డబుల్ డెక్కర్ బస్సులు గుర్తున్నాయా. అవి మనం నేరుగా చూడకపోవచ్చు గానీ 90 దశకంలో కొన్ని సినిమాల్లో చూసుంటాం. ప్రస్తుత అవే కాలానికి అనుగుణంగా ఏసీ హంగులతో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్పు చెంది మళ్లీ రోడ్లపైకి వస్తున్నాయి. వీటిని హిందూజా గ్రూప్‌నకు చెందిని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అశోక్ లే ల్యాండ్ ఎలక్ట్రిక్ విభాగానికి చెందిన స్విచ్ మొబిలిటీ తయారు చేసింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన ఈ డబుల్ డెక్కర్ ఏసీ బస్సులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముంబైలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణ రవాణాను సంస్కరణలపై దృష్టి సారిస్తున్నామన్నారు. నగర రవాణాకు ఈ తరహా బస్సులు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రస్తుతం యూకేలో ఈ బస్సులు వాడకంలో ఉండగా, త్వరలో భారత్ రోడ్లపైకి రానున్నాయి.
తేలికపాటి అల్యూమినియం బాడీతో వీటిని నిర్మించారు. ముంబైలోని బృహన్ ముంబాయ్ ఎలక్ట్రిసిటీ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్(BEST) 200 డబుల్ డెక్కర్ బస్సులను ఆర్డర్ చేసినట్లు స్విచ్ మొబిలిటీ భారత సీఓఓ అధికారి తెలిపారు. 231 kwh కెపాసిటీ కలిగిన ఈ బస్సు డ్యూయల్ గన్ చార్జింగ్ సిస్టమ్ కలిగి ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణించవచ్చ.
First AC double decker bus by @switchEVglobal entering Mumbai this morning. The launch is tomorrow. (Credits to respective owner) pic.twitter.com/QrQKjUy3X4
— Rajendra B. Aklekar (@rajtoday) August 17, 2022
చదవండి: Tencent: పదేళ్లలో ఇదే తొలిసారి.. 5వేలకు పైగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ
Comments
Please login to add a commentAdd a comment