అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. రీసెంట్‌గానే బంగార్రాజు చిత్రంతో హిట్ కొట్టిన చై ప్రస్తుతం ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాడు. సమంతతో విడాకుల అనంతరం అటు ప్రొఫెషనల్‌గానే కాకుండా పర్సనల్ లైఫ్‌లోనూ చైలో చాలానే మార్పు కనిపిస్తుంది. ఇదివరకు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని చైతూ ఈ మధ్యకాలంలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నాడు.
సినిమా ప్రమోషన్స్‌తో పాటు తనకి సంబంధించిన అప్‌డేట్స్‌ని సైతం అప్పుడప్పుడూ నెటిజన్లతో షేర్ చేసుకుంటున్నాడు. తాజాగా చై ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. షోయూ పేరుతో హైదరాబాద్‌లో ఓ సరికొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సైతం చై తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనికి వెంకటేశ్ కూతురు ఆశ్రిత.. 'ఈ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు బావా' అంటూ బెస్ట్ విషెస్ అందించింది.
Comments
Please login to add a commentAdd a comment