శిశువుతో కండక్టర్ వసంతమ్మ, ఆస్పత్రిలో తల్లితో వసంతమ్మ
బనశంకరి: కేఎస్ ఆర్‌టీసీ బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో మహిళా కండక్టర్ డాక్టర్‌గా మారి సురక్షితంగా కాన్పు చేసింది. చిక్కమగళూరు డిపోకు చెందిన కేఎస్ ఆర్‌టీసీ బస్సు సోమవారం బెంగళూరు నుంచి చిక్కమగళూరుకు వెళ్తోంది. బెంగళూరు నుంచి బేలూరుకు ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి ప్రసవ వేదన ఆరంభమైంది.
బస్సు వెళ్లే మార్గంలో అటు ఇటు 16 కిలోమీటర్ల వరకూ ఎలాంటి ఆసుపత్రి లేదు. దీంతో బస్సులోని మహిళా కండక్టర్ ఎస్.వసంతమ్మ బస్సును నిలిపి ప్రయాణికులను కిందికి దింపివేశారు. ఆమె గర్భిణికి కాన్పు చేయగా ఆడపిల్ల పుట్టింది. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు.మహిళ నిరుపేద కావడంతో చేతిలో ఖర్చులకు కూడా డబ్బులు లేవు, ఆమె పరిస్థితిని గమనించి కండక్టర్, డ్రైవరు ప్రయాణికులు కలిసి రూ.1,500 సేకరించి బాలింతకు అందజేశారు. తరువాత అంబులెన్స్ ద్వారా శాంతిగ్రామ ఆసుపత్రిలో చేర్చారు. మహిళా కండక్టర్‌ను ఆ శాఖ ఉన్నతాధికారులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment