
శిద్ధా రాఘవ రావు
మరోసారి ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది.
హైదరాబాద్: మరోసారి ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఛార్జీల పెంపును పరిశీలిస్తున్నట్లు ఏపి రోడ్లు, రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదిస్తే ఛార్జీలు పెంచుతామన్నారు. ఏడాది కిందట ఛార్జీలు పెంచినట్లు తెలిపారు.
డీజిల్ రేట్లు 7 సార్లు పెరగడంతో ఛార్జీలు పెంచకతప్పదన్నారు. ఏపిఎస్ఆర్టిసికి 250 కోట్ల రూపాయలు జమచేస్తామని చెప్పారు. ఉద్యోగులకు దసరా అడ్వాన్స్ ఇస్తున్నామన్నారు. నవంబర్‌లో డిఏపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి రాఘవరావు చెప్పారు.
**