
మాజీ మంత్రి పేర్ని నాని బస్సు డ్రైవర్‌గా మారారు. కార్యకర్తలతో వెళ్తున్న బస్సును ఆయన స్వయంగా నడిపారు.
సాక్షి, కృష్ణా జిల్లా: జన జాతరకు.. జన గోదావరి సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ‘సిద్ధం’ సభా వేదికగా శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. మచిలీపట్నం నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీ సంఖ్యలో సిద్ధం సభకు బస్సుల్లో కదిలారు.
కార్యకర్తలతో కలిసి కృష్ణాజిల్లా వైఎస్సార్‌సీపీ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు బస్సులో దెందులూరుకు బయల్దేరారు. ఈ క్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని బస్సు డ్రైవర్‌గా మారారు. కార్యకర్తలతో వెళ్తున్న బస్సును ఆయన స్వయంగా నడిపారు.
ఇదీ చదవండి: YSRCP: సరికొత్త సామాజిక విప్లవం..