Battery bus
-
హైదరాబాద్‌లో బ్యాటరీ బస్సులే తిప్పండి. ఆర్టీసీ అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
బ్యాటరీ బస్సులే తిప్పండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో డీజిల్ బస్సులకు బదులు అన్నీ బ్యాటరీ బస్సులే తిరగా లని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు చెప్పారు. నగరంలో 2,700 బస్సులు తిరుగుతున్నాయని అధికారులు చెప్పగా.. వాటిల్లో డీజిల్ బస్సులను తొలగించి అన్నింటినీ క్రమంగా బ్యాటరీ సర్వీసుల్లోకి మార్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ఒక సంవత్సరంలో ఎన్ని బస్సులు సమకూర్చుకునే అవకాశం ఉందో తేల్చాలని, దీని సాధ్యాసాధ్యా లను పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన ఆర్టీసీపై ఉన్నత స్థాయిలో సమీక్షించారు. బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై ఆరా తీశారు. ప్రస్తుతం 7,292 బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి అమలవుతోందని, ఇప్పటివరకు ఈ పథకాన్ని 83.42 కోట్ల మంది వినియోగించుకుని, రూ.2,840.71 కోట్లు ఆదా చేసుకున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ పథకం ప్రారంభమైన తర్వాత వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు వచ్చే మహిళల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు. మహిళల ఉచిత ప్రయాణంతో పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో, ప్రభుత్వం చెల్లిస్తున్న రీయింబర్స్‌మెంట్‌తో సంస్థ లాభాల్లోకి వస్తోందని చెప్పారు.బ్యాటరీల దిగుమతి ఇబ్బందిగా ఉందినగరంలో తిప్పేందుకు 500 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇస్తే, ఇప్పటికీ అన్నీ సరఫరా కాలేదని, విదేశాల నుంచి బ్యాటరీలను దిగుమతి చేసుకోవాల్సి రావటం బస్సు తయారీ సంస్థలకు ఇబ్బందిగా ఉందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులు కొనాలంటే భారీ వ్యయం అవుతుందని, ఒక్కో బస్సు రూ.1.85 కోట్ల వరకు ధర పలుకుతోందని చెప్పారు. సంస్థ ప్రస్తుతం ఆద్దె ప్రాతిపదికన బస్సులు తీసుకుని నిర్వహిస్తోందని వివరించారు. దీంతో ఆయా కంపెనీల ప్రతినిధులను పిలిపించి చర్చించాలని, కావల్సినన్ని బస్సుల సరఫరాకు ఉన్న సమస్యను అధిగమించేందుకు ఉన్న మార్గాలపై చర్చించేందుకు మరో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని సీఎం చెప్పారు. ఆ సమావేశంలో ఈ బస్సుల అంశంతో పాటు, బ్యాంకు అప్పులపై వడ్డీని తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలపై చర్చిద్దామని చెప్పారు.అప్పుల రీస్ట్రక్చర్‌కు మార్గాలు పరిశీలించండిఆర్టీసీకి లాభాలు వస్తున్నా, వివిధ బ్యాంకుల నుంచి తెచ్చిన రూ.వేల కోట్ల రుణాలపై చెల్లిస్తున్న వడ్డీ ఎక్కువగా ఉండటం సంస్థకు ఇబ్బందిగా మారి నందున.. ఆ అప్పులను రీస్ట్రక్చర్ చేసుకునేం దుకు ఉన్న మార్గాలను పరిశీలించాలని ముఖ్య మంత్రి సూచించారు. వడ్డీ తగ్గించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలు పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్సుల్లో పెరు గుతున్న ప్రయాణికుల సంఖ్య దృష్ట్యా కొత్త బస్సుల కొనుగోలుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. కాగా వివిధ బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు, ఉద్యోగుల భవిష్య నిధి నుంచి వాడు కున్న నిధులు, విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సి న బకాయిలు కలిపి రూ.6,322 కోట్లు ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద సంస్థ అప్పులను ప్రభుత్వం క్లియర్ చేస్తే బాగుంటుందన్నారు. సమీక్షలో సీఎస్ శాంతికుమారి, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, సీఎం కార్యద ర్శులు షానవాజ్ ఖాసిం, చంద్రశేఖరరెడ్డి, టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడీలు పాల్గొన్నారు. -
బ్యాటరీ బస్సుకు రైట్ రైట్!
⇒ అనుమతినిచ్చిన రవాణా శాఖ ⇒ సికింద్రాబాద్–ఎయిర్‌పోర్టు మార్గంలో నడిపేందుకు ఆర్టీసీ సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: పొగలు కక్కుతూ... పర్యావరణానికి హాని చేసే వాహన కాలుష్యాన్ని కొంతైనా తగ్గించేందుకు గ్రేటర్ ఆర్టీసీ చేస్తున్న ప్రయత్నంలో మరో అడుగు ముందుకు పడింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బ్యాటరీ బస్సుకు ఎట్టకేలకు రవాణా శాఖ అనుమతి లభించింది. విద్యుత్‌తో చార్జింగ్ అయ్యే ఈ బస్సు తొలిసారిగా రాజధాని రోడ్లపై దూసుకుపోవడానికి సిద్ధమవుతోంది. నగరానికి చెందిన గోల్డ్‌స్టోన్ సంస్థ పది రోజుల క్రితం ఈ బస్సును పరిచయం చేసిన సంగతి తెలిసిందే. దీన్ని ప్రయోగాత్మ కంగా నడిపేందుకు గ్రేటర్ ఆర్టీసీకి అప్పగించింది. నగరంలో వాహన కాలుష్యం ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన గ్రేటర్ ఆర్టీసీ... దాదాపు 125 సీఎన్జీ, మరికొన్ని బయోడీజిల్ బస్సులు నడుపుతోంది. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల అవసరం లేకుండా పూర్తిగా విద్యుత్‌తో నడిచే బ్యాటరీ బస్సును నడపాలని నిర్ణయించింది. దీనికి తాజాగా రవాణా శాఖ అనుమతి లభించడంతో... సికింద్రాబాద్– శంషాబాద్ అంతర్జా తీయ విమానాశ్రయ మార్గంలో నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది. జేబీఎస్, కంటోన్మెంట్ డిపోల్లో దీనికి చార్జింగ్ సదుపాయం కల్పించారు. వచ్చే ఫలితాలను బట్టి మరిన్ని బ్యాటరీ ఆధారిత బస్సులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. విశ్వనగరం దిశగా అడుగులు... తాజాగా రోడ్డెక్కనున్న బ్యాటరీ బస్సు... విశ్వనగరం దిశగా ముందడుగు కాగలదని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఢిల్లీ వంటి నగరాల్లో కాలుష్య కారక వాహనాలను అరికట్టేందుకు సహజ, ప్రత్యామ్నాయ పర్యావరణహిత ఇంధన వనరులను ప్రోత్సహిస్తున్నారు. అదే తరహాలో హైదరాబాద్‌లోనూ ప్రత్యామ్నాయ ఇంధనాల వినియో గాన్ని పెంచేందుకు బ్యాటరీ బస్సులు దోహదం చేయగలవని అంచనా వేస్తున్నారు. ఈ బస్సు నిర్వహణ ఖర్చు కొద్దిగా ఎక్కువే అయినా.. వాహన కాలుష్యాన్ని అరికట్టడం, ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సదుపాయాలు కల్పించడంలో ఎలాంటి లోటూ ఉండదని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తమ్ ‘సాక్షి’కి చెప్పారు. ఓల్వో తరహా సదుపాయాలు... ► పూర్తిగా ఓల్వో బస్సుల తరహాలోనే రూపొందించిన ఈ బ్యాటరీ బస్సులో మొత్తం 36 సీట్లుంటాయి. ► ఏసీ లో కుదుపులు లేని ప్రయాణం ► ట్రాఫిక్ తక్కువగా ఉండే మార్గాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. ► సుమారు రూ.2.56 కోట్ల ఖరీదైన ఈ బస్సును 6 గంటల పాటు చార్జింగ్ చేస్తే 8 గంటలు లేదా 250 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ► నగరంలో నడిచే ఆర్డినరీ బస్సుల అడుగు భాగం ఎత్తు 650 మిల్లీమీటర్లుండగా... బ్యాటరీ బస్సు 220 మిల్లీమీటర్ల ఎత్తులోనే ఉంటుంది. ప్రత్యామ్నాయ ఇంధన ప్రోత్సాహం నగరంలో ఆందోళన కలిగిస్తున్న వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించే దిశగా బ్యాటరీ బస్సుకు రవాణాపర మైన అనుమతులు ఇచ్చాము. ఈ బస్సును ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఏ మార్గం లోనైనా నడుపుకోవచ్చు. – కె.వెంకటరమణ,ప్రాంతీయ రవాణా అధికారి, సికింద్రాబాద్