ఆన్‌లైన్ బస్ బుకింగ్ ప్లాట్‌ఫాం అభిబస్ వ్యవస్థాపకులు ఏర్పాటు చేసిన ఫ్రెష్‌బస్ విస్తరణ కోసం రానున్న రోజుల్లో రూ.100 కోట్ల పెట్టుబడులు ఆకర్షించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ల నుంచి వచ్చే ఏడాది సిరీస్-ఏలో భాగంగా ఈ మొత్తాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
నవంబర్ 2022 నుంచి ఇప్పటి వరకు రూ.23.5 కోట్లను సేకరించిన స్టార్టప్ కంపెనీ సిరీస్-ఏ రౌండ్‌ని మార్చి 2024 వరకు ముగించాలని భావిస్తున్నట్లు ఫ్రెష్‌బస్ సీఈవో సుధాకర్ రెడ్డి తెలిపారు.
ఇంటర్‌సిటీ ఎలక్ట్రిక్‌బస్ కనెక్టివిటీని అందించే ఫ్రెష్‌బస్ సంస్థను 2022లో స్థాపించారు. టీవీఎస్ మోటార్ ఎండీ సుదర్శన్ వేణు, డార్విన్‌బాక్స్ వ్యవస్థాపకులు రోహిత్ చెన్నమనేని, జయంత్ పాలేటి, చైతన్య పెద్ది, ట్రావెల్ పోర్టల్ ఎక్సిగో, క్రెడ్ వ్యవస్థాపకులు కునాల్ షా, రివిగోకు చెందిన దీపక్ గార్గ్ ఈ కంపెనీలో ఇప్పటికే పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. మార్చి 2027 నాటికి దేశవ్యాప్తంగా 1000 బస్సులతో 100 నగరాలల్లో సేవలందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఈఓ చెప్పారు.
ఇదీ చదవండి: లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన అశ్నీర్ గ్రోవర్.. కారణం అదేనా..
Comments
Please login to add a commentAdd a comment