కంబాలచెరువు(రాజమండ్రి), న్యూస్‌లైన్ : ఆర్టీసీ చార్జీల మోత మోగింది. నష్టాల నుంచి గట్టెక్కే పేరుతో ప్రయాణికుడిపై ప్రభుత్వం గట్టిబాదుడే బాదింది. పెంచిన చార్జీలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. జిల్లాలోని తొమ్మిది డిపోల నుంచి 830 ఆర్టీసీ బస్సులు ప్రతి రోజూ సుమారు 3.50 లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతూ, సుమారు 3 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తాయి. తద్వారా రోజూ సుమారు రూ.80 లక్షల పైనే ఆదాయం సమకూరుతోంది. పెరిగిన చార్జీల వల్ల ప్రయాణికులపై మరింత భారం పడనుండగా, ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరనుంది.
రాజమండ్రి నుంచి కొన్ని ప్రాంతాలకు పెరిగిన చార్జీల వివరాలు...
పాత చార్జీ కొత్త చార్జీ
రాజమండ్రి - కాకినాడ నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ రూ.50 రూ.55
రాజమండ్రి - కాకినాడ నాన్‌స్టాప్ డీలక్స్ రూ.55 రూ.61
రాజమండ్రి - కాకినాడ నాన్‌స్టాప్ సూపర్ లగ్జరీ రూ.60 రూ.66
రాజమండ్రి - హైదరాబాద్ సూపర్ లగ్జరీ ర ూ.425 రూ.465
కాకినాడ - హైదరాబాద్ సూపర్‌లగ్జరీ రూ.471 రూ.512
రాజమండ్రి - భద్రాచలం ఎక్స్‌ప్రెస్ రూ.169 రూ.186
రాజమండ్రి - విజయవాడ ఎక్స్‌ప్రెస్ రూ.121 రూ.132
రాజమండ్రి - విశాఖపట్నం డీలక్స్ రూ.179 రూ.198
సామాన్యుడికి పెను భారమే
ఆర్టీసీ చార్జీలు పెంచడం సామాన్యుడికి భారమే. ఎప్పుడెప్పుడు చార్జీలు పెంచాలా అనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వానికి సమైక్యాంధ్ర ఉద్యమం ఒక సాకులా తగిలింది. ఆ పేరుతో చార్జీలు పెంచి పేదవాడి ప్రయాణ సాధనమైన ఆర్టీసీ బస్సును వారికి దూరం చేస్తున్నారు.
- ఎన్‌ఎన్‌ఎస్‌ఆర్‌పీఎస్ గుప్తా, రాజమండ్రి
ప్రభుత్వంలో విలీనం చేయాలి
ఆర్టీసీ నష్టాలను అధిగమించేందుకు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఆర్టీసీ చార్జీలను పెంచేసింది. ఇది చాలా దారుణం. దీనిని అందరం వ్యతిరేకిద్దాం. ఇలా పెంచుకుంటేపోతే చివరికి రైలు ఏసీ టిక్కెట్ చార్జీలకంటే ఆర్టీసీ బస్సు చార్జీలు అధికం అయినా ఆశ్యర్యపోనవసరంలేదు. దీనిని అన్ని రాజకీయ పార్టీలూ వ్యతిరేకించాలి. పెంచిన చార్జీలను తగ్గించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.
- రామకృష్ణ, ప్రయాణికుడు, రాజమండ్రి
ఆర్టీసీ చార్జీల మోత
Published Tue, Nov 5 2013 2:37 AM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
Advertisement
Advertisement