దారుణం: కారును ఢీకొట్టి.. ఆపై ఫల్టీ కొట్టి | Speeding Bus Jumps Red Light, Flips After Smashing Into Car In Kolkata, Shocking Video Inside - Sakshi
Sakshi News home page

Car-Bus Accident In Kolkata: కారును ఢీకొట్టి.. ఆపై ఫల్టీ కొట్టి

Published Thu, Oct 5 2023 1:21 PM | Last Updated on Thu, Oct 5 2023 1:55 PM

Speeding Bus Flips After Smashing Into Car In Kolkata - Sakshi

కోల్‌కతా: కోల్‌కతాలోని సాల్ట్ లేక్ ఏరియాలో ఘోర ప్రమాదం జరిగింది. రెడ్‌ సిగ్నల్‌ను లెక్క చేయకుండా వేగంగా దూసుకొచ్చిన బస్సు.. కారును ఢీకొట్టింది. ఈ ‍ప్రమాదంలో కారుకు ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ బస్సు ఫల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

అక్టోబర్ 2న ఉదయం రోడ్డంతా దాదాపుగా ఖాలీగా ఉంది. ఓ వైపు నుంచి వస్తున్న బస్సు ఎదురుగా ఉన్న రెడ్ సిగ్నల్‌ను గమనించకుండా వేగంగా దూసుకొచ్చింది. మరోవైపు నుంచి వేగంగా వస్తున్న కారును ఢీకొట్టింది. కారుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. బస్సు మాత్రం ఫల్టీ కొడుతూ కిందపడింది. ఐదుగురు ప్రయాణికులకు తేలికపాటి గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.       

ఇదీ చదవండి: Sikkim Flash Floods: సిక్కింలో కుంభవృష్టి.. 14 మంది మృతి.. 22 మంది జవాన్లు సహా 102 మంది మిస్సింగ్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement