రేపు అర్ధరాత్రి నుంచి ఆర్టీసి బస్ ఛార్జీలు పెరగనున్నాయి. ఆర్టీసి ఛార్జీల పెంపు ఫైలుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంతకం చేశారు. ఏసీ బస్సు సర్వీసులకు 12 శాతం, లగ్జరీ సర్వీసులకు 10 శాతం, ఆర్డినరీ, పల్లెవెలుగు సర్వీసులకు 8 శాతం చొప్పున ఛార్జీలు పెంచారు. ఛార్జీలు పెంపు వల్ల ప్రయాణికులపై 600 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గ్యాస్ ధర పెంచేశారు. ఉల్లిపాయల ధర రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. ఈ పరిస్థితులలో మళ్లీ ఆర్టీసి బస్సు ఛార్జీలు పెంచారు.
Published Mon, Nov 4 2013 7:11 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM
Advertisement
Advertisement
Advertisement