Bus charges
-
టికెట్ రేట్ల విషయంలో ప్రైవేట్ ట్రావేల్స్ నిలువు దోపిడీ చేశారు మామయ్య!
-
త్వరలో రూ.100 కోట్లు సమీకరణ.. ఎందుకో చెప్పిన సీఈఓ
ఆన్లైన్ బస్ బుకింగ్ ప్లాట్‌ఫాం అభిబస్ వ్యవస్థాపకులు ఏర్పాటు చేసిన ఫ్రెష్‌బస్ విస్తరణ కోసం రానున్న రోజుల్లో రూ.100 కోట్ల పెట్టుబడులు ఆకర్షించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ల నుంచి వచ్చే ఏడాది సిరీస్-ఏలో భాగంగా ఈ మొత్తాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 2022 నుంచి ఇప్పటి వరకు రూ.23.5 కోట్లను సేకరించిన స్టార్టప్ కంపెనీ సిరీస్-ఏ రౌండ్‌ని మార్చి 2024 వరకు ముగించాలని భావిస్తున్నట్లు ఫ్రెష్‌బస్ సీఈవో సుధాకర్ రెడ్డి తెలిపారు. ఇంటర్సిటీ ఎలక్ట్రిక్‌బస్ కనెక్టివిటీని అందించే ఫ్రెష్‌బస్ సంస్థను 2022లో స్థాపించారు. టీవీఎస్ మోటార్ ఎండీ సుదర్శన్ వేణు, డార్విన్‌బాక్స్ వ్యవస్థాపకులు రోహిత్ చెన్నమనేని, జయంత్ పాలేటి, చైతన్య పెద్ది, ట్రావెల్ పోర్టల్ ఎక్సిగో, క్రెడ్ వ్యవస్థాపకులు కునాల్ షా, రివిగోకు చెందిన దీపక్ గార్గ్ ఈ కంపెనీలో ఇప్పటికే పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. మార్చి 2027 నాటికి దేశవ్యాప్తంగా 1000 బస్సులతో 100 నగరాలల్లో సేవలందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఈఓ చెప్పారు. ఇదీ చదవండి: లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన అశ్నీర్ గ్రోవర్.. కారణం అదేనా.. -
గాంధీభవన్ గేట్‌కు తాళం!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ బస్‌భవన్ వద్ద నిరసన వ్యక్తం చేసేందు కు బయల్దేరిన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు ఏకంగా గాంధీభవన్‌కే తాళం వేశారు. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనపై గాంధీభవన్‌లో ఉన్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, ఇతర నాయకులు నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు తాళం తీశారు. దీంతో గాంధీభవన్ బయటకు వచ్చిన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అడ్డుకోవడంతో గాంధీభవన్ దగ్గరే మహిళా కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తంచేశారు. ఈ పరిణామంతో కొద్దిసేపు గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భారీగా ఆర్టీసీ చార్జీలను పెంచి ప్రజల నడ్డి విరిచిందని ధ్వజమెత్తారు. బస్సు చార్జీలతో పాటు బస్‌పాస్‌ల ధరలను కూడా రూ.200 నుంచి 300 శాతం పెంచిందని మండిపడ్డారు. తాజాగా మరోసారి ఆర్టీసీ చార్జీలు పెంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆమె హెచ్చరించారు. -
లీటర్ పెట్రోల్ రూ.338.. బస్సు ఛార్జీలు ఏకంగా 35 శాతం పెంపు..
కొలంబో: అన్నిరకాలుగా సంక్షోభం కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. లీటర్ పెట్రోల్ మంగళవారం ఏకంగా 84 రూపాయలు పెరిగి రూ.338కి చేరింది. పెట్రో ధరలు పెరగడం ఈ నెలలో ఇది రెండోసారి. బస్సు చార్జీలు కూడా ఏకంగా 35 శాతం పెరిగాయి. దీంతో జనం మండిపడుతున్నారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన కుటుంబీకులు తప్పుకోవాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ సెంట్రల్ లంకలోని రంబుక్కన వద్ద హైవేను, రైల్వే ట్రాక్‌ను దిగ్బంధించారు. వారిపై పోలీసుల కాల్పుల్లో ఒకరు మరణించారు. పలువురు గాయపడ్డారు. జనాగ్రహాన్ని, ఆక్రోశాన్ని అర్థం చేసుకోగలనని అధ్యక్షుడు గొటబయ రాజపక్స అన్నారు. దేశ దుస్థితికి తన తప్పిదాలూ కారణమేనని అంగీకరించారు. రసాయన ఎరువులపై నిషేధం దారుణంగా బెడిసికొట్టిందన్నారు. సంక్షోభ పరిష్కార చర్యల్లో భాగంగా అధ్యక్షుని అధికారాలకు కత్తెర వేసి, పార్లమెంటుకు మరిన్ని అధికారాలు కల్పించాలని ప్రధాని మహింద రాజపక్స ప్రతిపాదించారు. 41 మంది ఎంపీలు తాము పాలక సంకీర్ణానికి దూరమవుతున్నట్టు సభలోనే ప్రకటించారు. చదవండి: (దద్దరిల్లుతున్న డోన్బాస్) -
తెలంగాణ: ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పెట్టిన సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పడింది. చిల్లర సమస్యను గుర్తించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.. దీన్ని పరిష్కరించేందుకు రౌండప్ చార్జీలను ఖరారు చేశారు. గురువారం నుంచి ఈ కొత్త (రౌండప్) చార్జీలను అమలు చేయాలని ఆదేశించారు. రూ.12చార్జీ ఉన్న చోట టికెట్‌ను రూ. 10 రౌండప్ చేసి ప్రయాణికుల వద్ద వసూలు చేయనున్నారు. రూ.13, రూ.14 ఉన్న చోట.. ఆ టికెట్లను రూ. 15గా రౌండప్ చేయనున్నారు. అలాగే.. 80 కీలోమీటర్ల దూరానికి ఇప్పటి వరకు రూ.67 వసూలు చేస్తుండగా రౌండప్ ఖరారుతో చార్జీలు రూ.65 మాత్రమే వసూలు చేయనున్నారు. -
బస్సు చార్జీల పెంపుపై క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
నల్లగొండ రూరల్: డీజిల్ ధరలు 30 శాతం పెరగడంతో ఆర్టీసీ బస్సు చార్జీలు కూడా పెంచే ఆలోచన ఉందని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ చెప్పారు. ఈ విషయంపై సీఎం నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. శనివారం హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి డీలక్స్ బస్సులో నల్లగొండకు చేరుకున్నారు. ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించి ఉమ్మడి జిల్లాలోని డిపోల వారీగా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్‌లో పలు దుకాణాలను పరిశీలించారు. అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వ్యాపారస్తులను హెచ్చరించారు. పలువురు ప్రయాణికులతో మాట్లాడి బస్సు సౌకర్యం, బస్టాండ్‌లో ఉన్న వసతులపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపాలని పలువురు ప్రయాణికులు కోరగా.. ఆయా గ్రామాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్సు కోసం ట్విట్టర్లో పోస్టు చేస్తే స్పందిస్తానని, స్థానిక డిపో మేనేజర్లను కలసి బస్సు కోసం సంప్రదించొచ్చని సజ్జనార్ సూచించారు. రాష్ట్రంలో 49 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని, ప్రతినెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేయాలని, కష్టపడితేనే ఫలితం ఉంటుందని పిలుపునిచ్చారు. శుభకార్యాలకు, విహార యాత్రలకు, వన భోజనాలకు, రైతుల ధాన్యం తరలింపునకు ఆర్టీసీ, కార్గో సేవలను అందిస్తామని పేర్కొన్నారు. అందుకు అడ్వాన్స్ చెల్లించాల్సిన అవసరం కూడా లేదన్నారు. ప్రయాణికుల భద్రత కోసం రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. క్యాట్ కార్డు తరహాలో కొత్త పథకాలు అమలు చేసేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు ఆర్టీసీ ఆస్తులపై పోస్టర్లు అంటించరాదని, పోస్టర్లు అంటిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వరంగల్, హైదరాబాద్‌లో ఇప్పటికే పలు కేసులు నమోదు చేశామని తెలిపారు. నార్కట్‌పల్లిలో ప్రయాణికుల వస్తువులను చోరీ చేసిన ప్రైవేటు ట్రావెల్స్ ఘటన మీడియా ద్వారానే తెలిసిందని చెప్పారు. ప్రైవేటు వాహనాల్లో భద్రత ఉండదని, సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీని ఆదరించాలని కోరారు. సాధారణ ప్రయాణికుడిలాగే.. హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికుడిలాగే సజ్జనార్ నల్లగొండకు చేరుకున్నారు. నల్లగొండ బస్టాండ్, డిపోను పరిశీలించి అధికారులతో మాట్లాడిన అనంతరం బస్సులోనే మిర్యాలగూడకు వెళ్లారు. కలెక్టర్, ఎస్పీలు సజ్జనార్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. -
ప్రైవేట్ ట్రావెల్స్.. దసరా దందా..!
దసరా రద్దీని ప్రైవేట్ ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. టికెట్ ధరలు అమాంతం పెంచేశాయి. ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నాయి. సాధారణ ధరల కంటే అదనంగా ఒక్కో టికెట్‌పై రూ.400 వరకూ వసూలు చేస్తున్నాయి. దసరా సెలవులకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. రవాణా శాఖ అధికారుల ఆదేశాలను సైతం ట్రావెల్స్ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా మాటలకే పరిమితమయ్యారు. ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. చీరాల: విజయదశమి పండుగ సెలవులకు సొంతూళ్లకు వెళ్లేవారికి దోపిడీ తప్పడం లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ముక్కు పిండి అదనపు చార్జీలు వసూలు చేయడం ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. దసరా సందర్భంగా ఆర్టీసీతో పాటు రైల్వేలో కూడా రద్దీ నెలకొంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు టికెట్ ధరలు అమాంతం పెంచేశారు. అడిగేవాళ్లు లేకపోవడంతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 600కుపైగా సర్వీసులు... జిల్లా కేంద్రమైన ఒంగోలుతో పాటు చీరాల, మార్కాపురం, కందుకూరు, అద్దంకి, కనిగిరి ప్రాంతాల నుంచి హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బస్సులతో పాటు ప్రైవేటు బస్సులు నిత్యం 600కుపైగా రాకపోకలు సాగిస్తున్నాయి. పండుగ సీజన్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులు కూడా నడుపుతున్నాయి. అయితే, ప్రైవేటు ట్రావెల్స్‌లో చార్జీల మోత మోగుతుండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. పండుగ కాస్తా..దండగగా మారిందంటూ నిష్టూరుస్తున్నారు. దసరా ఉత్సవాలు, సెలవులతో పెరిగిన రద్దీ... కరోనా రెండు దశలను విజయవంతంగా ఎదుర్కొని ప్రజాజీవనం మరలా గాడిలో పడుతోంది. దూర ప్రాంతాల నుంచి రాకపోకలు పూర్తిస్థాయిలో నడుస్తున్నాయి. పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు జనం వెళ్లివస్తున్నారు. ఈ సమయంలో వచ్చిన దసరా పండుగకు ఉత్సవాలు జరుపుకునేందుకు ప్రభుత్వం కూడా అనుమతివ్వడంతో నవరాత్రులు నిర్వహిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. బుధవారం దుర్గాష్టమి నుంచి కార్యాలయాలకు కూడా సెలవులు కావడంతో స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు ప్రయాణమయ్యారు. దీంతో ఒక్కసారిగా రద్దీ ఏర్పడింది. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు కాసులు కురిపిస్తోంది. చదవండి: (దర్శి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత) రెట్టింపు ధరలతో బెంబేలు... కరోనా ఉధృతి తగ్గిన అనంతరం వచ్చిన పెద్ద పండుగ కావడంతో వృత్తిరీత్యా దూరప్రాంతాల్లో ఉంటున్న వారంతా సొంతూళ్లకు బయలుదేరారు. జిల్లాకు చెందిన ఎక్కువ మంది ఉద్యోగ, వ్యాపారాల రీత్యా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ప్రైవేటు బస్సుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేశారు. ఆర్టీసీ రెగ్యులర్ సర్వీసులను సాధారాణ చార్జీలతో నడుపుతుండగా, పండుగ అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు మాత్రం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక చార్జీలతో కొన్ని బస్సులు నడుపుతున్నారు. కానీ, ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారు. రోజువారీ సర్వీసుల టికెట్ ధరల కంటే రూ.300 నుంచి రూ.400 అదనంగా వసూలు చేస్తున్నారు. ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ చార్జీ రూ.440 ఉండగా, ప్రైవేటు బస్సుల్లో చార్జీలు ఏసీ రూ.1,300, నాన్ ఏసీ రూ.890 తీసుకుంటున్నారు. చీరాల నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సు చార్జీ రూ.425 ఉండగా, ప్రైవేటు బస్సు ఏసీ టికెట్ రూ.1,200, నాన్ ఏసీ బస్సు టికెట్‌కు రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. చీరాల నుంచి హైదరాబాద్‌కు 20కిపైగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నడుస్తున్నాయి. నిబంధనలకు చెల్లుచీటీ... ప్రైవేటు బస్సుల్లో అధిక ధరలకు టికెట్లు విక్రయించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ.. పండుగ సీజన్లలో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు తాపత్రయపడుతున్నాయి. కరోనా నియంత్రణ చర్యలు పాటిస్తున్నామని బహిరంగ ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. ఆ దాఖలాలు కనిపించడం లేదు. పండుగ సంగతి ఏలా ఉన్నా ట్రావెల్స్ బస్సుల టికెట్ ధరలతో ప్రయాణికుల జేబులకు మాత్రం చిల్లు తప్పేలా లేదు. 303 బస్సులను తనిఖీ చేశాం దసరా రద్దీ నేపథ్యంలో ప్రైవేటు బస్సులు అధిక చార్జీలు వసూలు చేయకుండా పర్యవేక్షిస్తున్నాం. గడిచిన నాలుగు రోజుల్లో జిల్లావ్యాప్తంగా 303 బస్సులను తనిఖీ చేశాం. టికెట్ ధరలు అధికంగా వసూలు చేస్తున్న దాఖలాలు లేవు. కానీ, ఇతర కారణాలతో 33 కేసులు నమోదు చేశాం. ట్రావెల్స్ బస్సుల నిర్వాహకులు అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తే టోల్ ఫ్రీ నంబర్ 91542 94502కు ప్రయాణికులు ఫిర్యాదు చేయాలి. అధిక ధరలు వసూలు చేసినట్లు నిర్ధారణ జరిగితే బస్సులు, యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. – భువనగిరి శ్రీకృష్ణవేణి, రవాణాశాఖ ఉప కమిషనర్, ఒంగోలు -
రద్దీనిబట్టి చార్జీలు!
సాక్షి, హైదరాబాద్: డిమాండ్ ఎక్కువగా ఉంటే ఎక్కువ చార్జీలు, రద్దీ లేకుంటే తక్కువ చార్జీలు.. ఇదీ ఫ్లెక్సీ ఫేర్ విధానం. విమాన టికెట్ ధరలు ఇలాగే ఖరారవుతూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఆర్టీసీలోనూ అమలు చేయనున్నారు. అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభమయ్యాక అన్ని దూరప్రాంత సర్వీసుల్లో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత కొన్ని ఇతర సర్వీసుల్లో కూడా అమలు చేసే అవకాశాన్ని పరిశీలించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బాటలోనే.. కొన్ని ప్రధాన ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ఫ్లెక్సీ ఫేర్ విధానాన్ని అమలు చేస్తుండటంతో వాటితో ఆర్టీసీ తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. డిమాండ్ అంతగా లేని సందర్భాల్లో ప్రయాణికులను ఆయా ట్రావెల్స్ తన్నుకుపోతుండటంతో ఆర్టీసీ నష్టపోతోంది. ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆర్టీసీ తీవ్రంగా యత్నిస్తోంది. ఫ్లెక్సీ ఫేర్ విధానాన్ని ప్రారంభిస్తే ఆదాయం పెరుగుతుందని అంచనాకొచ్చిన ఆర్టీసీ ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసుకుంది. ఆన్లైన్ బుకింగ్‌తో దీన్ని అనుసంధానించనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు తిరగటం లేదు. ఆయా రాష్ట్రాలతో అంతర్రాష్ట్ర సర్వీసుల ఒప్పందం చేసుకోగానే సర్వీసులు మొదలు కానున్నాయి. ఆ వెంటనే ఫ్లెక్సీ ఫేర్ విధానాన్ని అమలు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి తుది అనుమతి పొందాల్సి ఉంది. ప్రజలపై పెద్దగా భారం లేని విధానమే అయినందున దీనికి అనుమతి విషయంలో ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు. గంటగంటకూ ధరలు మారే అవకాశం దసరా, సంక్రాంతి, దీపావళి లాంటి ప్రధాన పండుగలతోపాటు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆర్టీసీ బస్సులకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ప్రత్యేక సర్వీసులు ప్రారంభించినా సీట్లు లభించనంత రద్దీ ఉంటుంది. ప్రైవేటు ట్రావెల్స్ కూడా వందల సంఖ్యలో తిరిగినా రద్దీ తగ్గదు. అలాంటి సందర్భాల్లో ఫ్లెక్సీ ఫేర్ విధానంలో టికెట్ ధరలు నిలకడగా ఉండవు. ప్రస్తుతం ఆర్టీసీ ముందుగా నిర్ధారించిన ధరలే స్థిరంగా అమలవుతున్నాయి. స్పెషల్ సర్వీస్ చార్జీగా 50 శాతం అదనంగా ధర పెంచడం తప్ప బేసిక్ టికెట్ ధర స్థిరంగానే ఉంటోంది. కానీ ఫ్లెక్సీ ఫేర్‌లో ప్రతి గంటకూ పరిస్థితిని అంచనా వేసి ధరలను సవరిస్తారు. అలాగే అన్ సీజన్లో, ఖాళీగా ఉండే సమయంలో బేసిక్ ధర కంటే తగ్గిస్తారు. గతంలో బెంగళూరు మార్గంలో నడిచే కొన్ని సర్వీసులకు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేశారు. ఇప్పుడు బెంగళూరు, షిరిడీ, ముంబై, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి డిమాండ్ ఎక్కువున్న అన్ని దూరప్రాంతాల్లో దాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. తొలుత గరుడ లాంటి ఏసీ సర్వీసులకు దీన్ని ప్రారం భించి ఆ తర్వాత సూపర్ లగ్జరీ బస్సుల్లోనూ అమలు చేయాలనుకుంటున్నారు. పేదలు ఎక్కువగా ప్రయాణించే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ మినహా ఆపై అన్ని కేటగిరీల్లో దశలవారీగా అమలు చేయాలని భావిస్తున్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. నిపుణుల సిఫార్సులు ఆర్టీసీ నష్టాలను అధిగమించడంతోపాటు ప్రైవేటు ట్రావెల్స్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొనేందుకు నిపుణులు గతంలో చేసిన సిఫారసుల్లో ఫ్లెక్సీ ఫేర్ విధానం కూడా ఉంది. దీన్ని అమలు చేయాలని చాలాసార్లు ప్రయత్నించారు. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో వెనకడుగు వేశారు. తీవ్ర నష్టాలు, కరోనా నేపథ్యంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులతో ఆర్టీసీ తీవ్ర గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ఇప్పుడు దాన్ని అమలు చేయాలని అధికారులు దాదాపుగా నిర్ణయానికి వచ్చారు. -
సాధారణ బస్సు చార్జీలకు మించి వసూలు చేయొద్దు
సాక్షి, రంగారెడ్డి: ప్రతి బస్సులో చార్జీల పట్టికను ప్రయాణికులకు కనిపించేలా ఏర్పాటు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ హరీష్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు, స్టేజీ క్యారియర్ తదితర బస్సులు ఈ నిబంధనను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సాధారణ చార్జీకి మించి ఒక్కపైసా కూడా అదనంగా వసూలు చేయవద్దని, తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను విధుల్లోకి తీసుకుని నడిపిస్తున్న బస్సుల్లో అన్ని రకాల రాయితీ బస్‌పాస్‌లను అనుమతించాలని సూచించారు. 80 శాతం బస్సులను తప్పనిసరిగా ప్రయాణికుల కోసం తిప్పాలన్నారు. ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన తీసుకున్న అన్ని బస్సులను రోడ్డెక్కించాల్సిందేనని స్పష్టం చేశారు. లేకుంటే కాంట్రాక్ట్‌ను రెన్యూవల్ చేయబోమని హెచ్చరించారు. పోలీస్ అధికారులు, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ల సహకారంతో బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజర్లను, ఆర్డీఓలను కోరారు. నైట్‌హాల్ట్ బస్సులను స్థానిక పోలీస్ స్టేషన్లలో నిలపాలని పేర్కొన్నారు. అర్ధంతరంగా బస్సులు మరమ్మతులకు గురైతే 100కు డయల్ చేయాలని సూచించారు. మద్యం మత్తులో విధులకు వచ్చే డ్రైవర్లను, కండక్టర్లను అనుమతించవద్దని పేర్కొన్నారు. రూ.6 కోట్ల మేర నష్టం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టడంతో బస్సులు రోడ్డెక్కకపోవడం వల్ల జిల్లాలో ఆర్టీసీకి బుధవారం నాటికి రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. సాధారణ రోజులతో పోల్చితే దసరా పండగ సీజన్లో ప్రయాణికులు అదనంగా 65 శాతం ప్రయాణిస్తారని పేర్కొంటున్నారు. ఈ లెక్కన గత రెండు రోజుల్లోనే సుమారు రూ.4 కోట్ల నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా బుధవారం సుమారు 911 బస్సులు, ప్రైవేటు వాహనాలను రోడ్లపై తిప్పినట్లు డిప్యూటీ ట్రాన్ప్‌పోర్ట్ కమిషనర్ ప్రవీణ్‌రావు తెలిపారు. ఇందులో ఆర్టీసీ 262, అద్దె బస్సులు 176, ప్రైవేటు కాంట్రాక్ట్ క్యారియర్ బస్సులు 78, ప్రైవేటు కంపెనీల బస్సులు 62, స్కూల్ బస్సులు 83, ప్రైవేట్ క్యాబ్‌లు 250 ఉన్నాయని వివరించారు. సమ్మె ఇంకా కొనసాగితే ఈ వాహనాల సంఖ్యను మరింత పెంచుతామని పేర్కొన్నారు. -
పండుగ 'స్పెషల్' దోపిడి
దసరాకు ఇంటికి వెళ్లేదెలా అని వివిధ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే విద్యాసంస్థలు కూడా సెలవులు ప్రకటించడంతో బస్టాండ్లన్నీ విద్యార్థులతో కిటకిటలాడుతున్నాయి. ఏ బస్సు చూసినా కాలుమోపలేని స్థితిలో కనిపిస్తున్నాయి. గడచిన మూడు రోజులుగా ఇదే పరిస్థితి. ఇదే అదనుగా బస్ చార్జీలు పెంచేయడంతో వీరంతా లబోదిబోమంటున్నారు. సొంతూర్లకు రావాలని పరితపిస్తున్న వారికి దోపిడీ కళ్లెదుటే కనిపిస్తోంది. నానా బాధలు పడి ఎలాగోలా ఊర్లకు రావాలని కదులుతున్నారు. భారీగా ఛార్జీల బాదుడుకు గురవుతున్నా సీటు లేక....బస్సుల్లో అదనపు కుర్చీలు వేసి ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మరోపక్క ప్రైవేటు ట్రావెల్స్ నిలుపుదోపిడీ చేస్తుండగా, ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రత్యేకం పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారు. సాక్షి కడప : దసరా సందర్భంగా ఇంటికి చేరుకునే వారికి బస్‌చార్జీలు మోతెక్కిస్తున్నాయి. డిమాండ్‌ను ఆసరా చేసుకుని ఆర్టీసీతోపాటు ప్రైవేట్ రవాణా సంస్థలు దోపిడీ చేస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడానికి పడుతున్న కష్టాలతోపాటు రిజర్వేషన్ల ఫలితంగా సీట్లు లభించని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఎక్కడ చూసినా సీటుకు డిమాండ్ ఏర్పడడంతో అడిగినంత ఇచ్చుకోవాలి్సన పరిస్థితి ఏర్పడింది. ఎక్కువ రోజులు సెలవులు కావడంతో.. జనాలంతా స్వగ్రామాలకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. చాలా మంది ప్రత్యేకంగా వాహనాలను బుక్ చేసుకుంటున్నారు. ప్రతిసారి పండుగ సమయంలో ఎదురవుతున్న పరిస్థితే ఈసారి కూడా ఎదురవుతోందని పలువురు ఆందోళన చెందుతున్నారు. రైళ్లలో దాదాపుగా ఇప్పటికే సీట్లన్నీ బుక్ అయిపోగా.. ఆర్టీసీలో పరిస్థితి గగనంగా మారుతోంది. డబ్బులు పెట్టినా టిక్కెట్లు కూడా దొరికే పరిస్థితి లేకుండా పోతోంది. స్పెషల్ బస్సుల్లో మాత్రమే సీట్లు లభిస్తున్నాయి. ఎలాగూ ప్రైవేటు బస్సుల్లో అయితే డిమాండ్ సృష్టించి మరీ డబ్బులు లాగేస్తున్నారు. సీట్లు అయిపోయాయని చెబుతూ....ప్రయాణికులను రెండు సీట్ల మధ్యలో సాధారణ కుర్చీ వేసి కూర్చోబెడుతున్నారు. సాధారణ బస్సులలో సీట్లు çఫుల్ కాగానే.. ప్రత్యేక సర్వీసులను కూడా నడపేందుకు ఆర్టీసి సన్నద్దమవుతోంది. గతనెల 28 నుంచి అక్టోబరు 13 వరకు అంటే దాదాపుగా 16రోజుల పాటు పిల్లలకు సెలవులు రావడంతో అందుకు అనుగుణంగా టిక్కెట్లు బుక్ చేయించుకున్నారు. ప్రైవేటు దోపిడీ జిల్లాలో ప్రైవేటు రవాణా దందా కొనసాగుతోంది. విజయవాడ, హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు లాంటి నగరాల నుంచి రావాలంటే పెద్ద ఎత్తున ప్రైవేటు బస్సుల ముసుగులో ప్రయాణీకులను దోచుకుంటున్నారు. హైదరాబాదులో టిక్కెట్ రూ.750 నుంచి ప్రస్తుతం రూ.1500 నుంచి రూ.2000 వరకు పెరిగిపోయింది. అంతకంతకు రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. బహిరంగంగానే ఆన్లైన్ సాక్షిగా దోపిడీ కొనసాగిస్తున్నారు.జిల్లా మీదుగా విశాఖపట్టణం, బెంగుళూరు, హైదరాబాద్, ముం బై, చెన్నై తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు రావడానికి అవసరమైన అన్ని వనరులను వెతుకుతున్నారు. బస్సులు మొదలుకొని రైళ్లు, విమానాలు, ప్రత్యేక వాహనాలు ఇలా ఎలా అవకాశం ఉంటే అలా రావడానికి ప్రయత్నిస్తున్నా ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే రైళ్లు, బస్సుల్లో సీట్లు రిజర్వు కావడంతో కష్టాలు పడుతున్నారు. బస్టాండ్లలో తప్పని తిప్పలు ఆర్టీసీ అధికారులు దూర ప్రాంత ప్రయాణీకుల కోసం ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా 150 సర్వీసులను వినియోగిస్తున్నారు. ప్రత్యేక సర్వీసుల పేరుతో విజయవాడ, తిరుపతి, బెంగుళూరు, చెన్నై, హైదరాబాదులకు నడుపుతున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా స్థానికంగా ఇబ్బందులు తప్పడం లేదు. ఎందుకంటే గంటల తరబడి నిరీక్షించినా బస్సులు రాక నరకయాతన అనుభవిస్తున్నారు. బస్సులు అక్కడికి వెళ్లడంతో స్థానికంగా ప్రయాణీకులకు తిప్పలు తప్పడం లేదు. -
ఓట్లకు రావాలంటే.. నోట్లు వదలాల్సిందే!
సాక్షి, చీరాల అర్బన్ (ప్రకాశం): ఓట్ల పండగ దగ్గరలోనే ఉంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సుదూరు ప్రాంతాల్లో ఉన్న వారు స్వగ్రామాలకు వచ్చేందుకు ఇప్పటి నుంచే ప్రయాణం కడుతున్నారు. అయితే ఊరికి వచ్చేందుకు హైదరాబాద్, చెన్నై వంటి ప్రాంతాల్లో ఉన్న వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల్లో సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. రైళ్లలో రిజర్వేషన్లు ఖాళీ లేవు. ప్రైవేటు ట్రావెల్స్‌కు వెళ్దామంటే ధర రెండింతలు పెంచేశారు. దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలని ఉన్నా రవాణా సౌకర్యం లేక ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ, ఉన్నత చదువులు, వ్యాపారం రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు ఓటు వేసేందుకు సొంత ఊరు వచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆర్టీసీ, రైళ్లలో సీట్లు ఫుల్ కావడంతో ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 11న ఉండటంతో 10వ తేదీ రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. ఇదే సరైన సమయంగా చూసుకుని ప్రైవేటు ఆపరేటర్లు 10, 14న టిక్కెట్ ధరలు అమాంతం పెంచేశారు. ఒక్క చీరాలకే 10 వేల మంది రాక సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు చీరాలకు చెందిన సుమారు 10 వేల మంది ఓటర్లు హైదరాబాద్, విజయవాడ, చెన్నై, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్నారు. వారిలో ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు సమాచారం. చీరాల, వేటపాలెం మండలాలకు చెందిన ఎక్కువ మంది ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ, విద్య, వ్యాపారం రీత్యా స్థిరపడిన వారు ఉన్నారు. ఓటు మాత్రం నియోజకవర్గంలో ఉండటంతో ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. 10వ తేదీ రాత్రి హైదరాబాద్ నుంచి చీరాలకు రోజు వారీ సర్వీసులతో పాటు అదనంగా మరో ఐదు సర్వీసులు నడుపుతున్నారు. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. 14వ తేదీన తిరుగు ప్రయాణంలోనూ ఇబ్బందులు పడకుండా ప్రస్తుతం రోజువారీ సర్వీసులతో పాటు మరో ఐదు బస్సులు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా బస్సులు నడుపుతామని డిపో మేనేజర్ కె.గంగాధరరావు తెలిపారు. ప్రయాణికులపై ప్రై‘వేటు’ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లుకు తిరుగు ప్రయాణం చుక్కలు చూపించనుంది. 10వ తేదీన వచ్చిన వారు 14వ తేదీకి తిరుగు ప్రయాణానికి టిక్కెట్లు రిజర్వేషన్లు చేయించుకునేందుకు వెళ్తే సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. ఎన్నికల సమయాన్ని అదనుగా చేసుకుని ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేటర్లు టిక్కెట్ ధరలు అమాంతం పెంచేశారు. ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడపనుంది. మామూలు రోజుల్లో చీరాల నుంచి హైదరాబాద్‌కు ఏసీ టిక్కెట్ రూ.560 వరకు ఉంటే ఎన్నికల సందర్భంగా ఆ టిక్కెట్‌ను అమాంతంగా రూ.1500లకు పెంచేశారు. మరికొన్ని ట్రావెల్స్ అయితే టిక్కెట్ రూ.2 వేల వరకు పెంచేశాయి. ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులకు టిక్కెట్లు ధరలు పెంచేసింది. వలస ఓటర్ల్లపై ప్రత్యేక దృష్టి చీరాల నియోజకవర్గంలో స్థానికులై ఉండి దూర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వారిపై రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక దృష్టిసారించాయి. స్థానిక ఓటర్లకన్నా ఎన్నికల్లో వలస ఓటరుదారులు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లే ఎక్కువగా ప్రభావితం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రసన్నం చేసుకుంటున్నాయి. మరికొందరైతే మీకు అన్ని ఏర్పాట్లు చేస్తామంటూ నాయకులు ఓటర్లుకు భరోసా ఇస్తున్నట్లు సమాచారం. ఎక్కువ మంది ఉంటే వాహన సౌకర్యం కూడా కల్పిస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం ఎన్నికల నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్ల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం. రోజువారీ సర్వీసులతో పాటు అదనంగా మరో ఐదు బస్సులను 10వ తేదీ, 14న తిప్పేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ప్రయాణికుల రద్దీని గమనించి ఇంకా ఎక్కువ బస్సులు తిప్పుతాం. ఓటర్లు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. - కె.గంగాధరరావు, మేనేజర్, చీరాల డిపో -
దొంగచాటు.. చార్జీల పోటు
సాక్షి, నెల్లూరు(క్రైమ్): చంద్రబాబు పాలన అంతా దోపిడీనే. ప్రజలపై భారాలను మోపనంటూనే పరోక్షంగా చార్జీల మోతను మోగించారు. సంక్షేమ పథకాలు, హామీల్లో మోసం చేసినట్లే ఆర్టీసీ చార్జీల విషయంలోనూ బాబు తన మోసపూరిత వైఖరిని చూపించారు. తాను అధికారంలోకి వస్తే ఆర్టీసీ చార్జీలు పెంచనంటూనే ఒక్కసారి పెంచారు. సేఫ్టీ, సౌకర్యాలు తదితరాల పేరిట అడ్డూ అదుపులేకుండా చార్జీల రేట్లు పెరిగిపోవడం ఇందుకు నిదర్శనం. డీజల్ ధరలు పెరిగినా ఆర్టీసీ చార్జీలు పెంచలేదని గతాన్ని మరిచిపోయి గొప్పులు చెప్పుకునే బాబు చాప కిందనీరులా ప్రయాణీకులపై దోపిడీ పర్వానికి తెరతీశారు. ఐదేళ్ల పాలనలో ఒక్కసారి ఆర్టీసీ చార్జీలను 10 శాతానికి పెంచారు. 2015 అక్టోబర్ 28న అధికార పూర్వకంగా ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. ఆ తర్వాత నేరుగా బస్సు చార్జీలను పెంచకుండా పరోక్ష రూపంలో వడ్డించడం ప్రారంభించారు. ఇందుకు ప్రయాణికుల సౌకర్యాల కల్పన అనే ముద్దు పేరుతో 2016లో టికెట్‌పై రూ.2 పెంచారు. అనంతరం 2017లో అమరావతి నుంచి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో భద్రత (సేఫ్టీ) సెస్ పేరిట ఒక్క రూపాయి, స్వచ్ఛభారత్ పేరుతో మరో రూపాయి వంతున ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇదిగాక గతంలో ఉన్న టోల్ చార్జీలను అదనంగా పెంచి వసూలు చేయడం ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యాల పేరుతో టికెట్‌పై రూ.2 వసూలు చేస్తున్నా కల్పిస్తున్న సౌకర్యాలు ఏమీ లేవు. గతంలో ఆర్డనరీలో ఒక టోల్ గేట్‌కు రూ.2, ఎక్స్‌ప్రెస్‌లో రూ.3 వసూలు చేసేవారు. ఈ టోల్ చార్జీలు అప్పటికి.. ఇప్పటికీ పెరగకపోయినా ఇప్పుడు రూ.10 వంతున టోల్ చార్జీ వసూలు చేస్తున్నారు. ఇక లాంగ్ సర్వీసుల్లో అయితే ప్రతి టోల్ గేటుకు రూ.6 వంతున వసూలు చేస్తున్నారు. జిల్లాలోని పది డిపోల్లో 4 అమరావతి బస్సులు, గరుడ, ఇంద్ర, 12 అల్ట్రా డీలక్స్‌లు, 102 సూపర్‌లగ్జరీ, 220 ఎక్స్‌ప్రెస్, 487 తెలుగు వెలుగు బస్సులు ఉన్నాయి. ఇవి రోజుకు 3.15 లక్షల కిలో మీటర్లు ప్రయాణిస్తున్నాయి. 4 లక్షల మంది వరకు ఆర్టీసీ బస్సుల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారని అంచనా. రోజుకు సగటున అదనపు చార్జీల రూపంలో రూ.96 లక్షల నుంచి రూ.కోటి వరకు సంస్థలో ఖాతాలోకి వెళుతున్నాయి. సౌకర్యాల కల్పన పేరిట సౌకర్యాల కల్పన పేరిట 2016లో టికెట్‌పై రూ. 2 పెంచారు. దీని ద్వారా జిల్లాలో సుమారు 8 లక్షలు అదనంగా ప్రజలపై భారం మోపారు. టికెట్ రేటు పెంచకుండానే ప్రయాణికులపై పడిన అదనపు భారంతో ప్రజలు బాబు మోసాన్ని గుర్తించడానికి చాలా కాలం పట్టింది. 2017 సెప్టెంబర్ నుంచి డీలక్స్ ఆపై కేటగిరీ బస్సు సర్వీసుల్లో సెస్ పేరిట ఒక్కో టికెట్‌పై రూపాయి వసూలు చేస్తోంది. అక్టోబర్ 15వ తేదీ నుంచి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో సైతం సెస్ వసూళ్లకు పాల్పడుతోది. జిల్లాలో సుమారు 3 లక్షల మంది ఎక్స్‌ప్రెస్, డీలక్స్ ఆపై కేటగిరీలో బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ బస్సుల్లో టికెట్ ధరతో పాటు భద్రత సెస్ పేరిట రూపాయి వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన 3 లక్షల ప్రయాణికుల వద నుంచి ఆర్టీసీ రోజుకు రూ.3 లక్షలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇంకోవైపు టోల్ చార్జీల పేరిట దోపిడీ కొనసాగుతూనే ఉంది. వీటితో పాటు పండగలు వచ్చినప్పుడు చార్జీలు ఏ రేంజ్లో పెరుగుతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకే సౌకర్యాలు కిలో మీటర్లతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ప్రయాణికుడి వద్ద నుంచి భద్రత సెస్ పేరిట రూపాయి వసూలు చేస్తున్నారు. అయితే ప్రయాణికుల భద్రతకు కనీస చర్యలు చేపట్టిన దాఖలాలు లేవనే చెప్పాలి. బస్సుల్లో కనీసం ప్రథమ చికిత్సకు సంబంధించిన కిట్లు కూడా అందుబాటులో ఉండటంలేదు. దీంతో బస్సుల్లో ప్రయాణికుల భద్రత ఏ పాటిదో ఇట్టే అవగతమవుతోంది. మొత్తం మీద ప్రయాణికుడే లక్ష్యంగా దోపిడీ చేస్తోంది. సవరణ పేరుతో బాదుడు ఒక వైపు ఆర్టీసీలో క్యాట్, వనిత, సీనియర్ సిటిజన్ వంటి రాయితీలకు మంగళం పాడిన సంస్థ, బస్సుల్లో చార్జీల çసవరణ పేరుతో ప్రయాణికులపై అదనపు భారం మోపింది. ప్రయాణికులు, కండక్టర్లకు చిల్లర సమస్యలు రాకుడదనే టికెట్ ధరల్లో సవరణలు చేశామని ప్రకటించినప్పటికీ ఆ పేరిట దోపిడీకి శ్రీకారం చుట్టారు. సవరించిన చార్జీలు ఎక్స్‌ప్రెస్, లగ్జరీ బస్సుల్లో తొలుత అమలులోకి తీసుకువచ్చి ఆపై దానిని తెలుగువెలుగు బస్సులకు సైతం వర్తించేలా చేశారు. వీటి ద్వారా వచ్చే మొత్తం యాజమాన్యం ఖాతాలోకి చేరుతోంది. తెలుగువెలుగు బస్సులో ఓ గ్రామానికి వెళ్లేందుకు గతంలో రూ.12 వసూలు చేయగా సవరణ అనంతరం రూ.15కు పెంచారు. ఈ లెక్కన జిల్లాలో ప్రయాణికులపై సవరణల పేరుతో అదనంగా రూ.20 నుంచి రూ.30 లక్షలు అదనపు భారం పడింది. ఆర్టీసీలో ప్రయాణికుల అవసరాలు, డిమాండ్లను బట్టి టికెట్ రేట్లు ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ ప్రజలను దోచుకోవడంలో బాబు ప్రభుత్వంలో జరిగినన్ని అక్రమాలు మరెప్పుడు జరగలేదని ప్రజలు వాపోతున్నారు. డబుల్ చార్జీలు పెరిగాయి టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు డబుల్ పెరిగాయి. గతంలో సంగం నుంచి నెల్లూరుకు రూ.25 ఉంటే.. ఇప్పుడు రూ.35 వసూలు చేస్తున్నారు. ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లాలంటే బస్సు సౌకర్యం సురక్షితమైందని, విధిలేని పరిస్థితుల్లో చార్జీలు పెరిగినా బస్సులోనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. – ఇండ్ల మణి, గాంధీజనసంఘం, సంగం మండలం టోల్ చార్జీల బాదుడు మరీ ఎక్కువ ఆర్టీసీ చార్జీల బాదుడు భరించలేని విధంగా ఉంది. ఆత్మకూరు నుంచి నెల్లూరుకు గతంలో అర్డనరీలో రూ.35 ఉంటే.. ఇప్పుడు టోల్ చార్జీ కింద రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారు. మాకు డీసీపల్లి, బుచ్చిరెడ్డిపాళెం టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేసిన తర్వాత బస్సు చార్జీలతో ప్రతి టోల్‌గేట్‌కు పది రూపాయల మేర పెంచేశారు. – రేవూరు పెంచల రెడ్డి, వెన్నవాడ, ఆత్మకూరు మండలం ఆర్టీసీ బస్సుల్లో దోపిడీ బస్ చార్జీలు ఇష్టానుసారంగా పెరిగిపోవడంతో ఆర్టీసీ బస్సుల్లో సామాన్య ప్రజలు ప్రయాణించలేని దుస్థితి ఏర్పడింది. దొరవారిసత్రం నుంచి సూళ్లూరుపేటకు రూ.25, నాయుపేటకు రూ.20 టికెట్ల ధరలు ఉన్నాయి. దగ్గరగా ఉన్న సూళ్లూరుపేటకు టికెట్ రూ.15 అయినా.. టోల్గేట్ చార్జీ రూ.10 వంతున పెరిగి భారం పడుతుంది. ఆర్టీసీ బస్సుల్లో కంటే ప్యాసింజర్ రైళ్లను నమ్ముకుని తిరుగుతున్నాము. – దేవళ్ల సుధాకర్, ఏకొల్లు, దొరవారిసత్రం మండలం బస్సు చార్జీలు భారం బస్సు చార్జీలు పెరిగిపోయాయి. బస్సు ఎక్కాలంటే భయమేస్తోంది. ఓజిలి నుంచి నాయుడుపేటకు గతంలో రూ.15 ఉంటే.. ఇప్పుడు రూ.20 చేశారు. గూడూరుకు అయితే గతంలో రూ.30 ఉంటే.. ఇప్పుడు రూ.45 అయింది. ఇక నెల్లూరుకు అయితే గతంలో రూ.50 ఉంటే.. మధ్యలో రెండు టోల్గేట్ల చార్జీలతో కలుపుకుని రూ.75 వసూలు చేస్తున్నారు. – శ్రీనివాసులు ఓజిలి టికెట్ దోపిడీ తీరు చూద్దాం.. కావలి నుంచి నెల్లూరు ఆర్డనరీ టికెట్ ధర : రూ.35 టోల్ చార్జీ : రూ.10 ఎక్స్‌ప్రెస్ టికెట్ ధర : రూ.46 టోల్ చార్జీ : రూ.10 సెస్ చార్జీలు అన్నీ : రూ.4 -
ఒక్కసారిగా 67 శాతం ఛార్జీలు పెరిగాయి
సాక్షి, చెన్నై : దాదాపు ఆరేళ్ల తర్వాత తమిళనాడులో బస్సు ఛార్జీలు పెరిగాయి. ఊహించని రీతిలో 67 శాతం పెంచి రవాణా శాఖ పెద్ద షాకే ఇచ్చింది. కాగా, శనివారం నుంచే పెంచిన ధరలు అమలులోకి వచ్చాయి. ఇక పెరిగిన ధరలను ఓసారి పరిశీలిస్తే... చెన్నై నగర పరిధిలోని మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పరిధిలో టికెట్ కనిష్ఠ ధరను 5 రూపాయలుగా నిర్ణయించింది. ఇంతకు ముందు అది 3 రూపాయలుగా ఉండేది. గరిష్ఠ ధరను 14-23 రూపాయలుగా సవరించింది. నాన్-మెట్రో ఛార్జీల విషయంలో 3రూ. నుంచి 5. రూలకు పెంచి.. గరిష్ఠ ధరను 12 నుంచి 19 రూపాయలకు సవరిచింది. గ్రామీణ సర్వీసులు, ఆర్టీనరీ సర్వీసులపై మినమిమ్ టికెట్ ధరను ఒక రూపాయి పెంచి 6 రూ. గా నిర్ణయించింది. ఎక్స్ ప్రెస్ బస్సుల మినిమమ్ టికెట్ ధరను 17 నుంచి 24 రూ. లకు పెంచేసింది. నాన్-స్టాప్ డీలక్స్ బస్సులపై 18 నుంచి 27 రూ., అల్ట్రా డీలక్స్ బస్సుల ధరను 21 నుంచి 33 రూపాయలకు పెంచేసింది. ఏసీ బస్సు, వోల్వెల సర్వీసులపై ఈ బాదుడు అదే స్థాయిలో కనిపిస్తోంది. ఏసీ బస్సులపై 27 రూపాయల నుంచి 42 రూపాయలకు.. వోల్వో సర్వీసులపై 33 నుంచి 51 రూపాయలకు పెంచేసింది. కొండ ప్రాంత సర్వీసులపై కూడా రేట్లు పెరిగిపోయాయి. ఆర్డీనరీ బస్సుపై మూడు రూపాయలు పెంచి 7రూ.20పై. గా నిర్దారించింది. ఎక్స్‌ప్రెస్ బస్సులపై 12 రూపాయలు పెంచి 32 రూపాయలు చేసింది. గతంలో ఇది 20రూ. గా ఉండేది. దీనికితోడు టోల్ ఛార్జీలు, యాక్సిడెంట్ సెటిల్ మెంట్ క్లెయిమ్స్ కోసం ప్రయాణికులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రమాదాల్లో గాయపడినా, ప్రాణాలు కోల్పోయినా.. బాధితులకు చెల్లించే ఇన్సూరెన్స్ విధానాల్లో కూడా ప్రభుత్వం గణనీయమైన మార్పులు చేసింది. చివరిసారిగా 2011లో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఛార్జీలు పెంచారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే... కాగా, ఛార్జీల పెంపుపై తమిళనాడు రవాణా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రవాణా వ్యవస్థ ఇప్పటికే నష్టాల్లో ఉండగా.. జీతాలు పెంచాలని రవాణ సంస్థ ఉద్యోగులు చేసిన సమ్మెతో అవి భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను అనుసరించి ధరలను పెంచాల్సి వచ్చింది’’ అని తమిళనాడు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే ఈ పెంపు చాలా తక్కువేనని, ఈ రాష్ట్రాలు మూడేళ్లు ముందే బస్సు ఛార్జీలను గణనీయంగా పెంచాయని రవాణా శాఖ వివరించింది. రాష్ట్రంలో 8 ప్రభుత్వ రవాణా సంస్థలు, ప్రైవేటు రవాణా సంస్థలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, తప్పని పరిస్థితుల్లోనే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని రవాణా శాఖ వివరణ ఇచ్చుకుంది. -
చిల్లర సమస్యకు చెక్
హన్మకొండ: బస్సుల్లో చిల్లర సమస్యకు ఆర్టీసీ పరిష్కారం చూపింది. ఈ మేరకు చార్జీలను సర్దుబాటు చేసింది. దీంతో కొన్ని స్టేజీలకు స్వ ల్పంగా చార్జీలు పెరుగగా, మరికొన్ని స్టేజీలకు చార్జీలు తగ్గాయి. చిల్లర ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది మధ్యన ఘర్షణలకు దారితీస్తోంది. ఈ క్రమంలో ఆర్టీసీ యాజ మాన్యం చిల్లర సమస్యలను పరిష్కరించాలని తీసుకున్న నిర్ణయం మేరకు చార్జీల్లో మార్పులు చేశాయి. వరంగల్ మహానగరంలోని వరంగల్, హన్మకొండ, కాజీపేట మధ్యన ఆర్టీసీ లోకల్ బస్సులు సేవలు అందిస్తున్నాయి. సిటీ ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సులు నగర ప్రయాణికులకు రవాణా సేవలు అందిస్తున్నాయి. చిల్లర సమస్య తొలగించేందుకు ఈ బస్సుల చార్జీలు సర్దుబాటు చేశారు. సర్దుబాటు చేసిన చార్జీలు ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ తోట సూర్యకిరణ్ తెలిపారు. -
ఫ్లయిట్ ఛార్జీలను మించి బస్సు ఛార్జీలు
హైదరాబాద్: జనాల కంటే సంక్రాంతి పండుగ సీజన్ వచ్చిందంటే ప్రైవేటు ట్రావెల్స్‌కు నిజమైన పండుగే. ఏటా ఈ సీజన్లో ప్రయివేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు టిక్కెట్ రేట్లను 50శాతానికి పైగా పెంచేసి కాసుల వర్షం కురిపించుకుంటున్నారు. సంక్రాంతి పేరుతో ప్రయాణీకులను అడ్డంగా దోచేస్తున్నారు. పండుగ పూట అయినవారితో గడుపుదామని పల్లె బాట పట్టిన జనాల జేబులు గుల్ల చేస్తున్నారు. విమాన ధరలకు ఏమాత్రం తీసిపోనట్లుగా బస్సు ఛార్జీలను అమాంతం పెంచేయడంతో ప్రయాణికులపై భారం పడుతోంది. అటు ఆర్టీసీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్‌కు ఏమాత్రం తీసిపోవడం లేదు. ప్రభుత్వం కళ్లుమూసుకుని కూర్చోవడంతో ప్రయాణీకులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. దిక్కులేని పరిస్థితుల్లో అధిక ధరలకు టికెట్లు కొనాల్సి వస్తోంది. హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్లాలంటే 3 వేల రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు. వైజాగ్ వెళ్లాలంటే కూడా అంతే చెల్లించాల్సి వస్తోంది. ఇక రాజమండ్రికి 2వేలు, భీమవరానికి 1600, ఏలూరుకు 2వేలు వసూలు చేస్తున్నారు. పండగ వేళ ప్రయివేట్ ఆపరేటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన ఏపీ సర్కారు చోద్యం చూస్తోంది. బస్సు ఛార్జీలు రెట్టింపు అయినప్పటికీ నియంత్రణపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కనీసం ఇప్పటివరకు అధికారులతో సమావేశం కూడా నిర్వహించలేదు. బస్సుల తనిఖీలకు దిగిన పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో ఎటువంటి దారిలేక.. దిక్కుతోచక ప్రయాణికులు అధిక ధరలు చెల్లిస్తున్నారు. ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి... హైదరాబాద్ నుంచి విజయనగరం ఛార్జీ రూ.3వేలు. నాన్ ఏసీ బస్సుకు రూ.1300 హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాలంటే గరిష్టంగా రూ.3వేలు. నాన్ ఏసీ బస్సుకు రూ. 1700 హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రూ.2వేలు హైదరాబాద్ నుంచి భీమవరానికి ఛార్జీ రూ.1600 హైదరాబాద్ నుంచి ఏలూరుకు ఛార్జీ రూ.2వేలు హైదరాబాద్ నుంచి అమలాపురం ఛార్జీ రూ.వేలు -
విమాన ధరలని మించి బస్సు ఛార్జీలు
-
బస్ చార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ నిరసనలు
-
బస్ చార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ నిరసనలు
గుంటూరు: ఆర్టీసీ బస్ చార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా: మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శన చేపట్టింది. సోమవారం ఉదయం మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆయన కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు కార్యకర్తలు, నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ఈ మేరకు బస్టాండ్‌లో డీఎం వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. పొన్నూరులో రావి వెంకట రమణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విజయనగరం: బస్సు చార్జీల పెంపుపై విజయనగరం జిల్లా వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జి ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్లో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. చార్జీల పెంపుతో బస్సు ప్రయాణం ఎంత భారమవుతోందో ప్రయాణికులకు వివరించారు. అనంతరం డీఎం బీవీఎస్ నాయుడుకు వినతిపత్రం అందజేశారు. బొబ్బిలిలో వైఎస్సార్ సీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రౌతు రామమూర్తి నాయుడు ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో ధర్నా, రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. చీపురుపల్లిలో వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు గల్లాన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. శ్రీకాకుళం: పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళనలు నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట రెడ్డిశాంతి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. టెక్కలిలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. మాజీ ఎమ్మెల్యే జగన్నాయకులు ఆధ్వర్యంలో పలాసలో నిర్వహించిన ధర్నాలో భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా: ఉయ్యూరు ఆర్టీసీ డిపో ఎదుట జరిగిన వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు దేవభక్తుని సుబ్బారావు, రావులపాటి రామచంద్రరావు, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగవీటి శ్రీనివాసప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు డీఎంకు వినతి పత్రం అందజేశారు. అవనిగడ్డ ఆర్టీసీ డిపోలో వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అలాగే, నందిగామ, తిరువూరులోని బస్టాండ్ల వద్ద ధర్నా జరిగింది. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా: మార్కాపురంలో ఎమ్మెల్యే జంకె వెంకట్‌రెడ్డి నేతృత్వంలో స్థానిక బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టారు. దర్శి నియోజకవర్గ కేంద్రంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చిత్తూరు జిల్లా: మదనపల్లిలోని బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. డీఎంకు వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్ జిల్లా: కేంద్రం కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎమ్మెల్యే అంజాద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు రాస్తారోకో చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా: మండపేటలో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పట్టాభిరామయ్య చౌదరి ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద ధర్నా జరిగింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా: గూడూరులో ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. -
చార్జీలు తగ్గించకపోతే 26న డిపోల ముందు ధర్నా
-
ఏపీలో ఎంత పెంచితే అంత పెంచుదాం!
-
బస్సు చార్జీలు పెంచేందుకు కుట్ర: జీవన్ రెడ్డి
కరీంనగర్ (జగిత్యాల): తెలంగాణ ప్రభుత్వం బస్‌చార్జీలు పెంచి సామాన్యులపై భారం మోపేందుకు కుట్రపన్నుతోందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం అభినందనీయమైనప్పటికీ సమ్మెకు దిగకముందు ఇస్తే బాగుండేదన్నారు. బస్‌చార్జీలు పెంచే కుట్రలో భాగంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసే వరకు ప్రభుత్వం వేచి చూసిందని, ఫలితంగా ఆర్టీసీకి రూ.100 కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. దీనికి ఆర్టీసీ కార్మికులను దోషులుగా చూపిస్తూ బస్‌చార్జీలు పెంచే ప్రయత్నం మొదలు పెట్టిందని విమర్శించారు. డీజిల్ ధర ప్రస్తుతం రూ.10 వరకు తగ్గిందని, వ్యాట్, ల్యుబ్రికేషన్ భారం తగ్గించి జనరల్ సేల్స్ టాక్స్‌కు ఎత్తివేస్తే ప్రజలపై భారం మోపాల్సిన అవసరం ఉండదని సూచించారు. ఇటీవల అవసరం లేనప్పటికీ 200 ఏసీ బస్సులను కొనుగోలు చేశారని, వీటిని నడిపేందుకు డ్రైవర్లు సైతం లేరన్నారు.. ప్రభుత్వ విధానాలు, ఉన్నత స్థారుులో అవినీతి, అక్రమాలకే ఆర్టీసీ నష్టాలకు కారణమని తెలిపారు. ప్రస్తుతం పెంచిన ఫిట్మెంట్ తాత్కాలికమేనని, ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు ఇచ్చినప్పుడే ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 108 సర్వీసుల నిర్వహణను ఆంధ్ర పెట్టుబడిదారు అయిన జీవీకేతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయూలని, ఆ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి ప్రజలకు మెరుగైన సేవలందించేలా 108 సర్వీసులను తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. -
పండుగ బాదుడు
పండుగ దోపిడీ ప్రారంభమైంది. ప్రత్యేక బస్సుల పేరుతో ఆర్టీసీ బస్సు టికెట్టు 50 శాతం అదనమంటుంటే ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు మాత్రం హద్దే లేకుండా రైట్, రైట్ అంటున్నారు. ఇటీవల రాష్ట్ర రవాణాశాఖా మంత్రి శిద్దా రాఘవరావు మాత్రం ఆర్టీసీలో ప్రత్యేక బస్సుల పేరుతో అదనపు చార్జీలు వసూలు చేసేది లేదని ప్రకటించారు. కానీ వారం రోజుల నుంచి ప్రత్యేక బస్సుల టికెట్లు బుకింగ్ అవుతుండడంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మూడు వేల మందికిపైగా ప్రయాణికులపై అదనపు భారం పడింది. వీరివద్ద నుంచి ఆర్టీసీ అదనంగా వసూలు చేసిన మొత్తం రూ.5 లక్షలపైమాటే. రూ.4,95,140 వసూలు చేసినట్లయింది. ఈ నెల 6, 7 తేదీలలో మరింత మంది ప్రయాణికుల నుంచి ఆర్టీసీ 50 శాతం అదనపు మొత్తాన్ని వసూలు చేసింది. ఈ ఏడాది మొత్తం 260 ప్రత్యేక సర్వీసులను నడపాలనుకుంటున్న దృష్ట్యా రూ.20.31 లక్షల భారం ప్రయాణికులు భరించాల్సి వస్తుందన్నమాట. ఈ లెక్క కేవలం ఒంగోలు డిపోకు పరిమితం. మిగిలిన డిపోలు కలుపుకుంటే కోటి రూపాయలు దాటిపోతుంది. సంక్రాంతికి ముందు హైదరాబాదు నుంచి జిల్లాకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. నెల్లూరు జిల్లా నుంచి వచ్చే బస్సులలో కూడా టిక్కెట్లను బుక్ చేసుకుంటుంటారు. ఓ వైపు అదనపు చార్జీలు వసూళ్లు చేసి రిజర్వేషన్ల ప్రాతిపదికన టికెట్లు అమ్మేస్తుంటే అదనపు వసూళ్లు ఉండవంటూ మంత్రి చెబుతున్న సాంత్వన పలుకులు ఏరకంగా ఆచరణకు వచ్చి ప్రయాణికులకు ఊరటనిస్తాయో అర్థం కావడం లేదు. ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకున్నవారికి ఎలా డబ్బులు తిరిగి చెల్లిస్తారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు దోపిడీ ఇలా... ప్రైవేటు బస్సుల్లో దోపిడీ భయంకరంగా మారింది. దాదాపు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేటు బస్సుల్లో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 100కుపైగా బస్సులు నిండిపోయాయి. ఒక్కో బస్సులో కనీసంగా 30 సీట్లున్నాయనుకుంటే ప్రయాణికుల సంఖ్య 3 వేలు. ఆర్టీసీ సూపర్ లగ్జరీ రేటు రూ.390లుంటే ప్రైవేటు వ్యాపారులు మాత్రం దాదాపు రూ.700 నుంచి టిక్కెట్లు బుక్ చేస్తున్నారు. అంటే కనీసంగా టిక్కెట్‌కు రూ.300 అదనంగా పిండేస్తున్నారు. ఈ లెక్కన మూడువేల టిక్కెట్లకు అదనంగా వసూలైన మొత్తం రూ.9 లక్షలు. అక్కడితో ఆగకుండా వీరి దందా డిమాండ్‌ను బట్టి రెట్టింపయ్యే అవకాశం ఉంది. బెంగళూరు వైపు వెళ్లే బస్సులకు ఈ నెల 13, 18 తేదీలలో టిక్కెట్ ధర రూ.2 వేల నుంచి రూ. 2,500 వరకు పలుకుతున్నట్లు సమాచారం. ఆర్టీసీ, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లిద్దరూ కలిసి సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రయాణికుల మీద వేస్తున్న అదనపు భారం రూ.56.10 లక్షలపైనే ఉండనుంది. గత ఏడాది ప్రైవేటు ఆపరేటర్లపై రవాణాశాఖ అధికారులు ఉక్కుపాదం మోపడంతో ఆర్టీసీ కొంతమేరకు లబ్ధిపొందింది. కానీ ప్రస్తుతం ప్రైవేటు ఆపరేటర్లపట్ల ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తుండడంతో ఆర్టీసీకి నష్టాలే మిగలనున్నాయి. -
బస్సు ఛార్జీలు తగ్గించిన ప్రభుత్వం
ప్రయాణికులకు ఓ శుభవార్త. బస్సు ఛార్జీలను మరింత తగ్గిస్తున్నట్టు ఒడిషా ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. గత కొన్నిరోజుల క్రితమే ఆయిల్ కంపెనీలు డిజీల్ రేట్లను తగ్గించడంతో బస్సు ఛార్జీలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రమేష్ మజోహి తెలిపారు. ఈ కొత్త ఛార్జీలు బుధవారం నుంచే అమలులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులకు కిలోమీటర్‌కు ఒక పైసా చొప్పున టికెట్ ధర తగ్గించినట్టు చెప్పారు. అధేవిధంగా డీలక్స్, ఏసీ డీలక్స్ బస్సులలో రెండు పైసల చొప్పున ధర తగ్గించినట్టు మజోహి తెలిపారు. గత నెల 31న డీజిల్ ధర రూ. 2.25 లకు పడిపోయింది. అదే నెలలో డీజిల్ ధర తగ్గడం ఇది రెండోసారి. దాంతో ఒడిషా ప్రభుత్వం బస్సు ఛార్జీలు తగ్గించాలని నిర్ణయించింది. ఇక పై ప్రయాణికులు ఆర్డినరీ బస్సులలో ప్రయాణించాలంటే కిలోమీటర్‌కు 62 పైసలు చొప్పున చెల్లించాలి. ఎక్స్‌ప్రెస్ బస్సులకు ఒక కిలోమీటరుకు 85 పైసలు చొప్పున ఛార్జ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ డీలక్స్ బస్సులలో 85 పైసలు చొప్పున ఛార్జ్ చేస్తే ఏసీ డీలక్స్ బస్సులలో ప్రయాణించాలంటే ప్రయాణికులు కిలోమీటర్‌కు రూ. 1.04 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. -
పెరగనున్న ఆర్టీసి బస్ ఛార్జీలు
హైదరాబాద్: మరోసారి ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఛార్జీల పెంపును పరిశీలిస్తున్నట్లు ఏపి రోడ్లు, రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదిస్తే ఛార్జీలు పెంచుతామన్నారు. ఏడాది కిందట ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. డీజిల్ రేట్లు 7 సార్లు పెరగడంతో ఛార్జీలు పెంచకతప్పదన్నారు. ఏపిఎస్ఆర్టిసికి 250 కోట్ల రూపాయలు జమచేస్తామని చెప్పారు. ఉద్యోగులకు దసరా అడ్వాన్స్ ఇస్తున్నామన్నారు. నవంబర్‌లో డిఏపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి రాఘవరావు చెప్పారు. ** -
వడ్డనకు రెడీ
సాక్షి, చెన్నై:రాష్ట్రంలో బస్సు చార్జీల వడ్దన కు ప్రభుత్వం సిద్ధమవుతోంది. డీజిల్ ధర పెంపు, ఇతర ఖర్చుల్ని సాకుగా చూపుతూ చార్జీల పెంపు అవశ్యాన్ని ప్రజలకు వివరించేందుకు రవాణాశాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ మేర కు చెన్నైలో బుధవారం నిర్వహించిన అధికారుల సమీక్షలో చార్జీల పెంపుపై తుది నిర్ణయం తీసుకున్నారు. త్వరలో చార్జీల చిట్టాను ప్రకటించనున్నారు. ఎనిమిది డివిజన్లు, 21 మండలాలతో రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ రూపుదిద్దుకుంది. దీని పరిధిలో 20,654 బస్సులు నడుస్తున్నాయి. రోజుకు సుమారు 2.1 కోట్ల మంది ప్రయూణిస్తున్నారు. రాష్ట్ర రాజధాని చెన్నైలోనే రోజుకు 55 లక్షల మంది బస్సు సేవల్ని వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు రూ.20 కోట్ల ఆదాయం వస్తోంది. ఆ సంస్థ ఏళ్ల తరబడి నష్టాల్లోనే నడుస్తోంది. డీఎంకే హయూంలో చార్జీల పెంపుపై దృష్టి పెట్టకపోవడంతో సంస్థ దివాల తీసే స్థాయికి చేరింది. అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చాక ఈ సంస్థను బలోపేతం చేస్తూ చర్యలు తీసుకుంది. 2012లో చార్జీల్ని పెంచడంతోపాటు సంస్థను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని కేటాయించింది. ఏడాదికి వెయ్యి కొత్త బస్సుల కొనుగోలుకు చర్యలు తీసుకుంది. ఆ తర్వాత చార్జీల పెంపు మీద దృష్టి పెట్టలేదు. రూ.5 వేల కోట్ల మేరకు నష్టం ప్రభుత్వం సహకారం అందిస్తున్నా రాష్ట్ర రవాణా సంస్థ గత ఏడాది రూ.5 వేల కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. పెరుగుతున్న డీజిల్ ధరలు, ఇతర ఖర్చులు. సిబ్బంది వేతనాలు, పరిపాలనా పరమైన ఖర్చులు వెరసి నష్టాన్ని మరింత పెంచాయి. 2012లో లీటర్ డీజిల్ ధర రూ.46.50 ఉండగా రెండేళ్ల వ్యవధిలో డీజిల్ ధర రూ.15.14 మేరకు పెరిగింది. రవాణా సంస్థ బస్సులు రోజుకు కోటీ 589 కిమీ మేరకు ప్రయాణం సాగిస్తున్నాయి. ఈ బస్సులు లీటరుకు ఆరు కిమీల దూరం పయనించాల్సి ఉంది. 4.8 కిమీలు మాత్రమే న డిపే పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా రెండేళ్లలో డీజిల్ భారం ఆ సంస్థ నెత్తిన గుదిబండగా మారింది. ఏడాదికి సుమారు రూ.840 కోట్ల నుంచి 1000 కోట్ల మేరకు డీజిల్ ధరల పెంపు రూపంలో అదనపు భారం పడుతోంది. అలాగే ప్రభుత్వ సాయం సకాలంలో అందక పోవడం వల్ల అనేక డివిజన్లు, మండలాల్లో సిబ్బంది వేతన చెల్లింపు మరింత భారంగా మారింది. నెలనెలా డీజిల్ ధర పెంపు, బస్సుల మరమ్మతులు, ఇతర ఖర్చులు నానాటికీ పెరుగుతుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో చార్జీల వడ్డనకు రవాణా సంస్థ సిద్ధమైంది. రెండేళ్లుగా ఎదుర్కొంటున్న నష్టాల్ని ఎత్తి చూపడంతోపాటు తాము అందిస్తున్న విశిష్ట సేవల్ని వివరిస్తూ చార్జీల పెంపు అవశ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రవాణా సంస్థ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇటీవల ఆంధ్ర, కర్ణాటక, కేరళ, రాష్ట్రాల్లో పెరిగిన చార్జీల్ని పరిశీలిస్తూ రాష్ట్రంలోనూ ఏ మేరకు చార్జీల్ని పెంచాలన్న అంశంపై డివిజన్, మండల అధికారులతో రవాణా శాఖ ఉన్నతాధికారులు సమాలోచనలో చేశారు. బుధవారం చెన్నై వేదికగా జరిగిన ఈ సమీక్షలో బస్సు చార్జీల్ని పెంచక తప్పదన్న తుది నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏ మేరకు చార్జీల్ని పెంచాలనే విషయంపై చర్చించి నివేదికను సిద్ధం చేయడానికి చర్యలు చేపట్టారు. ఈ నివేదికను రాష్ర్ట ప్రభుత్వానికి పంపించి చార్జీల వడ్డనకు రెడీ అయ్యారు. సీఎం జయలలిత ఆమోదం తెలిపిన మరుక్షణం కొత్త చార్జీల చిట్టా వెలువడే అవకాశాలున్నాయి. ఇప్పటికే రైల్వే చార్జీల వడ్డన, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, చక్కెర ధరకు రెక్కలు వెరసి ప్రజల నడ్డి విరుస్తున్న తరుణంలో బస్సు చార్జీల మోత రాష్ట్ర ప్రజల జీవితాల్ని ఏ మేరకు పిప్పి చేయబోతున్నాయో వేచి చూడాల్సిందే. -
రాష్ట్ర ప్రజలపై రోజుకు రూ.40 కోట్లు
-
రోజుకు రూ.40 కోట్లు!
వైఎస్ హయూం తర్వాత ప్రభుత్వాలు ప్రజలపై మోపిన భారం సాక్షి, హైదరాబాద్: గత నాలుగేళ్లలో పన్ను పోట్లు, చార్జీల వాతలతో ప్రజలపై మోయలేని భారం మోపిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్నికల సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో ఇదిగో సంక్షేమం, అదిగో పథకం అంటూ హడావుడి చేస్తోంది. కోటి ఆశలతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం ముగిసిన తర్వాత.. సంక్షేవు పథకాలకు కోత పెట్టడం, వీలైనంతగా కొత్త పన్నులతో బాదడానికే ప్రభుత్వాలు పరిమితమయ్యూరుు. గత నాలుగేళ్లను ఒక్కసారి పరికించి చూస్తే.. కఠోర వాస్తవాలు కళ్లముందు గిర్రున తిరుగుతాయి. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్... ఇలా ఎన్నో సంక్షేమ పథకాల నిధుల్లో కోత పెట్టి వాటిని కొరగాకుండా చేసిన ప్రభుత్వం ఖజానా నింపుకోవటమే పనిగా పెట్టుకుంది. గత 50 నెలల కాలంలో ఈ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలపై ఎంత భారం మోపాయో లెక్కతీయుటానికి ‘సాక్షి’ ప్రయుత్నించినప్పుడు కళ్లు తిరిగే లెక్కలు తేలాయి. వ్యాట్, కరెంటు బిల్లులు, బస్సు చార్జీలు, వాహన పన్నులు, స్టాంపులు..రిజిస్ట్రేషన్లు తదితరాల రూపంలో ఏకంగా సుమారు రూ.60 వేల కోట్ల భారాన్ని ప్రజల నెత్తిన మోపింది. అంటే సగటున ప్రతినెలా రూ. 1,200 కోట్లు, రోజుకు రూ. 40 కోట్ల పెను భారం మోపింది. కరెంటు చార్జీలతో గుండెకోత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో కరెంటు బిల్లు ఒక్క రూపాయి కూడా పెరగలేదు. భవిష్యత్తులోనూ చార్జీలు పెంచేది లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. పైగా పేద రైతులపై కరెంటు భారం ఉండదన్న ఉద్దేశంతో ‘ఉచిత కరెంటు’ పథకాన్ని ప్రారంభించి నిరాటంకంగా కొనసాగించారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది రైతులకు లబ్ధి చేకూరింది. మరోవైపు పరిశ్రమలకు యూనిట్‌పై సగటున 17 పైసలు చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. 2009 సెప్టెంబర్‌లో రాజశేఖరరెడ్డి మరణించిన వెంటనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోశయ్య ఒక్కసారిగా కరెంటు చార్జీలను పెంచి భారీ భారాన్ని ప్రజల నెత్తిన మోపగా, ఆ తర్వాత వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతియేటా చార్జీలు పెంచటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక అది చాలదన్నట్టు సర్దుబాటు చార్జీల పేర, అసలు చార్జీలను మించి వసూలు చేయటం మొదలుపెట్టారు. ఇక ఉచిత విద్యుత్ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ రెండున్నర ఎకరాల మాగాణి (తరి) పొలం ఉన్న వారిని అందుకు అనర్హులుగా ప్రకటించారు. ఇలా లక్షన్నర మంది రైతులకు ఆ పథకాన్ని దూరం చేశారు. వెరసి రాజశేఖరరెడ్డి మరణానంతరం తర్వాత సర్దుబాటు చార్జీలు సహా కరెంటు బిల్లుల రూపంలో ప్రభుత్వం అదనంగా రూ. 24,218 కోట్ల భారాన్ని మోపింది. బస్సు చార్జీల మోత కరెంటు బిల్లుల తరహాలోనే ఆర్టీసీ చార్జీల విషయంలోనూ వైఎస్ వ్యవహరించారు. ప్రజలపై భారం పడొద్దని తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం వాటి జోలికే వెళ్లలేదు. ఆయన మరణానంతరం అడ్డూఅదుపూ లేకుండా చార్జీల మోత మోగించిన ప్రస్తుత ప్రభుత్వం గడచిన నాలుగేళ్లలో ఏకంగా రూ.1980 కోట్లమేర ప్రజల జేబుల నుంచి అదనంగా కొల్లగొట్టింది. చివరకు పేదల కోసం ఉద్దేశించిన పల్లెవెలుగు బస్సులనూ చార్జీల పెంపునుంచి మినహారుుంచలేదు. వ్యాట్ వేటు..! ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా భావించే విలువ ఆధారిత పన్ను (వ్యాట్) అంటేనే ప్రజలు వణికిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.55 వేల కోట్ల మేర పిండుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవటం దీనికి నిదర్శనం. అంతకుముందు సంవత్సరం కంటే ఏకంగా రూ.10 వేల కోట్ల మేర అధికంగా లక్ష్యాన్ని నిర్ధారించిన ప్రభుత్వం అవకాశం ఉన్న వస్తువునల్లా వ్యాట్ పరిధిలో చేరుస్తూ, 5 శాతం పన్ను పరిధిలో ఉన్నవాటిని 14.5 శాతం పరిధిలోకి తెస్తూ ప్రజలను పీల్చిపిప్పి చేస్తోంది. లక్ష్యాన్ని పెంచినా ఆదాయం సరిపోవటం లేదన్న కారణంతో వచ్చే ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని హీనపక్షంగా మరో రూ. 8 వేల కోట్లకు పెంచే యోచనలో ఉంది. 2008-09 వ్యాట్ లక్ష్యం రూ. 22,500 కోట్లు ఉంటే వైఎస్ దాన్ని మరుసటి యేడాదికి కేవలం వేయి కోట్లమేర మాత్రమే పెంచారు. కానీ ఆయన మరణించిన తొలి సంవత్సరంలోనే రోశయ్య ప్రభుత్వం ఏకంగా రూ. 29,144 కోట్ల లక్ష్యాన్ని పెడితే అది కాస్తా 2013-14 నాటికి రూ.55 వేల కోట్లకు పెరగటం విశేషం. ఈ విధంగా ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ప్రజల నుంచి ఏకంగా రూ.23 వేల కోట్లకుపైగా అదనంగా దండుకుంది. వాహన కొనుగోలుదారులకు వెతలు వాహన కొనుగోలుదారులనూ ప్రభుత్వం వదిలిపెట్టలేదు. 2009-10 ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖ ద్వారా రూ.2,300 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థికమాంద్యం, రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితుల ప్రభావంతో అభివృద్ధి మందగించడంతో రాష్ట్రంలో మోటారు వాహనాల విక్రయం నేల చూపులు చూస్తోంది. కానీ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకుండా.. పన్నుల మోత మోగిస్తోంది. త్రైమాసిక పన్నుల జాబితాలో ఉన్న పలువాహనాలను జీవితపన్ను పరిధిలోకి తీసుకురావడం, పన్నులు పెంచడం, రెండో వాహనం కొంటే గరిష్టంగా 14.5 శాతం పన్ను విధించడం.. తదితర చర్యల తో ప్రజల మీద భారం పెంచేసింది. తద్వారా రెండువేల కోట్లకు పైగా ఆర్జించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల బాదుడు ప్రభుత్వం ఆదాయం పెంపు కోసం స్థిరాస్తి కొనుగోలుదారులను కూడా పీల్చిపిప్పి చేసింది. 2009 - 10 ఆర్థిక సంవత్సరంలో రూ.3,064 కోట్లు ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 2012- 13 నాటికి రూ.6,600 కోట్లకు పెరగడం గమనార్హం. 2010లో ప్రభుత్వం భూములు, స్థలాల మార్కెట్ విలువలను భారీగా పెంచింది. 29 విభాగాలుగా ఉన్న భూములు, స్థలాలను కేవలం అయిదు కేటగిరీలుగా మార్చేసింది. పట్టణాల్లో అయితే వాణిజ్య, నివాస అనే రెండు వర్గీకరణలకే పరిమితం చేసింది. అప్పట్లో కొన్నిచోట్ల భూములు, స్థలాల మార్కెట్ విలువలను 400 నుంచి 600 శాతం వరకూ పెంచింది. అందువల్లే 2009 -10లో రూ.3,064 కోట్లు ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ రాబడి 2010 -11 సంవత్సరంలో రూ.4,432 కోట్లకు పెరిగింది. 2013లో కూడా ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములు, స్థలాలు, భవనాల మార్కెట్ విలువలను భారీగా పెంచింది. పట్టణాలకు సమీపంలోని గ్రామాల్లో అక్కడక్కడా ఒకటి రెండు ఇళ్లు ఉన్న వ్యవసాయ భూములను కూడా ఇళ్ల స్థలాల వర్గీకరణలోకి మార్చింది. దీంతో వీటి కొనుగోలుదారులపై భారీ భారం పడింది. నగరపాలక, పురపాలక సంఘాల్లో గత మూడేళ్ల కాలంలోనే ఏకంగా ఆస్తిపన్ను పెంపు ద్వారా రూ. 800 కోట్లు, మంచినీటిపై రూ. 200 కోట్ల భారాన్ని మోపింది. భవన నిర్మాణ అనుమతుల ఫీజుల్లో రూ. 300 కోట్ల పెరుగుదల నమోదైంది. -
భారంగా.. బతుకు బండి..
విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరిగిందని, ఇతర ప్రాంతాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయడం కష్టంగా ఉందని కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ గత ఏప్రిల్ నుంచి చార్జీల మోత్త మోగించింది. ఈ ప్రభావం జిల్లాలోని కనెక్షన్లపై 41 శాతానికిపైగా భారం పడింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా ప్రజలపై నెలకు సుమారు రూ. 10 కోట్లకుపైగా భారం పడినట్లు అంచనా. అదే విధంగా పాత విద్యుత్ వినియోగంపై సర్దుబాటు పేరుతో చార్జీలను ముక్కుపిండి వసూలు చేశారు. పాత బకాయిల పేరుతో జిల్లా వినియోగదారులపై యూనిట్‌కు రూ. 0.14 పైసల నుంచి రూ. 1.22 పైసల వరకు ప్రతీ నెల బిల్లలో జమ చేసింది. డిస్ట్రీబ్యూషన్ కంపెనీల లెక్కల ప్రకారం సగటున యూనిట్‌కు రూ. 0.63 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో జిల్లా విద్యుత్ వినియోగదారులపై (వ్యవసాయం మినహా) రూ. 90కోట్ల మేరకు అదనపు భారం పడింది. దీంతో పాటు విద్యుత్ వినియోగదారులకు ఫిక్స్డ్ చార్జీల పేరుతో అదనపు భారం మోపింది. ఈ ఫిక్స్డ్ చార్జీలు గత ఏప్రిల్ నెల నుంచి క్యాటగిరి-2( వ్యాపార విద్యుత్ వినియోగదారులు) వినియోగదారులపై కిలోవాట్‌కు రూ. 50 చొప్పున అదనపు భారం మోపారు. ఇలా ప్రతీ నెలకు రూ. 49లక్షల మేరకు అదనపు బారం పడింది. ఇలా చార్జీల పెంపు, సర్దుబాటు బాదుడు, ఫిక్స్డ్ చార్జీల పేరుతో మొత్తం సంవత్సరానికి రూ. 220కోట్లకు పైగా జిల్లా ప్రజలపై భారం పడింది. భారమైన బస్సు ప్రయాణం ఇబ్బడి ముబ్బడిగా విద్యుత్ చార్జీలను పెంచిన సర్కారుకు అహం తీరలేదు. బస్సు చార్జీలు, సర్వీస్ చార్జీలు, చివరకు విద్యార్థుల బస్ పాసులపై కూడా అదనపు భారం మోపింది. వీటన్నింటి రూపేణ సంవత్సరానికి జిల్లా ప్రజలపై రూ. 18 కోట్లకుపైగా భారం పడినట్లు అధికారుల అంచనా. ఏసీ, సూపర్ లగ్జరీ, ఎక్స్పెస్ చార్జీలతోపాటు పేద, మధ్య తరగతి వర్గాలు ప్రయాణించే పల్లెవెలుగు బస్సులను కూడా వదలకుండా చార్జీలు పెంచారు. ఏసీ బస్సులపై 12శాతం, సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్‌లపై 10శాతం, పల్లెవెలుగు బస్సులపై 8శాతం అదనంగా చార్జీలు పెంచారు. దీంతో జిల్లా ప్రజలపై నెలకు సుమారుగా రూ.2 కోట్లు అదనపు భారం పడింది. దీంతోపాటు సర్వీసు చార్జీల పేరిట ప్రతీ టికెట్టుకు రూపాయి చొప్పున పెంచి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా వ్యవహరించింది. వీటితోపాటు పేద విద్యార్థులకు అందించే బస్సు పాస్‌లపై కూడా అదనపు భారం మోపారు. దీంతో జిల్లాలోని 38వేల మంది విద్యార్థుల ద్వారా నెలకు సుమారు రూ. 40లక్షల మేరకు విద్యార్థుల ముక్కుపిండి వసూలు చేశారు. చుక్కల్లో నిత్యావసరాల ధరలు... మరోపక్క నిత్యావసరాల ధరలు అదుపు చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. నిరుపేదలకు సరఫరా చేసే నిత్యావసరాలను అంతంత మాత్రంగానే అందజేయడంతో మిగిలినవి కొనుగోలు చేయడానికి ప్రజలు బెంబేలెత్తారు. ఉల్లి గడ్డలు పేదవారికి కన్నీటినే మిగిల్చాయి. కిలో రూ. 60 నుంచి కిందకు దిగలేదు. అలాగే బియ్యం కిలో రూ. 50ల పైమాటే ఉంది. మంచినూనె, కూరగాయలు, అల్లం, పప్పులు, ఉప్పులు, గ్యాస్, దుస్తులు ఒక్కటా.. రెండా...ఇలా అన్నింటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఈ ఏడాదిలో మొత్తం రూ. 750కోట్ల మేరకు అదనపు భారం పడినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మిన్నంటిన నిరసనలు విద్యుత్ చార్జీలు, సర్దుబాటు, ఫిక్స్డ్ చార్జీల పేరుతో విద్యుత్ బిల్లులు, ఆర్టీసీ బస్సు చార్జీలు, డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, దుస్తులు ఇలా అన్ని రకాల వస్తువులపై పన్నులతో ధరలు పెం చడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల బతు కు భారంగా మారింది. దీంతో జిల్లాలో వివిధ రాజకీయ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్ ఇతర రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. ధరలు తగ్గించాలని ఉద్యమాలు చేశారు. బంద్‌లు పాటిం చారు. అధికారులను నిలదీశారు. కలెక్టరేట్ ముట్టడించారు. బస్సు లు నడవనీయలేదు. పేదలపై భారం మోపిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని, ధరలు పెంచి న కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్‌కు తగిన సమయంలో తగిన విధంగా ప్రజలు బుద్ది చెబుతారని హెచ్చరించారు. మొత్తం మీద 2013వ సంవత్సరం పేద మధ్య తరగతి ప్రజల నుంచి అన్నివర్గాల వారిని ఆర్థికంగా ఇబ్బందుల కు గురి చేసింది. -
చార్జీలు పెంచిన ఎంఎస్ఆర్టీసీ
సాక్షి, ముంబై: బస్సు ప్రయాణం మరింత భారమయింది. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (ఎమ్మెస్సార్టీసీ) బస్సు చార్జీలను మరోసారి పెంచింది. ఈ ఏడాదిలో చార్జీలను పెంచడం ఇది రెండోసారి. రాష్ట్ర రవాణాసంస్థ (ఎస్టీయే) ఎమ్మెస్సార్టీసీ బస్సు చార్జీలను 2.6 శాతం పెంచేందుకు బుధవారం ఆమోదం తెలిపింది. ఈ సంస్థ గతంలోనూ చార్జీలను 6.48 శాతం పెంచింది. పెరిగిన చార్జీలు జూలై రెండో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే కొత్తగా పెరిగిన చార్జీలను శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి వర్తింపజేయడానికి ఎస్టీయే అంగీకరించింది. అధికారులు వెల్లడించిన సమాచారం మేరకు.. గత నెలలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో ఆర్థిక భారాన్ని తట్టుకునేందుకు 2.6 శాతం మేర బస్సు చార్జీలు పెంచడానికి అనుమతించాలని ఎమ్మెస్సార్టీసీ ప్రతిపాదించింది. దీనిపై స్పందించిన రవాణాశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఇటీవల ఎస్టీయే సమావేశం నిర్వహించారు. చార్జీలను పెంచేందుకు ఎస్టీయే అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఎమ్మెస్ఆర్టీసీ దేశంలోనే రెండో అతిపెద్ద ప్రజారవాణాసంస్థగా పేరుపొందింది. దీనిదగ్గర 17 వేల బస్సులు ఉన్నాయి. ఇవి ముంబై నుంచి పుణే, ముంబై నుంచి గోవా, ముంబై నుంచి బెంగుళూరు..తదితర మార్గాల్లో సేవలు అందిస్తున్నాయి. ఎమ్మెస్సార్టీసీ బస్సుల్లో రోజుకు 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. ముంబైలోని చాలా ప్రాంతాల్లోనూ ఈ బస్సులు సేవలను అందజేస్తున్నాయి. బాంద్రాకుర్లా కాంప్లెక్స్ నుంచి బోరివలి వరకు, పన్వేల్ నుంచి మంత్రాలయ వరకు బస్సులు నడుపుతున్నారు. ఒకే ఏడాదిలో రెండోసారి చార్జీలను పెంచడంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
బస్సుచార్జీల పెంపుపై మండిపడ్డ వైఎస్సాఆర్ సిపి, ఇస్రోకి అభినందనలు తెల్పిన జగన్
-
ఆర్టీసీ చార్జీల మోత
కంబాలచెరువు(రాజమండ్రి), న్యూస్‌లైన్ : ఆర్టీసీ చార్జీల మోత మోగింది. నష్టాల నుంచి గట్టెక్కే పేరుతో ప్రయాణికుడిపై ప్రభుత్వం గట్టిబాదుడే బాదింది. పెంచిన చార్జీలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. జిల్లాలోని తొమ్మిది డిపోల నుంచి 830 ఆర్టీసీ బస్సులు ప్రతి రోజూ సుమారు 3.50 లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతూ, సుమారు 3 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తాయి. తద్వారా రోజూ సుమారు రూ.80 లక్షల పైనే ఆదాయం సమకూరుతోంది. పెరిగిన చార్జీల వల్ల ప్రయాణికులపై మరింత భారం పడనుండగా, ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరనుంది. రాజమండ్రి నుంచి కొన్ని ప్రాంతాలకు పెరిగిన చార్జీల వివరాలు... పాత చార్జీ కొత్త చార్జీ రాజమండ్రి - కాకినాడ నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ రూ.50 రూ.55 రాజమండ్రి - కాకినాడ నాన్‌స్టాప్ డీలక్స్ రూ.55 రూ.61 రాజమండ్రి - కాకినాడ నాన్‌స్టాప్ సూపర్ లగ్జరీ రూ.60 రూ.66 రాజమండ్రి - హైదరాబాద్ సూపర్ లగ్జరీ ర ూ.425 రూ.465 కాకినాడ - హైదరాబాద్ సూపర్‌లగ్జరీ రూ.471 రూ.512 రాజమండ్రి - భద్రాచలం ఎక్స్‌ప్రెస్ రూ.169 రూ.186 రాజమండ్రి - విజయవాడ ఎక్స్‌ప్రెస్ రూ.121 రూ.132 రాజమండ్రి - విశాఖపట్నం డీలక్స్ రూ.179 రూ.198 సామాన్యుడికి పెను భారమే ఆర్టీసీ చార్జీలు పెంచడం సామాన్యుడికి భారమే. ఎప్పుడెప్పుడు చార్జీలు పెంచాలా అనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వానికి సమైక్యాంధ్ర ఉద్యమం ఒక సాకులా తగిలింది. ఆ పేరుతో చార్జీలు పెంచి పేదవాడి ప్రయాణ సాధనమైన ఆర్టీసీ బస్సును వారికి దూరం చేస్తున్నారు. - ఎన్ఎన్ఎస్ఆర్పీఎస్ గుప్తా, రాజమండ్రి ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీ నష్టాలను అధిగమించేందుకు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఆర్టీసీ చార్జీలను పెంచేసింది. ఇది చాలా దారుణం. దీనిని అందరం వ్యతిరేకిద్దాం. ఇలా పెంచుకుంటేపోతే చివరికి రైలు ఏసీ టిక్కెట్ చార్జీలకంటే ఆర్టీసీ బస్సు చార్జీలు అధికం అయినా ఆశ్యర్యపోనవసరంలేదు. దీనిని అన్ని రాజకీయ పార్టీలూ వ్యతిరేకించాలి. పెంచిన చార్జీలను తగ్గించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. - రామకృష్ణ, ప్రయాణికుడు, రాజమండ్రి -
రేపు అర్ధరాత్రి నుంచి ఆర్టీసి ఛార్జీల పెంపు
-
రేపు అర్ధరాత్రి నుంచి ఆర్టీసి ఛార్జీల పెంపు
హైదరాబాద్: రేపు అర్ధరాత్రి నుంచి ఆర్టీసి బస్ ఛార్జీలు పెరగనున్నాయి. ఆర్టీసి ఛార్జీల పెంపు ఫైలుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంతకం చేశారు. ఏసీ బస్సు సర్వీసులకు 12 శాతం, లగ్జరీ సర్వీసులకు 10 శాతం, ఆర్డినరీ, పల్లెవెలుగు సర్వీసులకు 8 శాతం చొప్పున ఛార్జీలు పెంచారు. ఛార్జీలు పెంపు వల్ల ప్రయాణికులపై 600 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గ్యాస్ ధర పెంచేశారు. ఉల్లిపాయల ధర రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. ఈ పరిస్థితులలో మళ్లీ ఆర్టీసి బస్సు ఛార్జీలు పెంచారు. -
పెరిగిన స్లీపర్‌బస్సు చార్జీలు
పింప్రి, న్యూస్‌లైన్: మహారాష్ర్ట రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఎమ్మెస్సార్టీసీ) ఆకస్మాత్తుగా వోల్వో ఏసీ స్లీపర్ బస్సుల చార్జీలు పెంచడంతో దీపావళికి స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులపై తీవ్రభారం పడుతోంది. దీంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలవైపు మొగ్గుచూపుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్‌కు డిమాండ్ పెరగడంతో అవి తమ ఇష్టం వచ్చినట్లు చార్జీలను వసూలు చేస్తున్నాయని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై నుంచి చాలా మంది నిత్యం హైదరాబాద్, విజయవాడ, ఔరంగాబాద్, బెల్గావ్, హుబ్లీ, సూరత్, అకోలా, నాగ్‌పూర్‌కు వె ళ్తుంటారు. వోల్వో బస్సులో అహ్మదాబాద్‌కు వెళ్లేందుకు ప్రస్తుతం రూ.1,000 ఉండగా దానిని ఇప్పుడు రూ.2,500లకు పెంచారు. నాగ్‌పూర్‌కు వెళ్లేందుకు ప్రస్తుతం రూ.1,100 ఉండగా రూ.2,500లకు పెంచారు. హుబ్లీకి ప్రస్తుత చార్జీ ధర 1,000 ఉండగా రూ.2,000లకు పెంచారు. హైదరాబాద్‌కు ప్రస్తుతం రూ.1,500 ఉండగా రూ.3,000లకు పెంచారు, బెంగుళూరు రూ.1,300 ఉండగా, రూ.2,500లకు పెంచారు. సూరత్‌కు వెళ్లేందుకు ప్రస్తుత చార్జీ రూ.500 ఉండగా రూ.1,000, అకోలాకు రూ.600 ఉండగా, రూ.1,600లకు పెంచారు. బెల్గావ్‌కు ప్రస్తుత చార్జీ రూ.400 కాగా ఇక నుంచి రూ.900 చెల్లించాలి. ఇక ప్రైవేట్ బస్సుల్లో వేర్వేరు చార్జీలతో టికెట్లు విక్రయించడంతో సామాన్య ప్రజలు దేనిని ఎంచుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. కొంతమంది తమ ప్రయాణాలనే వాయిదా వేసుకుంటున్నారని బాంద్రాకు చెందిన తెలుగువ్యక్తి ఒకరు అన్నారు. రైళ్లలో వెళ్దామనుకున్నా ఏ బోగీ చూసినా కిక్కిరిసి కనిపిస్తోందని, రోజూ రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్ల చుట్టూ తిరగలేక ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నామని వివరించారు. బస్సులు, రైళ్లలో రిజర్వేషన్లు ఇది వరకే పూర్తి కావడం, ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో సెలవులు వృథా అవుతున్నాయని విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు అధ్వానంగా ఉంటుందన్నాయని చెబుతున్నారు. రైల్వే పండగ సమయాల్లోనైనా జనరల్ బోగీల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
బస్సు ఛార్జీలు పెంచే యోచనలో ప్రభుత్వం
-
బస్సు ఛార్జీలు పెంచే యోచనలో ప్రభుత్వం
హైదరాబాద్: ఆర్టీసి బస్సు ఛార్జీలు పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. నిర్వహణ భారం పెరిగిపోవడంతో ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసి అధికారులు చెబుతున్నారు. సీమాంధ్రలో సమ్మె కారణంగా ఆర్టీసికి తీవ్ర నష్టం వాటిల్లింది. దానికి తోడు డీజిల్ ధర కూడా పెరిగింది. ఈ పరిస్థితులలో బస్సు ఛార్జీలు పెంచాలని నిర్ణయించారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఛార్జీలు పెంచుతారు. అయితే ఛార్జీలను అతిగా పెంచరని, స్వల్పంగానే పెంచుతారని భావిస్తున్నారు. ప్రయాణికులకు మరీ భారంగా లేకుండా పెంపుదల ఉంటుందని చెబుతున్నారు. -
మళ్లీ పెట్రో భారం
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వాహనదారులపై మరోసారి పెట్రో బాంబు పేలింది. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న వినియోగదారులను కేంద్రం మరోసారి నడ్డివిరిచింది. జూలైలో లీటరు పెట్రోల్‌పై రూ.1.55 చొప్పున పెంచిన కేంద్రం... శనివారం పెట్రోల్, డీజిల్ రెండింటిపైనా వడ్డించింది. లీటరు పెట్రోల్‌పై రూ.2.30, డీజిల్‌పై 50 పైసల చొప్పున పెంచింది. పెరిగిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. దీని వల్ల జిల్లా ప్రజలపై నెలకు రూ.2.52 కోట్లఅదనపు భారం పడనుంది. జిల్లాలో 220 పెట్రోల్ బంకులున్నాయి. అన్ని బంకుల్లో కలిపి రోజుకు రెండు లక్షల లీటర్ల పెట్రోల్ అమ్ముడవుతోంది. తాజా పెంపు వల్ల లీటర్ పెట్రోల్ ధర రూ.75.96 నుంచి రూ.78.26కు చేరింది. దీంతో రోజుకు రూ.4.60 లక్షల చొప్పున నెలకు రూ.1.38 కోట్ల అదనపు భారం పడనుంది. అలాగే జిల్లా వ్యాప్తంగా రోజుకు 7.64 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. లీటరు డీజిల్ ధర రూ.55.94 నుంచి రూ.56.44 చేరింది. ఆ లెక్కన రోజుకు రూ.3.82 లక్షల చొప్పున నెలకు రూ.కోటి 14 లక్షల 60 వేల అదనపు భారం పడనుంది. పెట్రోల్, డీజిల్ కలిపి మొత్తంగా నెలకు జిల్లా ప్రజలపై రూ. 2 కోట్ల 52 లక్షల 60 వేల అదనపు భారం పడనుంది. ఏడాదికి రూ.30.24 కోట్ల భారం పడుతోంది. ఇప్పటికే ఉప్పు మొదలుకుని కూరగాయల వరకు అన్ని నిత్యావసర ధరలు సెగలు కక్కుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పుడు పెట్రో ధరలు కూడా పెరగడంతో వాహనదారులతో పాటు సామాన్య ప్రజలు కూడా అవస్థ పడనున్నారు. పెట్రో ధరల పెంపు వల్ల నిత్యావసరాల ధరలు, ఆటో, బస్సు చార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది.