
హన్మకొండ: బస్సుల్లో చిల్లర సమస్యకు ఆర్టీసీ పరిష్కారం చూపింది. ఈ మేరకు చార్జీలను సర్దుబాటు చేసింది. దీంతో కొన్ని స్టేజీలకు స్వ ల్పంగా చార్జీలు పెరుగగా, మరికొన్ని స్టేజీలకు చార్జీలు తగ్గాయి. చిల్లర ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది మధ్యన ఘర్షణలకు దారితీస్తోంది. ఈ క్రమంలో ఆర్టీసీ యాజ మాన్యం చిల్లర సమస్యలను పరిష్కరించాలని తీసుకున్న నిర్ణయం మేరకు చార్జీల్లో మార్పులు చేశాయి. వరంగల్ మహానగరంలోని వరంగల్, హన్మకొండ, కాజీపేట మధ్యన ఆర్టీసీ లోకల్ బస్సులు సేవలు అందిస్తున్నాయి.
సిటీ ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సులు నగర ప్రయాణికులకు రవాణా సేవలు అందిస్తున్నాయి. చిల్లర సమస్య తొలగించేందుకు ఈ బస్సుల చార్జీలు సర్దుబాటు చేశారు. సర్దుబాటు చేసిన చార్జీలు ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ తోట సూర్యకిరణ్ తెలిపారు.