
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోకు సెప్టెంబర్ క్వార్టర్‌లో నష్టాలు మరింత తీవ్రమయ్యాయి. రూ.435 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టాలు రూ.230 కోట్లుగానే ఉన్నాయి. ఆదాయం రూ.426 కోట్ల నుంచి రూ.1,024 కోట్లకు పెరిగింది. తన నిర్వహణలోని ఫిస్టో కంపెనీని క్యూర్‌ఫిట్‌కు 50 మిలియన్ డాలర్లకు విక్రయించనున్నట్టు ప్రకటించింది. అలాగే మరో 50 మిలియన్ డాలర్లను క్యూర్‌ఫిట్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా (మొత్తం 100 మిలియన్ డాలర్లు) 6.4 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. బిగ్‌ఫూట్ రిటైల్ సొ ల్యూషన్స్ (షిప్‌రాకెట్)లో 75 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌కు ఒప్పందం చేసుకుంది.
మ్యాజిక్‌పిన్ రూ. 446 కోట్ల సమీకరణ
రిటైల్ సంస్థల ఆఫర్ల వివరాలను వినియోగదారులకు అందించే డిజిటల్ సంస్థ మ్యాజిక్‌పిన్ కొత్తగా 60 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 446 కోట్లు) సమీకరించింది. ఫుడ్ సర్వీసుల సంస్థ జొమాటోతో పాటు ప్రస్తుత ఇన్వెస్టర్లు లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్‌నర్స్ కూడా ఈ విడత ఇన్వెస్ట్ చేసినట్లు సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment