హైదరాబాద్‌లో క్రమంగా డీజిల్ బస్సులు తొలగించండి
కొత్త బస్సుల కొనుగోలుకు ఏర్పాట్లు చేసుకోండి
ఆర్టీసీ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో డీజిల్ బస్సులకు బదులు అన్నీ బ్యాటరీ బస్సులే తిరగా లని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు చెప్పారు. నగరంలో 2,700 బస్సులు తిరుగుతున్నాయని అధికారులు చెప్పగా.. వాటిల్లో డీజిల్ బస్సులను తొలగించి అన్నింటినీ క్రమంగా బ్యాటరీ సర్వీసుల్లోకి మార్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ఒక సంవత్సరంలో ఎన్ని బస్సులు సమకూర్చుకునే అవకాశం ఉందో తేల్చాలని, దీని సాధ్యాసాధ్యా లను పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం ఆయన ఆర్టీసీపై ఉన్నత స్థాయిలో సమీక్షించారు. బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై ఆరా తీశారు. ప్రస్తుతం 7,292 బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి అమలవుతోందని, ఇప్పటివరకు ఈ పథకాన్ని 83.42 కోట్ల మంది వినియోగించుకుని, రూ.2,840.71 కోట్లు ఆదా చేసుకున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
ఈ పథకం ప్రారంభమైన తర్వాత వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు వచ్చే మహిళల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు. మహిళల ఉచిత ప్రయాణంతో పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో, ప్రభుత్వం చెల్లిస్తున్న రీయింబర్స్‌మెంట్‌తో సంస్థ లాభాల్లోకి వస్తోందని చెప్పారు.
బ్యాటరీల దిగుమతి ఇబ్బందిగా ఉంది
నగరంలో తిప్పేందుకు 500 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇస్తే, ఇప్పటికీ అన్నీ సరఫరా కాలేదని, విదేశాల నుంచి బ్యాటరీలను దిగుమతి చేసుకోవాల్సి రావటం బస్సు తయారీ సంస్థలకు ఇబ్బందిగా ఉందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులు కొనాలంటే భారీ వ్యయం అవుతుందని, ఒక్కో బస్సు రూ.1.85 కోట్ల వరకు ధర పలుకుతోందని చెప్పారు.
సంస్థ ప్రస్తుతం ఆద్దె ప్రాతిపదికన బస్సులు తీసుకుని నిర్వహిస్తోందని వివరించారు. దీంతో ఆయా కంపెనీల ప్రతినిధులను పిలిపించి చర్చించాలని, కావల్సినన్ని బస్సుల సరఫరాకు ఉన్న సమస్యను అధిగమించేందుకు ఉన్న మార్గాలపై చర్చించేందుకు మరో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని సీఎం చెప్పారు. ఆ సమావేశంలో ఈ బస్సుల అంశంతో పాటు, బ్యాంకు అప్పులపై వడ్డీని తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలపై చర్చిద్దామని చెప్పారు.
అప్పుల రీస్ట్రక్చర్‌కు మార్గాలు పరిశీలించండి
ఆర్టీసీకి లాభాలు వస్తున్నా, వివిధ బ్యాంకుల నుంచి తెచ్చిన రూ.వేల కోట్ల రుణాలపై చెల్లిస్తున్న వడ్డీ ఎక్కువగా ఉండటం సంస్థకు ఇబ్బందిగా మారి నందున.. ఆ అప్పులను రీస్ట్రక్చర్ చేసుకునేం దుకు ఉన్న మార్గాలను పరిశీలించాలని ముఖ్య మంత్రి సూచించారు. వడ్డీ తగ్గించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలు పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్సుల్లో పెరు గుతున్న ప్రయాణికుల సంఖ్య దృష్ట్యా కొత్త బస్సుల కొనుగోలుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.
కాగా వివిధ బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు, ఉద్యోగుల భవిష్య నిధి నుంచి వాడు కున్న నిధులు, విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సి న బకాయిలు కలిపి రూ.6,322 కోట్లు ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద సంస్థ అప్పులను ప్రభుత్వం క్లియర్ చేస్తే బాగుంటుందన్నారు. సమీక్షలో సీఎస్ శాంతికుమారి, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, సీఎం కార్యద ర్శులు షానవాజ్ ఖాసిం, చంద్రశేఖరరెడ్డి, టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment