస్ట్ చేయొచ్చు.
సుజిత్ కుమార్ నోటా రామేశ్వరం కేఫ్ మాట
మార్కెట్‌ప్లేస్ ఉడాన్ సహ వ్యవస్థాపకుడు సుజిత్ కుమార్ ఇటీవల పాడ్‌కాస్ట్‌లో ఇదే కేఫ్ గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఆ పాడ్ కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ ‘రామేశ్వరం కేఫ్ యాజమాన్యం రోజుకు 7,500 మందికి సర్వ్ చేస్తుంటారు. కేఫ్ విస్తీర్ణం 10 బై 10 లేదా 10 బై 15 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. నెలకు రూ.4.5 కోట్లతో ఏడాదికి రూ. 50 కోట్ల వ్యాపారం చేస్తుంది. దాదాపు 70 శాతం గ్రాస్ మార్జిన్ పొందుతున్నారని అన్నారు. అంతే ఆ కేఫ్ గురించి తెలుసుకునేందుకు భోజన ప్రియులు ఉత్సాహాం చూపిస్తున్నారు.
నిఖిల్ కామత్ పాడ్ కాస్ట్‌లో
ఇండియన్ స్టాక్ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడు కుమార్ నిఖిల్ కామత్ ‘డబ్ల్యూటీఎఫ్ ఈ-కామర్స్’ పేరుతో పాడ్ కాస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమం 3వ ఎపిసోడ్‌లో కిషోర్ బియాని (ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకుడు), విదిత్ ఆత్రే (మీషో సహ వ్యవస్థాపకుడు), ఉడాన్ మార్కెట్‌ప్లేస్ ఉడాన్ సహ వ్యవస్థాపకుడు సుజీత్ కుమార్ ఈ ఎపిసోడ్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రిటైల్, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో వ్యాపారం, దేశ విదేశాల్లో పెట్టుబడులు గురించి చర్చించారు.
చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే?
Comments
Please login to add a commentAdd a comment